Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

ICC T20 World Cup Trophy  To Sakshi
‘సాక్షి’కి టీ 20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ

మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్‌కప్‌ సమరం ఆరంభం కానుంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్‌ ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న తరుణంలో క్రికెట్‌ అభిమానులు ఆ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్‌ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్‌లో మొత్తం 55 టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.‘సాక్షి’కి రానున్న వరల్డ్‌కప్‌ ట్రోఫీఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ నేడు ఆదివారం(మే 19) ‘సాక్షి’ ఆఫీస్‌కు రానుంది. ప్రొటెక్టెడ్‌ కంటైనర్‌లో సాక్షి ఆఫీస్‌కు తీసుకురానున్నారు. ఈ ట్రోఫీని సాక్షి ఆఫీస్‌కు తీసుకువచ్చి అక్కడ పని చేసే ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు.ఈ ట్రోఫీతో పాటు టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ పీయూష్‌ చావ్లా కూడా సాక్షి ఆఫీస్‌కు రానున్నారు. ఈ క్రమంలోనే సాక్షి ఉద్యోగస్తులతో పీయూష్‌ చావ్లా ముచ్చటించనున్నారు. ఇక ముగ్గురు నుంచి నలుగురు స్టార్‌ స్పోర్ట్స్‌ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్‌కు విచ్చేయనుంది.కాగా జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఈ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది. భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న జరుగనుంది. తొలిసారి ఉగాండ..టోర్నీలో భాగంగా ఉగాండ తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. నమీబియా సైతం టీ 20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. కరీబియన్‌ దీవుల్లోని ఆంటిగ్వా అండ్‌ బర్బుడా, బార్బడోస్‌, డొమినికా, గయానా,సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ద గ్రెనడైన్స్‌ నగరాల్లో .. యూఎస్‌ఏలోని డల్లాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వీటిల్లో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్‌-8లో నిలిచిన ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌, కెనడా, నేపాల్‌, ఓమన్‌, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్‌ ద్వారా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యాయి.

 SIT Investigation Into Violent Incidents In After AP Election
AP: సిట్‌ దూకుడు.. అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు!

సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజిలాల్‌ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్‌ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజిలాల్‌ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్‌ బృందం ప్రధానంగా దృష్టిసారించింది. కాగా, హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మరోవైపు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్‌లను సిట్‌ నమోదు చేయనుంది. అయితే, కొందరు పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సిట్‌ గుర్తించింది. ఇక, హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను సిట్‌ బృందం పరిశీలిస్తోంది.

AP Elections 2024: May 19th Political Updates In Telugu
May 19th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌

May 19th AP Elections 2024 News Political Updates11:45 AM, May 19th, 2024టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ తండ్రి మృతి..శ్రీకాకుళంటీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ తండ్రి మృతిగురువారం వైఎస్సార్‌సీపీ ఏజెంట్ మాధవరావు తండ్రి తోట మల్లేష్‌పై అచ్చెన్నాయుడు అనుచరుల దాడికోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ బూత్-288లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న మాధవరావుమాధవరావు కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకులుమాధవరావు తండ్రి తోట మల్లేష్ గుడిలో పూజ చేస్తుండగా దాడికి పాల్పడిన అచ్చెన్నాయుడి అనుచరులుదాడిలో తీవ్రంగా గాయపడిన తోట మల్లేష్ రావు.వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలింపు.పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించిన వైద్యులుచికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మరణించిన తోట మల్లేశ్వరరావు 11:10 AM, May 19th, 2024ఎన్నికల విధులకు వెళ్తూ ఏఎస్‌ఐ రమణ మృతిఎన్టీఆర్ జిల్లాఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన విజయవాడ సీపీఎస్ ఏఎస్ఐ రమణరమణను వేగంగా ఢీకొట్టిన ఎర్టిగా కారు.తీవ్రగాయాల పాలైన రమణ..పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుచికిత్సపొందుతూ మృతి చెందిన రమణ 10:40 AM, May 19th, 2024పరారీలో చింతమనేని..ఏలూరు జిల్లాపరారీలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఈనెల 16 రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన చింతమనేనిబెంగళూరు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారంఆయనతోపాటు మరో 14 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తింపుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ పక్కిలో దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిచింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచింతమనేని అతని అనుచరులను పట్టుకునేందుకు ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటుచింతమనేని అతని అనుచురులపై సెక్షన్ 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కేసులు నమోదుచింతమనేని కేసును పర్యవేక్షిస్తున్న నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్యముద్దాయి రాజశేఖర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పెదవేగి పోలీస్ సిబ్బంది.కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన ఏలూరు జిల్లా కోర్టు.రిమాండ్ విధించిన ముద్దాయిని ఏలూరు జిల్లా సబ్ జైలుకు తరలించిన పెదవేగి పోలీస్ సిబ్బంది. 10:00 AM, May 19th, 2024ఏపీలో దూకుడు పెంచిన సిట్‌ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు జరుపుతున్న సిట్మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై ప్రధానంగా దృష్టిసారించిన సిట్అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదారాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన సిట్సోమవారం ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ సారథి వినీత్ బ్రిజిలాల్ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో పని ప్రారంభించిన సిట్ బృందాలుఅల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్న సిట్సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్న సిట్ 9:30 AM, May 19th, 2024ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు..చిత్తూరు జిల్లాజిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరు కానీ అధికారులపై చర్యలుజిల్లాలో 228 మంది పీవో, ఏపీవో, ఓపీవోలపై క్రమశిక్షణ చర్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ 8:00 AM, May 19th, 2024నెల్లూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..ఎస్పీ ఆరిఫ్ హఫీస్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌ పరిధిలో కార్డన్ సెర్చ్జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డెన్ సర్చ్ నిర్వహణ సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7:00 AM, May 19th, 2024మాట నిలుపుకున్న సీఎం జగన్విజయవాడమాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వంఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమనాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమవైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమవైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమజగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్‌మెంట్ కింద రూ.605 కోట్లు జమఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు 6:50 AM, May 19th, 2024తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంఅనంతపురం:తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంపోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులుటీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు 6:40 AM, May 19th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్‌గేట్‌ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 6:30 AM, May 19th, 2024అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం

BRS MLA Malla Reddy Key Comments Over Land Issue At Suchitra Circle
మల్లారెడ్డి భూ వివాదంలో మరో ట్విస్ట్‌..

సాక్షి, కుత్బుల్లాపూర్: సుచిత్ర సెంటర్‌లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర విగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు.ఈ సందర్భంగా వివాద స్థలం ఉన్న ప్రాంతానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి చేరుకున్నారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించడంలేదని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.మరోవైపు భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ల్యాండ్‌ వివాదంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ స్పందించారు. ఆ భూమిలో తాను కూడా కొంత ల్యాండ్‌ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే మేము భూమి కొనుగోలు చేశాము. 15 మంది వ్యక్తుల్లో నేను ​కూడా ఒకడిని.మల్లారెడ్డితో ఈ ల్యాండ్ వివాదంపై పలుమారు మాట్లాడాము. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పారు. 82/e సర్వే నెంబర్‌లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్‌ వేసినా దానికి కౌంటర్ వేయలేదు.మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారు. కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మల్లా రెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శనివారం రోజున సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AAP MLA Somnath Bharti Slams BJP Politics
సాక్షి ఎక్స్‌క్లూజివ్‌: ‘సుష్మా స్వరాజ్‌ కూతురికి టికెట్‌ ఇవ్వొచ్చా?’

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదన్నారు ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత సోమనాథ్‌ భారతి. వారసత్వ రాజకీయాలను బీజేపీ కూడా పోత్సహిస్తోందని సోమనాథ్‌ ఎద్దేవా చేశారు. ఢిల్లీ సాక్షి ప్రతినిధితో సోమనాథ్‌ భారతి ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. అన్యాయంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. స్వాతి మలివాల్‌ ఘటనను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాబోయే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకే ఓటేయండి. అబ్‌ కీ బాత్‌ బీజేపీ తడి పార్‌. బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదు. కేంద్రంలో ఇండియా కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. మరి సుష్మా స్వరాజ్‌ కూతురు టికెట్‌ ఎలా ఇచ్చారు?. దీన్ని రాజకీయ వారసత్వం అనరా?. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Sakshi Editorial On female awareness in AP Assembly elections Polling
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!

ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్‌డీఎస్‌ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్‌ పోల్‌ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్‌డీఎస్‌ తెలిపింది. ఉజ్వల్‌ యోజన, స్వచ్ఛ భారత్‌ అభియాన్, జన్‌ధన్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్‌డీఎస్‌ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్‌ ఛేంజర్స్‌.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్‌ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్‌ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్‌బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్‌ బిహేవియర్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్‌ ఛాయిస్‌పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్‌ పోల్స్‌ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్‌శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్‌’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్‌ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్‌ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్‌ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్‌ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్‌లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్‌లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్‌ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్‌ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

RCB Faf du Plessis Dedicate Man Of The Match Award To Yash Dayal
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్‌ ఎమోషనల్‌

#RCB Vs CSK ఐపీఎల్‌ అంటేనే క్రికెట్‌ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంటర్స్‌(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్‌-17లో ప్లే ఆఫ్ల్స్‌కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నె సూపర్‌ కింగ్స్‌కు షాకిస్తూ మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లిసిస్‌కు మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్‌ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్‌ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ‍మ్యాచ్‌లో మా బౌలర్స్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. నాకు వచ్చిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును బౌలర్‌ యశ్‌ దయాల్‌కు అంకితమిస్తున్నాను. యశ్‌ బౌలింగ్‌ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్‌ గెలిచాం. అందుకే తనకు అవార్డ్‌ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్‌ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. అభిమానులకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెబుతున్నాను. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం​ ఉంది అంటూ కామెంట్స్‌ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్‌..ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్స్‌ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్‌మెన​్‌ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్‌ (54), కోహ్లి (47), రజత్‌ పటీదార్‌ (41), గ్రీన్‌ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్‌ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్‌లో ఉన్న సీఎస్కే కెప్టెన్‌ రుతురాజ్‌ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్‌ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్‌తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్‌ ఫెర్గూసన్‌.. రహానెను ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్‌ ఔట్‌ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్‌ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్‌ (యశ్‌ దయాళ్‌) తొలి బంతికే ధోని సిక్స్‌ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి రెండో బంతికి ధోనీని ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు.

Woman Fulfills Bollywood Dream By Dancing To Sridevis Mitwa In Manali
చాందీని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్‌ చేయాలని..!

కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్‌లో డాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్‌ అనే మహిళ డాన్స్‌ తెగ వైరల్‌ అవుతోంది.1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్‌ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్‌ 1 హీరోయిన్‌గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్‌ హిట్‌. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్‌ సావన్‌ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్‌వా’... పాట కూడా ఆదరణ అందింది. విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్‌తో వేసే స్టెప్స్‌ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్‌ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్‌ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లింది. అక్కడ సేమ్‌ చాందినీ సినిమాలోని లొకేషన్‌ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్‌వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. ఆమె కొడుకు ఆవి వడేకర్‌ షూట్‌ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్‌ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్‌’లాంటి పాటలకు డాన్స్‌ చేయడానికి లొకేషన్స్‌ వెతుక్కుంటున్నారు. View this post on Instagram A post shared by Aavi Vadekar🐢 (@wakeup_aavi) (చదవండి: ఫోటో అదుర్స్‌! దెబ్బకు కస్టమర్‌ బేరం ఆడకుండా కొనాల్సిందే!)

Naturals Ice Cream Founder Raghunandan Srinivas Kamath passes away
‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత

దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్‌ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ పుట్టింది.

Jabardasth Pavithra Car Accident And Emotional Video
'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!

ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement