-
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశి్చమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెపె్టంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెపె్టంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. సెపె్టంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
నిఫ్టీ 20,000 స్థాయికి..?
ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు, 20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్‌లుక్ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల డేటా దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, డిపాజిట్ – బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. నేడు రెండు లిస్టింగులు రత్నవీర్ ప్రెసిíÙన్ ఇంజరీంగ్, రిషిభ్ ఇన్‌్రసూ్టమెంట్ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్ఆర్ కేబుల్, షమీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూలు బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు. -
విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం
హైదరాబాద్‌కు చెందిన వర్ధన్‌కు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు పదో తరగతి చదువుతుంటే, మరొకరు ఐదో తరగతిలో ఉన్నారు. వీరిద్దరినీ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు పంపాలన్నది అతడి లక్ష్యం. వర్ధన్ కేవలం ఆకాంక్షతోనే సరిపెట్టలేదు. తమ పిల్లలు మూడేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఆయన వారి భవిష్యత్ విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించారు. అది కూడా డాలర్‌తో కోల్పోతున్న రూపాయి విలువ క్షీణతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించారు. తన పెట్టుబడులను డాలర్ మారకంలో ఉండేలా చూసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత తన కుమారుడు గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. వర్ధన్ ముందస్తు ప్రణాళిక వల్ల నిశి్చంతగా ఉన్నాడు. విదేశాల్లో కోర్సుల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు స్కూల్ ఆరంభంలో ఉన్నప్పటి నుంచే పెట్టుబడుల ప్రణాళికలు అమలు చేయాలి. ఈ విషయంలో వర్ధన్ అనుసరించిన మార్గం ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. పిల్లలకు అత్యుత్తమ విదేశీ విద్యావకాశాలు ఇవ్వాలని కోరుకునే తల్లిదండ్రులు, అందుకు కావాల్సిన వనరులను సమకూర్చుకునే మార్గాలను చర్చించేదే ఈ కథనం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వెళుతోంది. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 85 దేశాల్లో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది కెనడాలో చదువుతున్నారు. ఆ తర్వాత అమెరికా, యూఏఈ, ఆ్రస్టేలియా, యూకే భారత విద్యార్థుల ముఖ్య ఎంపికలుగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏటేటా క్షీణిస్తూనే ఉండడాన్ని చూస్తున్నాం. గడిచిన 20 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే డాలర్‌తో రూపాయి ఏటా సగటున 3 శాతం విలువను నష్టపోతూ వచ్చింది. 2009లో డాలర్‌తో రూపాయి విలువ 46.5గా ఉంటే, ఇప్పుడు 83కు చేరింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పిల్లల చదువు కోసం చెల్లించాల్సిన ఫీజులు, ఇతర ఖర్చులన్నీ కూడా డాలర్ రూపంలో ఉంటుంటే.. మనం సంపాదించేది రూపాయిల్లో. అందుకుని పిల్లల విద్య కోసం పెట్టుబడులను డాలర్ మారకంలో చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. మొత్తంగా కాకపోయినా, పెట్టుబడుల్లో చెప్పుకోతగ్గ మేర డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవైపు డాలర్‌తో రూపాయి మారకం క్షీణిస్తూ పోతుంటే, మరోవైపు ద్రవ్యోల్బణం సైతం కరెన్సీ విలువను కొంత హరిస్తుంటుంది. వీటిని తట్టుకుని పెట్టుబడులపై మెరుగైన రాబడులు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్యం తేలికవుతుంది. ఏమిటి మార్గం..? విదేశీ విద్య కోసం డాలర్ మారకంలో పెట్టుబడులు మేలైన మార్గం అన్నది నిపుణుల సూచన. కానీ, ఒక ఇన్వెస్టర్‌గా తాను చేసే పెట్టుబడులను అర్థం చేసుకుని, వాటి పనితీరును ట్రాక్ చేసుకునే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఎందుకంటే అంతర్జాతీయ పెట్టుబడులపై ఎన్నో అంశాల ప్రభావం ఉంటుంది. దేశీయ అంశాలతో సంబంధం ఉండదు. అందుకని వాటిని విడిగా ట్రాక్ చేసుకోవాల్సిందే. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను ఎంపిక చేసుకునే ముందు చార్జీలను తప్పకుండా చూడాలి. సరైన స్టాక్‌ను సరైన ధరల వద్ద కొనుగోలు చేసే నైపుణ్యాలు కూడా అవసరం’’ అని మహేశ్వరి తెలిపారు. తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మేర విదేశీ స్టాక్స్ కోసం వైవిధ్యం కోణంలో కేటాయించుకోవచ్చు. పిల్లల విదేశీ విద్యకు ఎంత ఖర్చు అవుతుందో, ఆ అంచనాల మేరకు కేటాయింపులు చేసుకోవాలి. స్టాక్స్ ఎంపిక తెలియని వారు, ఈ రిస్క్ తీసుకోకుండా విదేశీ స్టాక్స్‌తో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ ఏడాది కాలంలో 17 శాతం వరకు రాబడులు ఇచ్చింది. డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్ 15 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. ఇలాంటి ఎన్నో ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. డాలర్ మారకంలో పెట్టుబడులకు అవసరమైతే ఆరి్థక సలహాదారులను సంప్రదించడానికి వెనుకాడొద్దు. యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ దారి నేరుగా స్టాక్స్ ► దేశీయ బ్రోకరేజీ, విదేశీ బ్రోకరేజీ సంస్థ లేదా ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► దేశీయ బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీ సంస్థలతో జట్టు కట్టి సేవలందిస్తున్నాయి. ► ఎన్ఎస్ఈ, ఐఎఫ్ఎస్సీ ద్వారా కొన్ని విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈటీఎఫ్‌లు ► ఆర్బీఐ పరిమితుల వల్ల కొన్ని ఈటీఎఫ్‌లు మినహా.. మిగిలిన ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. ► కింగ్ ఎర్రర్, పెట్టుబడుల విధానంపై అవగాహన కలిగి ఉండాలి. ► ఈ పెట్టుబడులు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కిందకు వస్తాయి. ఏడాదిలో 2,50,000 డాలర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూపాయి విలువ క్షీణత.. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో డాలర్‌తో రూపాయి ఎంతో నష్టపోయింది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలోనే 50 శాతం విలువను కోల్పోయింది. ఈ క్షీణత ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి తీసుకోవడంతో రూపాయి క్షీణతను ఇక ముందూ చూడనున్నాం. ఎందుకంటే యూఎస్ ఫెడ్ వైఖరితో డాలర్ సరఫరా తగ్గుతుంది. అది వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల రాకపై ప్రభావం చూపిస్తుంది’’అని జేఎం ఫైనాన్షియల్ చీఫ్ ఎకనమిస్ట్ ధనుంజయ్ సిన్హా వివరించారు. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ సైతం ఫారెక్స్ నిల్వలను ఉపయోగించుకుంటోంది. డాలర్ ఇదే మాదిరిగా గరిష్ట స్థాయిలో కొనసాగితే, అధిక ముడి చమురు ధరల కారణంగా భారత్‌తో వాణిజ్య లోటు ఎగువనే ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణగా ఉంది. ఇది రూపాయి విలువను మరింత కిందకు తోసేస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘స్వల్ప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 6–7 శాతం మేర క్షీణించొచ్చని భావిస్తున్నాం’’ అని ధనుంజయ్ సిన్హా చెప్పారు. 1947లో స్వాంతంత్య్రం సిద్ధించే నాటికి మన రూపాయి విలువ డాలర్ మారకంలో 4గా ఉంటే, ఇప్పుడు 83 స్థాయిలకు చేరుకోవడం గమనించొచ్చు. ఫీజులపై రూపాయి ప్రభావం ‘విదేశాల్లో చదువుకు, ముఖ్యంగా అమెరికాలో.. ఎంతలేదన్నా అండర్ గ్రాడ్యుయేషన్‌కు 10 వేల నుంచి 50 వేల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. పీజీ చేసేందుకు 12,000 డాలర్ల నుంచి 80,000 డాలర్ల వరకు (స్కాలర్షిప్ కలపకుండా) వ్యయం చేయాల్సి వస్తుంది. వీటికి తోడు నివసించే ప్రాంతం ఆధారంగా జీవన వ్యయాలకు అదనంగా ఖర్చు చేయాలి. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని విదేశాల్లోని విద్యా సంస్థలు ఇప్పటి వరకు ట్యూషన్ ఫీజుల పెంపులకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులు భారీగా పెరిగాయంటే అది కేవలం కరెన్సీ కారణంగానే’ అని విదేశీ! విద్యా కన్సల్టెన్సీ సంస్థ ఏపీఎస్ వరల్డ్ సీఈవో అనిర్బన్ సిర్కార్ తెలిపారు. ఏటా రూపాయి విలువ క్షీణిస్తుందని భావిస్తే.. దీనికి అనుగుణంగా విదేశీ కోర్సుల వ్యయం పెరుగుతూ వెళుతుంది. ‘‘విదేశీ విద్యా వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. దీనికి ద్రవ్యోల్బణం ఒక్కటే కారణం కాదు. డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా కారణమే’’ అని యూఎస్‌లో పెట్టుబడులకు వీలు కలి్పంచే వేదిక వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్షా చెప్పారు. 2012 జూలైలో రూపాయి విలువ డాలర్‌తో 55గా ఉంది. అప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ట్యూషన్ ఫీజు ఏడాదికి 20,000 డాలర్లు ఉందని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55 ప్రకారం ఒక ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు కోసం చెల్లించాల్సి వచ్చేది. అదే ఫీజు ఇప్పుటికీ పెరగకుండా అక్కడే ఉన్నా కానీ, రూపాయి విలువ క్షీణత ఫలితంగా కోర్సు వ్యయం రూ.16.60 లక్షలకు పెరిగినట్టు అవుతుంది. అంటే రూ.5 లక్షలకు పైగా పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా కలిపిచూస్తే ఈ భారం ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అందుకని పిల్లల విదేశీ విద్య కోసం పొదుపు చేసే వారు కేవలం ద్రవ్యోల్బణం ఒక్కటే కాకుండా, రూపాయి క్షీణతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ పెట్టుబడుల మార్గం విదేశీ విద్య కోసం చేసే పెట్టుబడులను అంతర్జాతీయ మార్కెట్లకు కేటాయించుకోవడం అర్థవంతంగా ఉంటుంది. జపాన్, బ్రిటన్, యూఎస్ తదితర దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులకు వైవిధ్యం కూడా తోడవుతుంది. భారత ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది అమెరికన్ మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైతే డాలర్ ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న విశ్లేషణ వినిపిస్తోంది. యూఎస్ పెట్టుబడులు కరెన్సీ విలువ పతనానికి హెడ్జింగ్గానే కాకుండా పెట్టుబడుల్లో వైవిధ్యానికీ వీలు కలి్పస్తాయన్నది నిపుణుల సూచన. ‘‘విదేశీ విద్య కోసం, డాలర్ మారకంలో లక్ష్యాల కోసం యూఎస్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానం అవుతుంది. దీనివల్ల గమ్యస్థానంలో (చదువుకునే) ద్రవ్యోల్బణానికి తోడు, రూపాయి విలువ క్షీణతకు హెడ్జింగ్‌గా పనిచేస్తుంది. చాలా దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఉన్నత విద్య ద్రవ్యోల్బణం ఎక్కువే ఉంటుంది’’ అని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ సీఈవో రేణు మహేశ్వరి సూచించారు. డాలర్‌తో ఇన్వెస్ట్ చేసినప్పుడు, తిరిగి డాలర్‌తో ఉపసంహరించుకునేట్టుగా ఉంటే, అది అధిక ప్రయోజనాన్నిస్తుంది. ఉదాహరణకు 2012లో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో, ఎస్అండ్పీ 500లో 100 డాలర్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55గా ఉంది. అప్పటి నుంచి ఈ రెండు సూచీలు ఏటా 13 శాతం రాబడులు ఇచ్చాయి. దీంతో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో 100 డాలర్ల పెట్టుబడి నేడు రూ.18,000 అవుతుంది. ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో పెట్టుబడి రూ.25,000 అయి ఉండేది. 40 శాతం అధికంగా ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో రాబడులు వచ్చాయి. రెండు సూచీలు ఒకే విధమైన రాబడిని ఇచి్చనా.. రెండు దేశాల కరెన్సీ విలువల్లో మార్పుల ఫలితంగా ఎస్అండ్పీ 500లో అధిక రాబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్లే ఇలా జరిగింది. -
బలహీన బాటలో రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన బాటలో పయనిస్తోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 38 పైసలు బలహీనపడి, 81.64 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా కరెన్సీ పటిష్టత, దేశీయ ఈక్విటీల్లో మిశ్రమ ధోరణి రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. రూపాయి విలువ బుధవారం 35 పైసలు తగ్గి 81.26కు పడిపోయింది. గురువారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 81.62 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.45 – 81.68 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపా యి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. -
కొత్త రికార్డుల దిశగా సాగొచ్చు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే.., ఈ వారం దేశీయ స్టాక్ సూచీలు తాజా జీవితకాల గరిష్టానికి చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ డేటా, అమెరికా మధ్యంతర ఎన్నికలు, విదేశీ పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు. చివరి దశకు చేరుకున్న కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదువడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ‘‘గతేడాది(2021) అక్టోబర్ 19న సెన్సెక్స్ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ వారాంతపు రోజున సెన్సెక్స్ జీవితకాల గరిష్టం ముగింపు(61,795) వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని(18,362) తాకింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే సూచీలు జీవితకాల గరిష్టాన్ని అందుకోవచ్చు. ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ 18,300 స్థాయిని నిలుపుకోలిగితే 18,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,000 –17,800, శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. ► ద్రవ్యోల్బణ డేటా దృష్టి అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడి తర్వాత మార్కెట్ వర్గాలు ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించాయి. డిసెంబర్ ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరికి మార్గదర్శకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 7.4%గా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ఏడుశాతంలోపే ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. . ► కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,400కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఓఎన్జీసీ, గ్రాసీం ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)తో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లిస్టయిన కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి పూర్తి అవుతుంది. వీటితో పాటు బయోకాన్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్సీటీసీ, స్పైస్‌జెట్‌లు, ఆర్తి ఇండస్ట్రీస్, అబాట్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హుడ్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జ్యోతి ల్యాబ్స్, లక్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ► ప్రపంచ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు యూరో పారిశ్రామికోత్పత్తి డేటా, బ్రిటన్ నిరుద్యోగ రేటు మంగళవారం విడుదల అవుతాయి. అదే రో జున యూరోజోన్, జపాన్ జీడీపీ అంచనాలు వెల్లడికానున్నాయి. ఎల్లుండి(బుధవారం)బ్రిటన్ అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. ఈ మరుసటి రోజు యూరో జోన్ ద్రవ్యోల్బణం, జపాన్ వా ణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ఆర్థి క స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఎఫ్ఐఐలు వైఖరి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానపరమైన ఆందోళనలు తగ్గుముఖంపట్టడంతో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారంలో రూ.6,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లు చేపడుతూ మార్కెట్‌కు అండగా నిలిచే సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ నవంబర్‌లో నికరంగా రూ.5600 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement