-
ప్రముఖ సింగర్‌పై గృహహింస, లైంగిక వేధింపుల కేసు
ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలో కోర్టు హనీ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా ఆదేశించింది. హనీ సింగ్, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడేళ్ల క్రితం అనగా 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను జనాలకు పరిచయం చేశాడు. బాలీవుడ్‌లోని పలు భారీ ప్రాజెక్ట్స్‌లో పని చేయడానికి ముందే హనీ సింగ్ వివాహం అయిందని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక దీపికా పదుకోనె, సైఫ్ అలీఖాన్ జంటగా నటించిన ‘కాక్టెయిల్’ చిత్రంలోని ఆంగ్రేజీ బీట్ పాటతో హనీ సింగ్ బాగా ప్రాచుర్యం పొందారు. ఈ పాట సూపర్ హిట్ అవ్వడమే కాకా 2011లో టాప్ సాంగ్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హనీ సింగ్ బాలీవుడ్ కెరీర్ సాఫీగా కొనసాగుతుంది. ఇక భార్య ఇచ్చిన ఫిర్యాదులతో అతడి కెరీర్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. భార్య ఫిర్యాదు మీద హనీ సింగ్ ఇంకా స్పందించలేదు. -
కాపురాల్లో కార్చిచ్చు
* దుర్వినియోగం అవుతున్న గృహహింస నిరోధక చట్టం * భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచులపైనా కేసులు * విచక్షణ కోల్పోతున్న భర్తలు * కొందరు పోలీసుల వల్లే ఈ పరిస్థితి * సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు రెండు హృదయాలు, మూడుముళ్లు, ఏడడుగులు.. నూరేళ్లపాటు భార్యాభర్తల బంధాన్ని కలిపి ఉంచుతాయి. నాతిచరామి అంటూ ప్రమాణం చేసింది మొదలు పెళ్లిపుస్తకంలోని చివరిపేజీ వరకు నమ్మక మే వివాహజీవితాన్ని నడిపిస్తుంది. అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాలకే ఆదర్శం అయింది. మారుతున్న కాలంలో ఈ కుటుంబ వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కారణాలేవైనా చాలా ఇళ్లలో చీటికీమాటికీ గొడవలు ప్రశాంతతను చెదరగొడుతుంటాయి. చివరకు అది పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కేవరకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టం తెచ్చింది. ఇది అమలులో విఫలమవుతోంది. చట్టం దుర్వినియోగం కూడా అవుతోందనే విమర్శలున్నాయి. కొన్ని చిక్కులను కూడా తెచ్చిపెడుతోంది. భర్త వేధింపులకు పాల్పడితే అతడి కుటుంబ సభ్యులకూ పోలీసు కేసు తప్పడం లేదు. ఈ క్రమంలోనే మగాళ్లు మృగాళ్లుగా మారిన సంద ర్భాలు ఉన్నాయి. దీనిపై కథనం.. మానవత్వం కోల్పోయి భార్యలను చిత్రహింసలకు గురిచేసే భర్తల నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కొన్నేళ్ల కిందట గృహ హింస నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు. భార్యలను చీటికీమాటికీ కొడుతూ వేధింపులకు గురిచేసే భర్తలకు చట్టం ద్వారా గుణపాఠం చెప్పాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. చట్టం వచ్చిన కొత్తలో మహిళలకు ఇది రక్షణ కవచంలా మారింది. రానురాను అనేకమంది మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో భార్యభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు వస్తే పెద్ద మనుషులు పంచాయతీ చేసి కాపురాలు కూలిపోకుండా కాపాడేవారు. అనంతరం పోలీస్‌శాఖ కుటుంబ కలహాలను పరిష్కరించేందుకు స్వచ్ఛంద సేవకుల ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కొన్నాళ్లు బ్రహ్మాండంగా కొనసాగిన ఈ సెంటర్లు ఇప్పుడు ఒకటి రెండు సబ్డివిజన్లలో మినహా ఎక్కడా కనిపించడంలేదు. మనస్పర్ధలు, ఇతర గొడవలతో స్టేషన్లకు వచ్చే భార్యాభర్తలకు రెండుమూడు వారాల పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించి అప్పటికీ వారి మధ్య సఖ్యత కుదరకపోతే అప్పుడు గృహహింస చట్టాన్ని అమలు చేయాల్సి ఉంది. అయితే కొందరు పోలీస్ అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లేదు. భార్య ఆవేశంలో వచ్చి ఫిర్యాదు చేయగానే భర్త, అత్తమామలు, ఆడపడుచు, మరుదులపై ఫిర్యాదులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేసు విషయంలో భర్తకు తప్ప మిగతావారికి సంబంధం లేదని తేలినప్పటికీ తమ జేబులు నింపితేనే కేసులో నుంచి మిమ్మల్ని తప్పిస్తామంటూ నేరుగా చెబుతున్నారు. చేసేది లేక వారు అడిగినంత సమర్పించుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన గృహహింస చట్టం కొందరు పోలీస్ అధికారులకు ఆదాయ వనరుగా మారింది. మృగాళ్లుగా మారి.. గృహహింస నిరోధక చట్టం ద్వారా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కని అటు భార్యా పిల్లలకు.. ఇటు తల్లిదండ్రులు, అక్కా తమ్ముళ్ళకు దూరమై మానసికంగా దెబ్బతిన్న అనేకమంది దారుణాలకు తెగబడుతున్న వైనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సంచలనం కలిగించిన పలు హత్యల ఉదంతాలను పరిశీలిస్తే ఇలాంటి నిజాలే బట్టబయలవుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల ద్వారా కొన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య వచ్చే వివాదాలను సద్దుమణచాల్సింది పోయి కొందరు అధికారులు వారి స్వలాభం కోసం వాటిని పెంచి పెద్దవి చేస్తూ వారి కాపురంలో నిప్పులు పోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులూ బేఖాతర్ గృహహింస చట్టంతో ఇబ్బందులకు గురైన ఓ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 498(ఎ)లో పోలీసులు అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో భర్తను అరెస్ట్ చేయాలన్నా జిల్లా ఎస్పీ అనుమతి తీసుకోవాలని, మిగతావారి ప్రమేయంపై పక్కాగా విచారణ జరిపి నిజాలను తెలుసుకోవాలంటూ ఆదేశించింది. అయితే రాజకీయ ఒత్తిడులకు, అవినీతికి అల వాటుపడిన కొందరు పోలీస్ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా చట్టాలను దుర్వినియోగం చేయకుండా అందరికీ న్యాయం చేసేలా పోలీస్ అధికారులు పనిచేయాలని పలువురు కోరుతున్నారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్‌లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement