-
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 20 ఏళ్లు. పెళ్లయి రెండేళ్లు అయ్యింది. పెళ్లయిన ఆర్నెల్లకు గర్భం వచ్చింది. మూడో నెలలో కొంచెం బ్లీడింగ్ కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాను. స్కానింగ్ చేసి ‘ముత్యాలగర్భం పెరుగుతోంది’ అని తీసేశారు. ఇంకోసారి స్కానింగ్ చేసి, మళ్లీ గర్భం దాల్చాలంటే కనీసం ఒక ఏడాదైనా ఆగాలన్నారు. అసలు ఈ ముత్యాల గర్భం ఎందుకు ఏర్పడుతుంది? మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - నీలిమ, మెదక్ గర్భాశయంలో పిండం నిర్మాణ లోపం వల్ల, నిర్వీర్యమైన అండంతో ఒక శుక్రకణం కలిసి ఫలదీకరణ చెంది ముత్యాల గర్భంగా ఏర్పడుతుంది. కొన్నిసార్లు గర్భాశయంలో బిడ్డ ఏర్పడకుండా, బిడ్డకు ఆహారాన్ని అందించే మాయ (ప్లాసెంటా), చిన్న చిన్న ముత్యాల్లాంటి నీటి బుడగలుగా మార్పు చెందుతుంది. ఇవి పెరిగిపోతూ, గర్భాశయం మొత్తాన్ని ఆక్రమిస్తాయి. ఇలా పెరిగే గర్భాన్ని ముత్యాల గర్భం అంటారు. కొంతమందిలో మాయ కొంత భాగం ముత్యాలుగా మారుతుంది. వీరిలో బిడ్డ కూడా ఏర్పడుతుంది. కానీ అది సరిగా ఎదగకపోవచ్చు. అవయవలోపాలు ఉండవచ్చు. ముత్యాలగర్భం వచ్చినవారిలో 2-3 నెలల్లో కొంచెం లేదా ఎక్కువగా బ్లీడింగ్ లేదా నీటిబుగ్గలతో కలిసిన ద్రవం, దాంతోపాటు కొంచెం పలుచగా రక్తం చారికలు కనిపించవచ్చు. కాబట్టి దీనిని ముందుగానే అంటే 2-3 నెలల్లోనే స్కానింగ్ ద్వారా నిర్ధారణ చేసుకొని, సెక్షన్ క్యురెటాజ్ ద్వారా తీయించేసుకోవడం మంచిది. ఇందులో గర్భాశయం చాలా మెత్తబడి ఉంటుంది. అందువల్ల క్యురెటాజ్ చేసేటప్పుడు అధిక రక్తస్రావం, గర్భాశయానికి చిల్లు పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత కూడా కొందరిలో నీటిబుగ్గలు కొద్దిగా ఉండిపోయి, మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు డాక్టర్ పర్యవేక్షణలో మళ్లీ స్కానింగ్, బీటా హెచ్‌సీజీ రక్తపరీక్ష చేయించుకుంటూ, మూడు నెలల నుంచి ఆర్నెల్ల పాటు డాక్టర్ ఫాలోఅప్‌లో ఉండాలి. ఏడాదివరకు గర్భం రాకుండా జాగ్రత్తపడాలి. మలిసారి గర్భందాల్చినప్పుడు రెండు శాతం మందిలో మళ్లీ ముత్యాలగర్భం రావచ్చు. గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నెలల ముందునుంచే దంపతులు ఇద్దరూ మితాహారం, పౌష్టికాహారం తీసుకుంటూ, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. గర్భం వచ్చాక రెండో నెల చివర్లోనే స్కానింగ్ చేయించుకని, అది సాధారణ గర్భమా లేక ముత్యాల గర్భమా అని నిర్ధారణ చేసుకోని, తగిన తదుపరి చర్యలు తీసుకోవడం మంచిది. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 35. ఇద్దరు పిల్లలు పుట్టాక ట్యూబెక్టమీ చేయించుకున్నాను. ఆర్నెల్ల నుంచి పీరియడ్స్ సమయంలో విపరీతంగా రక్తస్రావం అవుతోంది. తగిన సలహా ఇవ్వండి. - సునంద, అనంతపురం ఇలా రుతుస్రావం సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా జరగడానికి కారణం ఏమిటో మొదట తెలుసుకోవాలి. కొందరిలో ఫైబ్రాయిడ్స్ సమస్య ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా లేదా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం జరుగుతున్నా... దాన్ని క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యగా అనుమానించి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో అయితే ఈ వయసు వారిని ఏడాదికోమారు పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకొమ్మని సలహా ఇస్తుంటారు. మన దేశంలో ఇంకా అంత అవగాహన పెంపొందలేదు. ఈ పరీక్ష వల్ల దాదాపు 10 ఏళ్ల తర్వాత రాబోయే సర్విక్స్ క్యాన్సర్‌ను ముందే కనుక్కోవచ్చు. మీ వయసు 35 ఏళ్లే కాబట్టి, క్యాన్సర్ ఉండే అవకాశం తక్కువ. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోండి. కారణాన్ని బట్టి, అవసరాన్ని బట్టి హార్మోన్ల చికిత్స లేదా ఇతరత్రా మార్గాల్లో ఈ సమస్యకు చికిత్స అందించి, గర్భసంచి తొలగించే శస్త్రచికిత్స (హ్రిస్ట్రెక్టమీ) చేయకుండానే, మీ సమస్యను తగ్గించవచ్చు. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్‌బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్‌లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్‌తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement