-
యాక్షన్‌కింగ్‌కు అర్ధాంగిగా..
తమిళసినిమా: యాక్షన్‌కింగ్ అర్జున్‌కు అర్ధాంగిగా నిపుణన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది నటి శ్రుతిహరిహరన్. అర్జున్, ప్రసన్న, వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం నిపుణన్. అరుణ్‌వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతవారం తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఇందులో అర్జున్‌కు జంటగా నటించిన నటి శ్రుతిహరిహరన్ తన సంతోషాన్ని పంచుకుంటూ చిత్రం విజయం సాధిస్తే అందులో నటించిన తారలకు, సాంకేతిక వర్గానికి మంచి పేరుతో పాటు, మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. అలా ప్రేక్షకుల ఆదరణను పొందుతున్న నిపుణన్ చిత్రంలో నటిస్తూ తానూ ఒక భాగం కావడం ఆనందంగా ఉందని అంది. ఇందులో అర్జున్‌కు భార్యగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఇక పోలీస్అధికారి ఎదుర్కొనే వృత్తిపరమైన, శారీరకపరమైన సమస్యలో భాగం పంచుకునే భార్యగా చాలా మంచి పాత్రను తనకిచ్చిన దర్శకుడు అరుణ్వైద్యనాథన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని మహిళలను ఆదరించడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పింది. ఒక తమిళ అమ్మాయిగా నిపుణన్ చిత్రంతో కన్నడంలోనూ మంచి గుర్తింపు పొందడం ఆనందంగా ఉందని తెలిపింది. నిపుణన్ చిత్రం తనకు మరిన్ని అవకాశాలను అందిస్తుందనే నమ్మకం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం దుల్కర్‌సల్మాన్‌కు జంటగా సోలో అనే చిత్రంలో నటిస్తున్నానని శ్రుతిహరిహరన్ తెలిపింది. -
సోలోకు ముగ్గురు ఛాయాగ్రాహకులు
తమిళసినిమా: ఇప్పుడు సినిమాను ఆషామాషీగా తీస్తే ప్రేక్షకులు చూడడం లేదు. ఏదో కొత్తదనం కావాలి. అదీ ఆకర్షణీయంగా ఉంటేనే ప్రేక్షకదేవుళ్లు ఆదరిస్తారు. అలాంటి ఒక కొత్త ప్రయోగంతో సోలో అనే చిత్రం తెరకెక్కుతోంది. తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఇం దులో మాలీవుడ్ యువ నటుడు దుల్కర్సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కార్పొరేట్ సంస్థ రెఫెక్స్ గ్రూప్ అధినేత అనిల్ జెయిన్ చిత్రనిర్మాణరంగంలోకి ప్రవేశించి గేట్ అవే ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర దర్శకుడు బి జాయ్ నంబియార్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి తమిళ చిత్రం సోలోనేనన్నా రు. ఇంతకు ముందు డేవిడ్ అనే చిత్రాన్ని చేసినా అది హిందీ చిత్రం అని, తమిళంలో అనువాద చిత్రమేనని చెప్పారు. కాగా సోలో చిత్రం తమిళం, మలయాళ భాషల్లో నేరుగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. చిత్ర కథానాయకుడు దుల్కర్సల్మాన్ మాట్లాడుతూ తనకిప్పటి వరకూ మంచి దర్శకులే అమిరారని, అందుకే మంచి చిత్రాలను అందించగలుగుతున్నానని పేర్కొన్నారు. తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో చేస్తున్న ఈ చిత్రం 8 చిత్రాల్లో నటించినందుకు సమా నం అని పేర్కొన్నారు. తమిళంలో తన మూడు చిత్రా ల కార్యక్రమాల్లోనూ దర్శకుడు మణిరత్నం పాల్గొన్నారని, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. దర్శకుడు మణిరత్నం మా ట్లాడుతూ ఇక్కడ తాను చూసిన సోలో చిత్ర ట్రైలర్ తనను చాలా ఆకట్టుకుందన్నారు. ఈ చిత్రానికి ముగ్గు రు ఛాయాగ్రాహకులు, 11 మంది సంగీతదర్శకులు పనిచేస్తున్నారట. ఇందులో ఒక్కో వెర్షన్‌కు 15 పాటల చొప్పున మొత్తం రెండు భాషలకు కలిపి 30 పాటలు చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement