-
స్కూల్ గ్రౌండ్లో బాంబు పేలుడు
-
స్కూల్ గ్రౌండ్లో బాంబు పేలుడు
పశ్చిమ బెంగాల్: పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు శనివారం స్కూలుకు సెలవు కావడంతో పశ్చిమ బెంగాల్‌లోని ఓ స్కూలు విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లా డమ్ డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్లో శనివారం మద్యాహ్నం ఓ స్వల్ప తీవ్రతగల బాంబు పేలింది. సాయంత్రం ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహణకోసం సిబ్బంది గ్రౌండ్‌ను శుభ్రం చేస్తున్న సమయంలో బంతిలాంటి ఆకారంలో ఓ వస్తువు కనబడింది. దాన్ని చేతిలోకి తీసుకున్న ఓ వ్యక్తి అదేమిటో అర్ధంకాక పక్కకు విసిరేశాడు. అంతే.. ఒక్కసారిగా శబ్ధం చేస్తూ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడని బారక్పూర్ కమిషనర్ నీరద్ సింగ్ తెలిపారు. క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించామని, స్కూల్‌కు సెలవు కావడంతో పెను ముప్పు తప్పినట్లయిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement