-
పద్ధతి గల మహిళలు
‘అమ్మాయిలూ.. మీరెలా ఉంటే అదే పద్ధతి. మీరెలా ఉండాలనుకుంటే అదే పద్ధతి’ అంటూ ‘రూల్స్‌ని బ్రేక్ చేయడం ఎలా?’ అని ప్యూమా కంపెనీ.. నలుగురు సెలబ్రిటీల చేత ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అమ్మాయిలకు కొత్త పాఠాలు చెప్పిస్తోంది. అవి వినే పాఠాలు కాదు! కలిసి ఆడే పాటలు, కలిసి పాడే ఆటలు! స్త్రీలు అలా ఉండాలని, ఇలా ఉండాలని వాళ్లు పుట్టినప్పట్నుంచీ సమాజం స్టిక్ పట్టుకుని పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. మేథ్స్, ఫిజిక్స్లా.. ఒద్దిక, అణుకువ అనేవి అమ్మాయిలకు సమాజం టీచ్ చేసే ముఖ్యమైన సబ్జెక్టులు! ఆ సబ్జెక్టుల్లో పాస్ అయితేనే చివరికి వారికి ‘ప్రాపర్ లేడీ’ అనే ప్రశంసాపత్రం వస్తుంది. ఆ పత్రం ఉంటేనే అమ్మాయి అమ్మాయిగా పెరిగినట్లు. ‘ప్రాపర్ లేడీ’ అంటే పద్ధతిగా పెరిగిన పిల్ల అని! అయితే ఇప్పుడు ‘ఫ్యూమా’ అనే అంతర్జాతీయ స్పోర్ట్స్ కంపెనీ ‘పద్ధతిగా లేకపోవడమే పద్ధతి’ అనే ఒక వీడియో క్యాంపెయిన్ మొదలు పెట్టింది! ‘ఎప్పుడూ ఎంపవర్మెంట్ని సాధించే పనేనా? సాధించిన ఎంపవర్మెంట్ని వేడుక చేసుకునేది ఎప్పుడు?’.. అని సారా అలీ ఖాన్, మేరీ కోమ్, అంజలీ లామా, ద్యుతీ చంద్ ఈ వీడియోలో మిమ్మల్ని అడుగుతారు. మీ చెయ్యి పట్టుకుని వాళ్లలోకి మిమ్మల్ని లాగేసుకుంటారు. సారా అలీఖాన్ బాలీవుడ్ వర్ధమాన నటి. మేరీ కోమ్ ఇండియన్ ఒలింపిక్స్ బాక్సర్. ద్యుతీ చంద్ ఇంటర్నేషనల్ అథ్లెట్, అంజలీ లామా ట్రాన్స్‌జెండర్ మోడల్. వీళ్లంతా స్టార్స్ కదా! పద్ధతిగా పెరగకపోతే, పద్ధతిగా ప్రాక్టీస్ చెయ్యకపోతే ఇంతవరకూ వస్తారా అనేదే మీ సందేహమైతే ఆ సందేహాన్ని తుడిచిపెట్టేయండి. వాళ్లు వాళ్లలాగే ఉంటూ.. ఇంత పైకి వచ్చారు. ‘వాళ్లలాగే అంటే..?’ అని ఇంకో డౌటా! ఒరిజినల్‌గా వీళ్లేమిటో ప్యూమా కంపెనీ తయారు చేయించిన ‘మీట్ ద ప్రాపర్ లేడీ’ వీడియో చూడండి. ఒక్కొక్కరిలో ఒక్కో పోకిరి పిల్ల్ల, కుండల్ని బద్దలు కొట్టే పిల్ల, ఎవరేమనుకుంటే నాకేంటి అనే పిల్ల, నీ గేమ్ నీ లైఫ్ అనే పిల్ల సాక్షాత్కరిస్తుంది. కుర్చీలో ‘అదోలా’ కూర్చుంటుంది ద్యుతీచంద్. నోటినిండా బబుల్గమ్ ఊదుతూ ఇంత కళ్లేసుకుని చూస్తుంది సారా అలీఖాన్. ‘ఉంటే జిమ్‌లో ఉండు.. లేదంటే స్ట్రీట్ ఫైట్‌లో ఉండు’ అంటుంది రింగ్‌లో జారి గిలబడి ఉన్న మేరీకోమ్. ‘నాకు ఇష్టమైనది తప్ప నాకు ఇంకేదీ వద్దు’ అని తెగే వరకు లాగి చెప్పేస్తుంది అంజలీ లామా! నేడో రేపో ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా ‘మీట్ ద ప్రాపర్ లేడీ’ అనే ఈ ప్యూమా కంపెనీ ప్రచారం ప్రారంభం కాబోతోంది. చూడండి. ‘పద్ధతిగా ఉండండి’. నీ గేమ్.. నీ లైఫ్..! సారా అలీఖాన్ నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నో ప్రాబ్లం. కానీ నాకు నచ్చినట్లు నేనుంటా. మేరీ కోమ్ పంచ్ ఇస్తే తప్ప లైఫ్ దారికి రాదనుకుంటే పంచ్ ఇవ్వాల్సిందే ద్యుతీ చంద్ ఒకటేదైనా అనుకుంటే వదిలిపెట్టకు. నువ్వు అనుకున్నదాని కోసం నిన్ను నువ్వు వదులుకున్నా తప్పేం లేదు. అంజలీ లామా నా అన్వేషణ శిఖరంపై ఉన్నప్పుడు నేనెందుకు నేలపై వెదుక్కుంటాను? -
4 X100 మీ. రిలేలో జాతీయ రికార్డు
న్యూఢిల్లీ: బీజింగ్ వరల్డ్ చాలెంజ్ అథ్లెటిక్స్ మీట్లో భారత రిలే మహిళల జట్టు 4ఁ100 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పింది. చైనాలోని బీజింగ్‌లో బుధవారం జరిగిన ఈ మీట్లో ద్యుతీచంద్, శ్రాబని నంద, హెచ్ఎం జ్యోతి, మెర్లిన్ జోసెఫ్‌లతో కూడిన భారత బృందం 44.03 సెకన్లలో గమ్యానికి చేరుకొని నాలుగో స్థానాన్ని సంపాదించింది. ఈ క్రమంలో ద్యుతీచంద్ జట్టు 1998లో సరస్వతి, రచిత మిస్త్రీ, షైలా, పీటీ ఉష బృందం 44.43 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ రికార్డు నెలకొల్పిన మహిళల రిలే జట్టుకు తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరించారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
జగనన్న పాలన దేశానికే ఆదర్శం
గుంటూరును తీర్చిదిద్దుకుందాం
టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం
No Headline
హరితయానం..
ఫొటోగ్రఫీలో గోలి వెంకట శివకుమార్‌కు అవార్డు
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ఓటు వేసిన 99 ఏళ్ల అడుసుమిల్లి
వైఎస్సార్ సీపీలో చేరికలు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement