-
Shane Warne: ‘నా గుండె నొప్పితో విలవిల్లాడుతోంది’
‘‘నా గుండె ముక్కలవుతోంది. నొప్పితో విలవిల్లాడుతోంది. షేన్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడం బాధను రెట్టింపు చేస్తోంది. గత రాత్రి షూట్ వల్ల నేను అక్కడికి వెళ్లలేకపోతున్నా. ఈ ఫొటోలు మా ఎంగేజ్మెంట్ సందర్భంగా శ్రీలంకలో తీసుకున్నవి. అప్పుడు మా పిల్లలంతా మాతోనే ఉన్నారు. అవి సంతోషకర క్షణాలు. తను వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ మాజీ ప్రేయసి ఎలిజబెత్ హర్లే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మార్చి 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో మార్చి 20న అతడి భౌతిక కాయానికి ఆస్ట్రేలియాలో అంత్యక్రియలు(ప్రైవేట్ ప్యునరల్) నిర్వహించారు. అత్యంత ఆప్తుల నడుమ అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే, షూటింగ్ కారణంగా వార్న్ మాజీ ప్రేయసి, నటి ఎలిజబెత్ ఇందులో భాగం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె భావోద్వేగ నోట్ షేర్ చేశారు. తన నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫొటోలను పంచుకుంటూ వార్న్ కడసారి చూపునకు నోచుకోలేదంటూ ఉద్వేగానికి లోనయ్యారు. భౌతికంగా వార్న్ దూరమైనా అతడి జ్ఞాపకాలు చిరకాలం నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన వార్న్, ఎలిజబెత్ 2011 సెప్టెంబరులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ, రెండేళ్లకే వీరి బంధం బీటలు వారింది. 2013లో ఈ జంట విడిపోయింది. ఇక వార్న్ సంతానం విషయానికొస్తే.. భార్య సిమోనే కాలన్తో అతడు ముగ్గురు పిల్లలు కలిగారు. వీరిద్దరు 2005లో విడిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Elizabeth Hurley (@elizabethhurley1) -
‘ప్రియ’మైన ముద్దు... 48 లక్షలు!
అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లాండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, ఇండో కెనెడియన్ వ్యాపారవేత్త జూలియన్ భారతీలు.కెనడాలో గురువారం నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ సుందరి(49) తన ముద్దును వేలం వేయగా.. 27 ఏళ్ల జూలియన్.. రూ. 48 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసం ఆమె ముద్దును ఇలా వేలం వేశారు. -
ఎలిజబెత్ హర్లీ ముద్దు ఖరీదు రూ. 48 లక్షలు!
లాస్ ఏంజిల్స్ : బహిరంగంగానే ఇలా గాఢ అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, కెనడా బిలినీయర్ కుమారుడైన ఇండో కెనడియన్ వ్యాపారవేత్త జూలియన్ భారతీలు. కెనడాలోని విండ్సర్ నగరంలో నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ 49 ఏళ్ల సుందరి తన ముద్దును వేలం వేయగా.. 27 ఏళ్ల జూలియన్ ఏకంగా 81 వేల డాలర్ల(రూ. 48 లక్షలు)కు సొంతం చేసుకున్నాడు. అయితే... ఈ ముద్దు వేలం వేసింది డబ్బు సంపాదించడం కోసం కాదండోయ్.. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసం. ఈమె ముద్దు వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎల్టన్ జాన్స్ ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అందింది. అందుకే మరి.. భారీ మొత్తం చెల్లించి ముద్దును కొనుక్కున్నా.. జూలియన్ భార్య క్రిస్టీ కూడా ఫీలవ్వలేదట. జులియన్-క్రిస్టీల జంటకు ముగ్గురు పిల్లలు. -
వార్న్.. మళ్లీ ఒంటరి !
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ మళ్లీ ఒంటరివాడయ్యాడు. బ్రిటిష్ మోడల్, నటి ఎలిజబెత్ హార్లీతో మూడేళ్ల బంధాన్ని తెంచుకున్నాడు. ఓ ఆస్ట్రేలియా టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్న్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. ‘మేమిద్దరం విడిపోయాం. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. మా మధ్య ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేకపోయినా మంచి స్నేహితులం. మేం ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలుసుకుంటాం’ అని చెప్పాడు. 2010లో భార్య సైమోన్కు విడాకులిచ్చిన తర్వాత వార్న్, హార్లీతో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి వరకు రాలేకపోయారు. మరోవైపు బ్రిటిష్ మోడల్ మిచెల్లీ మోన్‌తో డేటింగ్ వార్తలపైనా వార్న్ స్పందించాడు. ’నేను ఇప్పుడు ఒంటరిని. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. ’ అని ఈ మాజీ స్పిన్నర్ స్పష్టం చేశాడు. -
'బిల్ క్లింటన్ తో అఫైర్ వార్తలు అవాస్తవం'
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో గత సంవత్సర కాలంగా ఆఫైర్ నడిపిందని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ టామ్ సైజ్ మోర్ చేసిన వ్యాఖ్యల్ని బ్రిటన్ సినీ తార ఎలిజబెత్ హార్లీ ఖండించారు. బిల్ క్లింటన్ తో తనకు అఫైర్ ఉందని చేసిన వ్యాఖ్యలు చాలా తెలివి తక్కువ పని. అవాస్తవం. నా లాయర్లు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు అని హ్యార్లీ ట్విటర్ లో స్పందించారు. ఈ రోజు తనకు భయంకరమైన రోజు అని ట్విటర్ లో పేర్కోన్నారు. 'నేను ఎప్పుడు బిల్ క్లింటన్ ను కలువలేదు' అని హ్యార్లీ తెలిపింది. 1998లో వైట్ హౌజ్ లో 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' చిత్ర ప్రదర్శన అనంతరం తాను ఎలా క్లింటన్ కు పరిచయం చేశానో అనే విషయాన్ని సైజ్ మోర్ తెలిపారు. 1992 లో రూపొందించిన పాసింజర్ 57 అనే చిత్ర సందర్భంగా ఏర్పడిన పరిచయంతో హ్యార్లీ, సైజ్ మోర్ లు కొంత కాలం డేటింగ్ చేశారు. Ludicrously silly stories about me & Bill Clinton. Totally untrue. In the hands of my lawyers. Yawn. — Elizabeth Hurley (@ElizabethHurley) February 5, 2014
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement