-
చేయకూడని.. కెరీర్ మిస్టేక్స్!
ఉద్యోగ జీవితంలో విజయవంతంగా రాణించడం అనేది నదిపై ప్రయాణం లాంటిది కాదు. మహా సముద్రంపై ప్రయాణం లాంటిది. స్వల్ప కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాం. తక్షణ పదోన్నతి కోసం ఆరాటపడతాం. దీర్ఘకాలిక అవసరాలను, ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోం. కానీ, చిన్న చిన్న విషయాలే కెరీర్‌పై ఎనలేని ప్రభావం చూపుతాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే కెరీర్లో ఆశించిన ఎదుగుదల ఉండదు. ఉద్యోగులు సాధారణంగా ఐదు రకాల కెరీర్ మిస్టేక్స్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఉద్యోగ బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు దూసుకుపోవచ్చు. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవాలి నెట్వర్కింగ్ విలువ చాలా మందికి తెలియదు. కేవలం బిజినెస్ కార్డులను ఇచ్చిపుచ్చుకునేందుకే సదస్సులు, సమావేశాలకు హాజరవుతుంటారు. కెరీర్లో రాణింపునకు మీ రంగంతోపాటు ఇతర రంగాలకు చెందినవారితో కూడా స్నేహ సంబంధాలను పెంచుకోవాలి. కొత్త పరిచయాలు కొత్త ఆలోచనలకు దారితీస్తాయి. ఈ నెట్వర్కింగ్తో మీ రోజువారి జీవితం మరింత సులభతరంగా మారుతుంది. మీ నెట్‌వర్క్‌లో భిన్న రకాల భాషలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులు ఉండేలా చూసుకోండి. ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ పెంచుకోవడం కష్టమే కానీ, అసాధ్యం మాత్రం కాదు. దీనికి సమయం వెచ్చిస్తే.. అది వృథా కాదు. భవిష్యత్తులో తప్పనిసరిగా సానుకూల ఫలితం లభిస్తుంది. డబ్బే ముఖ్యం కాదు ప్రస్తుతం వస్తున్న జీతం కంటే మరో 20 శాతం అదనంగా వస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రతి ఉద్యోగికి ఉంటుందంట. మెరుగైన వేతనాల కోసం కంపెనీలను, ఉద్యోగాలను వెంటవెంటనే మార్చేసే వారు ఎందరో ఉన్నారు. మరో కొలువులోకి మారితే బ్యాంకు బ్యాలెన్స్ కొంత పెరగొచ్చు. కానీ, అది కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆదాయం కంటే ముందు పనిలో అనుభవం, నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. లాంగ్ రన్లో ఇది మీకు కచ్చితంగా మేలు చేస్తుంది. ఉన్నత హోదాలు, ఎక్కువ జీతభత్యాలు పొందడానికి ఆస్కారం కల్పిస్తుంది. పరాజయం.. సహజమే ఓటమి ఎదురవుతుందన్న భయంతో కొందరు సాహసాలు చేయడానికి వెనుకాడుతుంటారు. అయితే, క్లిష్ట పరిస్థితుల్లోనే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లాంగ్‌టర్మ్ సక్సెస్ కావాలంటే పరాజయాలకు లొంగొద్దు. ఫలితం తో సంబంధం లేకుండా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. ప్రతి ఓటమి ఒక కొత్త పాఠా న్ని నేర్పుతుంది. జీవితం అంటే ఏమిటో తెలి యజేస్తుంది. కాబట్టి పనిలో రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. ఫెయిల్యూర్స్.. వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయి. కార్యాలయానికి సమీపంలో మీరు పనిచేస్తున్న కార్యాలయానికి సమీపంలో ఉండేలా చూసుకోండి. రాకపోకలకు మీకు ఎలాంటి ప్రతిబంధకాలు ఉండకూడదు. ఆఫీస్‌కు వెళ్లిరావడం సౌలభ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ప్రధానంగా కంపెనీలో ఉన్నతస్థాయిలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే విధి నిర్వహణ కుంటుపడుతుంది. ఇతరులకు సహాయం మేలు చేసిన.. మేలు కలుగున్. ఇతరులకు మంచి చేస్తే మీకు కూడా మంచే జరుగుతుంది. అవసరంలో ఉన్నవారికి సహకరిస్తే దాని ప్రతిఫలం భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ కెరీర్లో అలవరచుకోవాల్సిన ప్రధాన లక్షణం ఇది. కెరీర్లో సక్సెస్‌కు ప్రతిదశలో సహచరుల సహకారం అవసరం. ప్రయోజనం కలగాలనే దురుద్దేశం లేకుండా ఇతరులకు మనస్ఫూర్తిగా సహకరించండి. సహాయం చేయండి. ఇతరుల సహకారం పొందండి. -
కెరీర్లో విసుగెత్తిపోయారా?
జాబ్ స్కిల్స్: మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం విసుగ్గా ఉందా? కొలువు నిర్జీవంగా, అనాసక్తిగా మారిందా? దీన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తోందా? రొటీన్ లైఫ్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తున్నారా?... జీవితంలో చాలామందికి ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. కెరీర్లో విసుగు రావడానికి, ఉద్యోగ జీవితం చప్పగా మారడానికి చాలా కారణాలుంటా యని నిపుణులు చెబుతున్నారు. నిజాయతీ గా ప్రయత్నిస్తే.. జీవితంలో పునరుత్తేజం పొందొచ్చని, హ్యాపీగా ఉద్యోగం చేసుకో వచ్చని పేర్కొంటున్నారు. జాబ్ ఇష్టం లేకపోతే మరో రంగంలో అడుగుపెట్టి సక్సెస్ కావొచ్చని సూచిస్తున్నారు. మీరే స్థితిలో ఉన్నారు? జాబ్పట్ల విముఖత తలెత్తడానికి ప్రధానంగా చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. ఆఫీస్‌లో పై అధికారి, సహోద్యోగుల వైఖరి నచ్చక చాలామంది ఉద్యోగం వదిలేయాలని అనుకుంటారు. తమ కెరీర్లో డెడ్ ఎండ్‌కు వచ్చేసినట్లు భావిస్తుంటారు. ఆఫీస్‌లో ఎక్కువ సేపు పనిచేయడం, అదనపు బాధ్యతలను మోయాల్సి రావడం, విధి నిర్వహణలో తరచుగా ప్రయాణాలు, సేల్స్ టార్గెట్లు వంటివి ఉద్యోగులను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తాయి. కొందరు వీటిని భరించలేరు. కెరీర్లో ఎదుగుదల లేకపోయినా నీరసానికి గురవుతారు. తమకు ఆనందం కలిగించని కొలువులో ఇంకా ఎందుకు ఉండాలని ఆవేశపడుతుంటారు. తమపై బాస్‌ల పెత్తనం భరించలేని వారు కూడా కొలువుకు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ, మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇష్టంలేకపోయినా బలవంతంగా సర్దుకుపోతుంటారు. కొందరు ఉద్యోగంలో చేరినప్పుడు ఆఫీస్‌లో ఎలాంటి విధులు నిర్వర్తించారో.. ఐదేళ్ల తర్వాత కూడా అవే పనులు చేస్తుంటారు. కొత్త బాధ్యతలను చేపట్టి, కొత్త విషయాలను నేర్చుకొనేందుకు అవకాశం ఉండదు. తమ నైపుణ్యాలు వృథా అవుతున్నాయని వీరు బాధపడుతుంటారు. ఇంకొందరి పరిస్థితి మరోలా ఉంటుంది. ఆఫీస్‌లో చేద్దామంటే చేతినిండా పని ఉండదు. ఖాళీగా కూర్చోవడం వీరికి నచ్చదు. కొత్తకొత్త సవాళ్లను ఎదుర్కోవడం అంటే వీరికి చాలా ఇష్టం. కానీ, చేయడానికి పని లేకపోవడం వల్ల కెరీర్ పట్ల ఆసక్తిని కోల్పోతుంటారు. జాబ్‌లో అసంతృప్తి, అయిష్టం మరోరకం ఉద్యోగులు కూడా ఉంటారు. వీరికి తెల్లారుతుందంటేనే భయం. ఆఫీస్కెళ్లాలంటే బెంబేలెత్తిపోతుంటారు. కుర్చీలో కూర్చోగానే వీరి బుర్ర పనిచేయడం మానేస్తుంది. తాము మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారినట్లు భావిస్తుంటారు. రోజు ఎలా గడుస్తుందా? అని క్షణక్షణం ఎదురుచూస్తుంటారు. వీకెండ్ కోసం చకోర పక్షుల్లా నిరీక్షిస్తుంటారు. జాబ్‌లో సంతృప్తి లేకపోవడం, వస్తున్న జీతం సరిపోకపోవడం, ఎన్నాళ్లు పనిచేసినా వేతనం పెరగకపోవడం వంటి కారణాలతోనూ కెరీర్ పట్ల అయిష్టాన్ని చూపేవారు కూడా ఉంటారు. స్వీయ సమీక్ష తప్పనిసరి కెరీర్‌ను, జీవితాన్ని ప్రేమించాలంటే మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. ఉద్యోగం పట్ల విసుగెత్తిపోయి నప్పుడు ఇలాంటి సమీక్ష తప్పని సరి. మీకున్న అర్హతలు, నైపుణ్యాలు, అనుభవాలు, మీ ఆర్థిక పరిస్థితి తదితర విషయాలను అంచనా వేసు కోండి. మీ లక్ష్యాలేంటి? వాటిని చేరుకొ నేందుకు ఏం చేయాలి? మీరేం చేయాలను కుంటున్నారు? మీరు ఏ విషయంలో నిష్ణాతులు? మీకున్న నైపుణ్యాలకు నిజంగా ఎంత వేతనం వస్తుంది? బయట జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఉద్యోగాలు దొరుకుతున్నాయా? లేదా? అనే విషయాలను తెలుసుకొనేందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోండి. మీ ప్రస్తుత స్థితిని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. పరిస్థితిని మీరు అతిగా ఊహించుకొని భయపడకుండా, వాస్తవాన్ని మీకు తెలిసేలా చేయడంలో వారు సహకరిస్తారు. ఆఫీస్‌లో సహచరులతోనూ మాట్లాడండి. చుట్టూ నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోండి. పరిస్థితిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే వారు సరిచేస్తారు. ఇతర రంగాల్లోని వారిని కూడా సంప్రదించండి. జాబ్ మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోండి లైఫ్ రొటీన్‌గా మారినప్పుడు స్వయంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉదయం యోగా చేయండి. దీనివల్ల మనసు, శరీరం రిలాక్స్ అవుతాయి. మీ రంగానికి సంబంధం లేని మరో ఆఫీస్‌ను సందర్శించండి. దీనివల్ల మీ పరిస్థితిని మరో కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. వీకెండ్లో కొత్తగా ఏదైనా చేయండి. వీలుంటే డ్యాన్స్ క్లాస్‌లో చేరండి. లాంగ్ డ్రైవ్‌కు కూడా వెళ్లొచ్చు. కొత్త ప్రదేశాన్ని దర్శించండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి అప్పటిదాకా పరిచయం లేని కొత్త పనిచేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీస్ పనుల్లోనూ మార్పులు చేసుకోండి. మరో టీమ్‌తో కలిసి పనిచేయండి. కొత్త బాధ్యతలను స్వీకరించండి. వేతనం సరిపోకపోతే ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లండి. కొలువు మారాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే.. మీ అర్హతలను పెంచుకోండి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్‌తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement