-
బ్రాండ్ కా బాప్.. అమితాబ్
Happy Birthday Amitabh Bachchan: నటనలో కొందరు అరుదు. అంటే వయసు మీద పడినా.. వాళ్ల మీద జనాల అభిమానం మాత్రం తగ్గదు. పైగా వాళ్ల ఛరిష్మా.. ఏ జనరేషన్‌ను అయినా ఇట్టే ఆకట్టుకోగలుగుతుంది. అలాంటి తారల్లో ముందు వరుసలో ఉంటారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. అందుకే ఇప్పటి మార్కెట్లోనూ ఎండార్స్మెంట్ కింగ్‌గా రాణించగలుగుతున్నారు ఆయన. అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు ఇవాళ(అక్టోబర్ 11). తన 79వ పుట్టినరోజు సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ పాన్ మసాలా బ్రాండ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డబ్బుల్ని సైతం వెనక్కి ఇచ్చేసిన ఆయన.. ఇది Surrogate advertising( నిషేధించిన అడ్వైర్టైజ్మెంట్) జాబితాలో ఉందని తెలియక ఒప్పుకున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన కార్యాలయం నుంచి ఒక ప్రకటన సైతం విడుదల చేశారు. సాధారణంగా తారలు తమ బ్రాండ్ ఇమేజ్ కోసం Surrogate advertisementsలోనూ కనిపిస్తుంటారు. అయితే అమితాబ్ మీద జనాల్లో ఓ నమ్మకం ఉందని, దానిని చెడగొట్టుకోవద్దని నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్(నాటో) సంస్థ కోరింది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా! అందుకే వైదొలిగినట్లు ప్రకటించారు. ఆ నమ్మకమే.. బాలీవుడ్ మెగాస్టార్ లెజెండెస్ ఆఫ్ ఆల్‌టైం.. ఎవర్గ్రీన్ ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ ఆఫ్ బాలీవుడ్ బాలీవుడ్ షెహన్షా.. ఇలా ఏ పేర్లతో పిలుచుకున్నా సరే.. అమితాబ్ అంటే దేశం మొత్తానికి ఓ అభిమానం ఉంది. ‘డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ, నా ముమ్కిన్ హై’.. సాధారణంగా యంగ్ సెలబ్రిటీకి ఎండార్స్మెంట్ మార్కెట్ రెడ్‌కార్పెట్ పరుస్తుంటుంది. అలా కాకుండా ఎనిమిది పదుల వయసు దగ్గరపడుతున్నా.. ఎండార్స్మెంట్ కింగ్‌గా ఆయన కొనసాగడం మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. అందుకు కారణాలేంటో చూద్దాం. ►సినిమాకు సంబంధించి మాత్రమే కాదు.. సాధారణ సొసైటీలోనూ అమితాబ్ ప్రభావం ఎక్కువే. ►ఆయన యాడ్స్‌ల్లో పిల్లలకు ఏదైనా చెబితే ఇంట్లో తాత చెప్పినట్లే ఉంటుంది. ►ఓ తండ్రిగా, ఓ పెద్దన్నగా, ఓ మామగా, ఊరికి ఓ పెద్దమనిషిగా.. ఆయన ఏం చెబితే అంతా వింటారనే నమ్మకం మార్కెట్లో క్రియేట్ అయ్యింది. ►ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్(IIHB) ఇచ్చిన టియారా(Trust, Identify, Attractive, Respect and Appeal) నివేదికలో బిగ్ బీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ►దేశంలో వందకి 88 మంది.. అమితాబ్ చేసే బ్రాండింగ్‌ను నమ్ముతామని చెప్పారు ►ఆయన ఇచ్చే ప్రకటనలు నమ్మశక్యంగా ఉంటాయని తేల్చారు వాళ్లంతా. ►హుందాగా ఆయన చేసే యాడ్ ఏదైనాసరే.. భాషతో సంబంధం లేకుండా జనాల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది ►అమితాబ్ ఒక్కో కమర్షియల్యాడ్కు తీసుకునే రూ.5 నుంచి 8 కోట్ల మధ్య(స్టార్టప్టాకీ ప్రకారం) తీసుకుంటారట! ►పిల్లలు ఇష్టపడే మ్యాగీ నుంచి వాళ్ల ఆరోగ్య భద్రత కోసం పోలియో వ్యాక్సిన్ ప్రచారం దాకా, క్యాడబరీ చాక్లెట్ నుంచి నగల దాకా, హెల్త్, స్పోర్ట్స్, ఫుడ్, ఈ-కామర్స్, వెహికిల్స్.. ఇలా అన్ని యాడ్స్‌లోనూ అమితాబ్ మార్క్ కనిపిస్తుంటుంది. ►ఐరాసకు సంబంధించిన పలు విభాగాలకు అంబాసిడర్‌గా.. స్వచ్ఛ భారత్ అభియాన్, పొలియో వ్యాక్సిన్ లాంటి ప్రభుత్వ ప్రచారాలకు సైతం అమితాబ్ పెద్దరికం తోడవుతోంది. ► వివాదాలకు దూరంగా ఉండే అమితాబ్.. ఎండార్స్మెంట్ల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దని భావించారు. అందుకే ఆ పాన్ మసాలా యాడ్ నుంచి వైదొలిగారు. HBDAmitabhBachchan.. సెలబ్రిటీల ట్వీట్లు కొన్ని.. Wishing My Beloved Big Brother, My forever Guru, the One and Only Amit Ji @SrBachchan a very Happy Birthday. Many Many Happy Returns!! Health, Happiness and More Power to You Amit ji!!🙏 pic.twitter.com/h3Q5wyrB4n — Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2021 Sending the most splendid birthday wishes to the legend of Indian Cinema! Happy birthday to you dear Amitabh Ji! @SrBachchan pic.twitter.com/u4rfOzPDd6 — Mohanlal (@Mohanlal) October 11, 2021 Happy Birthday Amitabh Sir ❤@SrBachchan#AmitabhBachchan pic.twitter.com/rrDpQd44uH — Mammootty (@mammukka) October 11, 2021 My hero, my idol, my friend, my father! Happy birthday Dad. Love you @SrBachchan pic.twitter.com/8DzGRyoxEF — Abhishek Bachchan (@juniorbachchan) October 11, 2021 Happy birthday, @SrBachchan sir! May you continue to inspire us with your unparalleled brilliance. Good health and happiness always! — Mahesh Babu (@urstrulyMahesh) October 11, 2021 Happy birthday to the versatile and the evergreen @SrBachchan sir. 🎂🤗 Wishing you good health and happiness always. — Virat Kohli (@imVkohli) October 11, 2021 Sir, looking at you through a different lens taught me what being a true artiste is. Happy Birthday dear Amitji@SrBachchan pic.twitter.com/v3V5qhQO3w — Ajay Devgn (@ajaydevgn) October 11, 2021 Happy birthday my handsome paapajiiiii♥️ @SrBachchan 🌸 You are truly the awesomest..✨ We love you! Thank you for being the most amazing human being.. We wish you all the love, health and happiness🌸 — Rashmika Mandanna (@iamRashmika) October 11, 2021 Many More Happy Returns Sarkaar @SrBachchan Never Before Never Again ; 🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/xPb5pmrcWb — Harish Shankar .S (@harish2you) October 11, 2021 - సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఒక్క యాడ్ కోసం 6 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా వారికి వర్తించినంత బాగా వేరే ఎవరికి వర్తించదమో. ఎందుకంటే విజయాలు ఉంటేనే వారికి గుర్తింపు, ఆదాయం. అందుకే ఫామ్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు హీరో హీరోయిన్లు. ప్రస్తుతం ఇదే బాటలో ఉన్నారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. ఇన్నాళ్లు వరుస వైఫల్యాలు చూసిన రణ్‌బీర్ కెరీర్‌ను ‘సంజు’ ఒక్కసారిగా మలుపుతిప్పింది. దాంతో ఆయన తన పారితోషికాన్ని రెండింతలు పెంచేశారంట. అయితే పారితోషికం పెంచింది సినిమాలకు కాదు, ప్రకటనల కోసం. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్‌తో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ‘సంజు’ విజయం తర్వాత ఈ హీరో ప్రకటనల కోసం తీసుకునే పారితోషకాన్ని రెండు రెట్లు పెంచినట్లు సమాచారం. గతంలో రణ్‌బీర్ కమర్షియల్ వర్క్ కోసం రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల రూపాయలు తీసుకునేవారంట. కానీ ఇప్పుడు రోజుకు రూ.6 కోట్లు అడుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రణ్‌బీర్ దాదాపు 10 బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. ‘సంజు’ తర్వాత రణ్‌బీర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టులో తొలి పార్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
విరాట్ కోహ్లికి రోజుకు 5 కోట్లు..!
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి... బాలీవుడ్ దిగ్గజాలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ కంటే కాస్ట్ లీగా మారారు. విరాట్ కోహ్లికి ఎండోర్స్మెంట్ కింద చెల్లించే ఫీజులు రోజుకు 5 కోట్లకు జంప్ చేశాయి. కొత్త కాంట్రాక్ట్‌లకు ఆయన సంతకాలు చేయడంతో ఎండోర్స్మెంట్ల ద్వారా కోహ్లి ఆర్జించే ఆదాయం భారీగా రూ.5కోట్లకు పెరిగింది. అంతకముందు కోహ్లి రోజుకు కేవలం రూ.2.5 కోట్ల నుంచి రూ.4 కోట్లు మాత్రమే ఆర్జించేవారు. ఈ పెంపుతో దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే బ్రాండు అంబాసిడర్ గా కోహ్లి నిలిచారు. ఆశ్చర్యకరంగా ఈ పారితోషికం, అంతకముందు ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోని, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ రణబీర్, రణ్వీర్ కపూర్ల కంటే ఎక్కువ. తాజా అంచనాల ప్రకారం షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లకు రోజుకు చెల్లించే ఎండోర్స్ మెంట్ ఫీజులు 3 నుంచి 3.5 కోట్ల మధ్యనే ఉన్నట్టు తెలిసింది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్టు ప్రకారం.. కోహ్లి ఇటీవల రెండు బ్రాండులకు ఎండోర్స్మెంట్ కు ఒప్పుకోవడంతో ఈ ఫీజులు పెరిగినట్టు తెలిసింది. జర్మన్ స్పోర్ట్స్ వేర్ బ్రాండు పుమాకు ఎనిమిదేళ్ల కాంట్రాక్ట్ పై సంతకం పెట్టినట్టు కోహ్లి గత నెలే ప్రకటించారు. ఈ డీల్ కింద కోహ్లి రూ.110 కోట్లు ఆర్జించనున్నారు. మొత్తంగా 18 బ్రాండులను ఆయన ఎండోర్స్ చేసుకున్నారు. ఆడి కార్లు, ఎంఆర్ఎఫ్ టైర్లు, టిస్సోట్ వాచ్ లు, జియోనీ ఫోన్లు, బూస్ట్ మిల్క్ డ్రింక్, వంటి ఉత్పత్తులు దీనిలో ఉన్నాయి. పలు కంపెనీల్లో సైతం కోహ్లి పెట్టుబడులున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement