-
కళాశాలల త‘ఖరారు’..!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అత్యంత కీలకమైనవి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన పథకాలే. ఇవి అమలు చేయాలంటే సదరు కాలేజీ తప్పకుండా ఈపాస్ వెబ్ పోర్టల్‌లో ధ్రువీకరణ చేయించుకోవాలి. ఇందుకోసం సంబంధిత కాలేజీల యాజమాన్యాలు ఈపాస్ పోర్టల్‌లో కాలేజీ గుర్తింపు పత్రాలు, ఏటా సంబంధిత బోర్డు/ యూనివర్సిటీ ద్వారా పొందిన అఫిలియేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించిన అధికారులు సదరు కాలేజీని ధృవీకరించి అందులో చదువుతున్న విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను వర్తింపజేస్తారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,833 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలుండగా.. వీటిలో ఇప్పటి వరకు పోర్టల్‌లో సంక్షేమాధికారులు ధ్రువీకరించిన కాలేజీలు 2,843 మాత్రమే. ధృవీకరణ పొందిన వాటిలో 2,626 జూనియర్ కాలేజీలుండగా.. మరో 150 ఐటీఐలున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీల కేటగిరీలో ఇప్పటివరకు ధ్రువీకరణ పొందినవి కేవలం 67 కాలేజీలు మాత్రమే ఉండడం గమనార్హం. జాప్యం ప్రభావం విద్యార్థులపైనే... కాలేజీ యాజమాన్యాలు ఈపాస్‌లో ధ్రువీకరణ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. కానీ చాలా కాలేజీలు ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు మొక్కుబడిగా ఈపాస్ పోర్టల్‌లో వివరాలు సమర్పించి చేతులు దులుపుకుంటున్నాయి. అఫిలియేషన్, గుర్తింపు పత్రాలను పూర్తిస్థాయిలో అప్లోడ్ చేయకుండానే సబ్మిట్ చేస్తున్నట్లు సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి పత్రాలు సమర్పించిన కాలేజీలను మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు వెబ్సైట్లో ధ్రువీకరణ పొందగా... డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు మాత్రం అత్యంత వెనుకబడ్డాయి. ►డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 117 కాలేజీలుండగా... వీటిలో కేవలం రెండు కాలేజీలు మాత్రమే పోర్టల్‌లో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ►జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో 200 కాలేజీల్లో ఒక్క కాలేజీ కూడా పోర్టల్‌లో కన్ఫర్మ్ కాలేదు. ►డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 30 కాలేజీలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో 111 కాలేజీలు, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 99 కాలేజీలు, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 115 కాలేజీలు, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 79 కాలేజీలు, టీఎస్ పారామెడికల్ బోర్డు పరిధిలో 142 కాలేజీలుండగా వీటిలో ఇప్పటివరకు ఒక్క కాలేజీకి కూడా ధ్రువీకరణ దక్కలేదు. ►ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 535 కాలేజీలుండగా... కేవలం 8 కాలేజీలు మాత్రమే పోర్టల్‌లో కన్ఫర్మ్ అయ్యాయి. ►కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో 115 కాలేజీలుండగా... ఒక్క కాలేజీ మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది. ►డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో 215 ఐటీఐల్లో 150 ఖరారు కాగా మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. -
ఫీజుల పథకంలో ఫ్రెష్ విద్యార్థులకు ఛాన్స్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద లబ్ధి పొందేందుకు ఫ్రెష్ విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఫ్రెష్ విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం నుంచి అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి డిగ్రీ కోర్సులకు మాత్రమే అవకాశమిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తెలిపారు. ఇంటర్ కోర్సుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే ఇంటర్ విద్యార్థులకు అవకాశమిస్తామని మంగళవారం ‘సాక్షి’తో ఆయన పేర్కొన్నారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గడువు విధించడం లేదు. ఎందుకంటే ఆధార్‌కు సంబంధించిన యూఐడీ నంబర్‌ను ఈ-పాస్ వెబ్ సైట్లో నమోదు చేస్తేనే దరఖాస్తు ఓపెన్ అవుతుంది. దాదాపు 40 శాతం మంది విద్యార్థులకు ఆధార్ లేదని గణాంకాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో గడువు విధించలేదని, యూఐడీ నంబర్ నమోదు చేస్తే దరఖాస్తు లభించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. ఈ-పాస్ వెబ్సైట్లో టెన్తక్లాస్ వివరాలు సమర్పించిన తర్వాత ఆధార్ యూఐడీ నంబర్‌ను రెండుసార్లు, మొబైల్ నంబర్‌ను రెండు సార్లు నమోదు చేయాలి. వెంటనే విద్యార్థి మొబైల్ నంబర్‌కు వచ్చిన పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తేనే దరఖాస్తు లభిస్తుందని అధికారులు సూచించారు. త్వరగా యూఐడీ నెంబర్ పొందితే పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిబంధన ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులకు వర్తిస్తుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement