-
పోకిరీకి యువతి చెప్పుతో సమాధానం..
గోల్కొండ: తనను వెంబడిస్తున్న పోకిరీకి ఓ యువతి చెప్పుతో బుద్ధి చెప్పిన సంఘటన ఆదివారం మెహిదీపట్నం ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్‌కు చెందిన ఓ యువతి బైక్‌పై మెహిదీపట్నం వైపు వస్తుండగా, తనను ఓ యువకుడు బైక్‌పై వెంబడిస్తున్నట్లు గుర్తించింది. రేతిబౌలి మీదుగా ఆసిఫ్‌నగర్ ఏసీపీ కార్యాలయం వద్దకు రాగానే ఆమె నడిరోడ్డుపై బైక్‌ను ఆపి తనను వెంబడిస్తున్న యువకుడి వాహనానికి అడ్డుకుని అతడిపై చెప్పుతో దాడి చేసింది. దీంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో సదరు యువకుడు అక్కడినుంచి పరారయ్యాడు. తనను అడ్డుకున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దుండగుడిని పట్టుకోకపోగా, తనను ఎందుకు ఆపారని నిలదీసింది. -
మహిళతో చెప్పు దెబ్బలు తిన్నాడు
బెంగళూరు(కర్ణాటక): చుట్టూ జనం ఉన్నారనే భయం లేకుండా ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన బుధవారం జాలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం జాలహళ్లి క్రాస్ సిగ్నల్ వద్ద ఓ మహిళ రోడ్డు దాటడానికి ఎదురు చూస్తుండగా అదే సమయంలో అక్కడే ఉన్న టీ.దాసరహళ్లికి చెందిన నారాయణప్ప ఆమెను పదే పదే తాకుతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో ఓపిక నశించిన మహిళ నారాయణప్పను చేతితో కొట్టింది. దీంతో షాక్‌కు గురైన అతడు ఏదో పొరపాటున చేయి తగిలిందంటూ తిరిగి మహిళను బెదిరించడానికి ప్రయత్నించాడు. ఆమె నారాయణప్పను చెప్పుతో కొట్టడం ప్రారంభించడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ భైరేగౌడ మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న పింక్ హొయ్సళ వాహనం అక్కడికి చేరుకొని మహిళను, నారాయణప్పను స్టేషన్ తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నారాయణప్పను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ భైరేగౌడను డీసీపీ శోభారాణి అభినందించి నగదు బహుమానాన్ని అందించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement