-
పఠాన్ టికెట్ ఇప్పించండి.. లేదంటే చచ్చిపోతా: షారుక్ ఫ్యాన్ ఆవేదన
పలు వివాదాల తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ పఠాన్ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతోంది. హై వోల్డేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందిన ఈ మూవీ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు అయిదేళ్ల తర్వాత షారుక్ వెండితెరపై సందడి చేయబోతోంది. దీంతో ఈ చిత్రంపై బాద్షా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షారుక్ వీరాభిమాని ఓ వీడియో షేర్ చేశాడు. తనకు పఠాన్ మూవీ టికెట్ ఇప్పించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ రియాన్ అనే అభిమాని ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ఈ మేరకు అతడు ట్విటర్లో వీడియో షేర్ చేశాడు. ‘నేను షారుక్ ఖాన్‌కు వీరాభిమానిని. ఐ లవ్ మై షారుక్. జనవరి 25న నేను పఠాన్ మూవీ చూడాలి, షారుక్‌ను కలవాల్సిందే. కానీ సినిమా టికెట్ కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. ప్లీజ్ నాకు ఎవరైనా సాయం చేయండి. పఠాన్ మూవీ టికెట్ పంపించండి. ప్లీజ్ భయ్యా నాకు మద్దతు ఇవ్వండి. లేదండే ఈ పౌండ్లో దూకి ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరి అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ వల్ల ఈ దేశానికి, నీ కుటుంబానికి ఏం ఉపయోగం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్నే పొగొట్టుకునేందుకు సిద్దపడ్డావు. ఈ సినిమా వల్ల నీ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? ఇదేం నీకు గుర్తింపు, గౌరవం ఇవ్వదు. సినిమాకు వినోదంలా మాత్రమే చూడండి’ అంటూ కామెంట్ చేయగా ‘మీరు ఎక్కడ ఉంటారు భయ్యా.. నేను మీకు సాయం చేస్తాను’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘మరి ఇంత డ్రామా చేయకు’ అంటూ ఇంకో నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. కాగా పఠాన్ మూవీ టికెట్లు ఇప్పటికే లక్షకు పైగా అడ్వాన్స్ బుక్ అయినట్లు ట్రెడ్ వర్గాల నుంచి సమాచారం. #Pathaan plz support me friends plz Pathaan 1 tickets plz help 😭😭 #PathaanMovie #PathaanFirstDayFirstShow pic.twitter.com/1ue59cw2OJ — Riyan (@Riyan0258) January 19, 2023 -
మెగాస్టార్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా..?
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. ఓ దశలో బిగ్ పనిఅయిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయినా పడిలేచిన కెరటంలా దిగ్విజయంగా దూసుకెళ్తున్నారు. విజయాలు, పరాజయాలు ఏవి ఎదురైనా అమితాబ్‌కు స్ఫూర్తి కలిగిస్తూ ముందుకు నడిపించేది ఎవరంటే..? కోట్లాది అభిమానులట. 73 ఏళ్ల బిగ్ బీ స్వయంగా ఈ విషయం చెప్పారు. 'అభిమానులు చూపే ప్రేమ, అనురాగాన్ని నిర్వచించేందుకు పదాలు చాలవు. వాళ్లు నిరంతరం అండగా ఉంటూ మద్దతు ఇస్తున్నారు. నాపై ఎంతో విశ్వాసం చూపుతున్నారు. దీన్ని ఎంతో గొప్పగా భావిస్తున్నా. అభిమానుల ప్రేమ నాలో స్ఫూర్తి కలిగిస్తోంది. ప్రతి నిమిషం బలాన్ని ఇస్తోంది. ఈ ప్రేమ స్వచ్ఛమైనది. ఎప్పుడూ కలుషితం కాదు. ఇదేదో సాదాసీదా కృత్రిమమైన ప్రేమ కాదు. ఈ ప్రేమ గురించి వర్ణించడానికి పదాలు చాలవు. వెలకట్టలేనిది. అందరికీ ధన్యవాదాలు' అని అమితాబ్ ట్వీట్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
కాంగ్రెస్ ‘సోషల్’ టీంలో ఐదుగురు అరెస్ట్
నేను గెలుస్తానో లేదో..
దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
కర్నూలు ప్రెస్‌కు అరుదైన అవకాశం
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
తప్పక చదవండి
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
- సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
- తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
Advertisement