-
షారుక్ లేనిదే 'డాన్' లేదు.. ఇప్పుడేమో ఏకంగా!
‘మా డాన్ షారుక్ ఖాన్... వేరే ఎవర్నీ ఊహించలేం’ అంటూ మంగళవారం పలువురు షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అబిప్రాయాలు వైరల్ అవుతున్నాయి. ‘డాన్, డాన్ 2’ తర్వాత రానున్న ‘డాన్ 3’లో షారుక్ నటించరన్న వార్త గుప్పుమనడంతో ‘‘షారుక్ ప్లేస్‌లో వేరే డాన్ని చూడలేం’’ అంటున్నారు ఫ్యాన్స్. మంగళవారం ఫర్హాన్ అక్తర్ చెప్పీ చెప్పనట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్‌తో ‘డాన్ 3’ అంశం పై చర్చ ఊపందుకుంది. ఆ వివరాల్లోకి వెళదాం.. హిందీ తెరపై డాన్ అంటే అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. ఆయన టైటిల్ రోల్లో రూపొందిన ‘డాన్’ (1978) సూపర్ డూపర్ హిట్టయింది. చంద్ర బారోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అయిన బడ్జెట్ దాదాపు రూ 70 లక్షలు. కానీ వసూళ్లు రూ. 7 కోట్లు. అంటే.. పదింతల లాభం. డాన్‌గా అమితాబ్ యాక్షన్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదే సినిమా తెలుగు రీమేక్ ‘యుగంధర్’ (1979)లో ఎన్టీఆర్, తమిళ రీమేక్ ‘బిల్లా’లో రజనీకాంత్ నటించారు. దక్షిణాదిన కూడా ఈ డాన్ సూపర్ హిట్. ది చేజ్ బిగిన్స్ ఎగైన్ అమితాబ్ బచ్చన్ డాన్ క్యారెక్టర్ అద్భుతంగా చేయడంతో ఇక డాన్ క్యారెక్టర్ అంటే ఆయనే అని ఫిక్స్ అయ్యారు బాలీవుడ్ ప్రేక్షకులు. అలాంటి తరుణంలో ‘నేను ఉన్నాను’ అంటూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత షారుక్ ఖాన్ డాన్‌గా తెరపైకి వచ్చారు. షారుక్ డాన్ రోల్లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006) రూపొందింది. అమితాబ్ ‘డాన్’కి రీ బూట్ వెర్షన్‌లా ఫర్హాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 30 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయించారు. ఇక అమితాబ్ తర్వాతి తరంలో డాన్ అంటే షారుక్ అనేలా కింగ్ ఖాన్ అద్భుతంగా నటించారు. షారుక్ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘డాన్’ దాదాపు రూ. 105 కోట్ల వసూళ్లు రాబట్టి, సంచలన విజయం సాధించింది. ది కింగ్ ఈజ్ బ్యాక్ సిల్వర్ స్క్రీన్‌పై ఒక పాత్ర హిట్టయితే ఆ క్యారెక్టర్ని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అమితాబ్ ‘డాన్’ తర్వాత మళ్లీ డాన్ క్యారెక్టర్ని చూడాలనుకున్నారు. షారుక్ ‘డాన్’గా వచ్చి, అలరించారు. ఈ హిట్ డాన్ని అలా వదిలేస్తే ఎలా? మళ్లీ ఈ పాత్ర చేయాలని షారుక్ అనుకున్నారు. డాన్ కోసం కథలు తయారు చేయించాలని ఫర్హాన్ కూడా ఫిక్స్ అయ్యారు. అలా ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ సెకండ్ వెర్షన్ ఆరంభించారు. ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ విడుదలైన ఐదేళ్లకు ‘డాన్ 2’ (2011)ని వెండితెరపైకి వదిలారు. ఇందులోనూ షారుక్ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’కి రెండింతల బడ్జెట్.. అంటే దాదాపు రూ. 80 కోట్లతో రూ΄పొందించారు. సుమారు రూ. 200 కోట్ల వసూళ్లతో రీబూట్ వెర్షన్లో వచ్చిన ఈ రెండో ‘డాన్’ కూడా ఘనవిజయం సాధించింది. ఫస్ట్ వెర్షన్‌కి ఫర్హాన్ దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించారు. రెండో వెర్షన్‌కి కూడా ఫర్హాన్ ఈ రెండు బాధ్యతలు చేపట్టగా, షారుక్ నటించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘డాన్ 3’లో రణ్వీర్ సింగ్? ప్రేక్షకులు, షారుక్ అభిమానులు డాన్ క్యారెక్టర్ని మరచిపోలేదు. షారుక్ కూడా డాన్ పాత్రతో అనుబంధం పెంచుకున్నారు. ఫర్హాన్‌కి కూడా ఆ పాత్ర అంటే మక్కువ. అందుకే 2011లో ‘డాన్ 2’ని రిలీజ్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకూ ‘డాన్ 3’ గురించి ఏదో సందర్భంలో ఇద్దరూ మాట్లాడుతూ వచ్చారు. ‘డాన్ 3’ కచ్చితంగా ఉంటుందని ఫర్హాన్ చెప్పుకుంటూ వచ్చారు. త్వరలో మూడో వెర్షన్‌కి శ్రీకారం జరిగే అవకాశం ఉందని మంగళవారం ఫర్హాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో స్పష్టం చేస్తోంది. ఆ వీడియోలో ‘3’ అంకె కనిపించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డాన్’ థీమ్ మ్యూజిక్ వినబడుతోంది. అలాగే కొత్త శకం ఆరంభం కాబోతోంది అని ఉంది. సో... ‘డాన్ 3’ రానుందని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఫర్హాన్ నటీనటులను ప్రకటించలేదు. దాంతో ఒకవేళ షారుక్ ఖాన్ అని ఫిక్స్ అయ్యుంటే.. ప్రకటించి ఉండేవారు కదా అనే చర్చ మొదలైంది. అలాగే కొత్త డాన్‌గా రణ్వీర్ సింగ్ నటిస్తారనే వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. సో.. థర్డ్ వెర్షన్లో నటించబోయేది రణ్‌వీరే అని షారుక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. పైగా ‘కొత్త శకం ఆరంభం కాబోతోంది’ అన్నారు కాబట్టి హీరోని మార్చే ఆలోచనలో ఫర్హాన్ ఉన్నారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ ఫర్హాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేస్తే షారుక్ చేయాలి.. లేదా ఈ సిరీస్‌కి ఫుల్స్టాప్ పడాలన్నట్లుగా స్పందిస్తున్నారు. మరోవైపు రణ్వీర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. షారుక్ మళ్లీ డాన్‌గా కనిపిస్తారా లేక రణ్వీర్ తెర మీదకు వస్తారా? ఒకవేళ రణ్వీర్ వస్తే.. అప్పట్లో అమితాబ్‌కి దీటుగా నటించి, డాన్‌గా భేష్ అని షారుక్ అనిపించుకున్నట్లే రణ్వీర్ కూడా ప్రేక్షకుల మెప్పు ΄పొందగలుగుతారా? వేచి చూడాల్సిందే. -
శ్రద్ధా, పర్హాన్ లకు ఏమైంది?
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ లపై వచ్చిన తాజా పుకార్లపై, శ్రద్ధ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించారు. ఫర్హాన్ ఇంటినుంచి తన కూతురిని బయటకు లాక్కొచ్చేశాడన్నవార్తలను రూమర్లని కొట్టిపారేశాడు. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇదే విషయంలోతనను ఫోన్ లో కూడా ప్రశ్నించారని.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. తాను 35 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలోఉన్న తను అలా ప్రవర్తించనని శక్తి స్పష్టం చేశారు. అయితే బాలీవుడ్ మూవీ ఆషికి తో యూత్ లో యమ క్రేజ్ సంపాదించిన శ్రద్ధా కపూర్, ఫర్హాన్ అక్తర్ లపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డంలేదు. రాక్ 2 సినిమా మొదలు శ్రద్ధా, అక్తర్‌ల ప్రేమ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ భాగ్ మిల్కా భాగ్ నటుడితో పీకల్లోతు ప్రేమలో పడిన శ్రద్ధాకపూర్, ఏకంగా అతని నివాసానికే తన మకాం కూడా మార్చేసిందన్నది బీ టౌన్ టాక్. ఈ విషయం తెలుసుకున్న శక్తికపూర్ ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చేశారని వార్తలు చెలరేగాయి. వీరిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చక పోవడం వల్లే ఈ సంఘటన జరిగిందన్న వాదనలు వినిపించాయి. కాగా మరో హీరోయిన్, వాజిర్ మూవీలో కలిసి నటించిన అదితిరావు, ఫర్హాన్ అక్తర్ సంబంధాలపై అప్పట్లో బాలీవుడ్ గుప్పుమంది. మరోవైపు సహజీవన వార్తలను శ్రద్ధా-ఫర్హాన్ ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. -
టాయ్ గన్‌తో సెల్పీ...తుపాకీ గుళ్లకి బలి
ఇస్లామాబాద్: టీనేజర్ ఫర్హన్ తన వద్దనున్న టాయి్ గన్‌తో సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకోవడమే అతడి జీవితానికి అఖరి క్షణాలయ్యాయి. ఫర్హన్ వద్దనున్న టాయ్గన్ నిజమైనదని... అతడు దొంగ అని భావించిన ఓ పోలీసు.. ఫర్హన్పై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసు ఎటువంటి హెచ్చరికలు చేయకుండానే ఫర్హన్పై కాల్పులు జరిపాడు.దాంతో ఫర్హన్ కుప్పకూలిపోయి.. మరణించాడు. అక్కడే ఉన్న అతడి స్నేహితుడు ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఘటన స్థలానికి వచ్చిన కాల్పులు జరిపిన పోలీసు... ఫర్హన్ వద్ద ఉన్నది టాయి గన్ అని నిర్థారించుకున్న సదరు పోలీసు తప్పు చేశానని తెలుసుకున్నాడు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. కాల్పులు జరిపిన పోలీసును పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ నగరంలో చోటు చేసుకుందని మీడియా మంగళవారం ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement