-
చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..
'మజిలీ’ తో మొదలుపెట్టిన దివ్యాన్ష కౌశిక్.. అనతికాలంలోనే ఎంతోమంది మదిని దోచి అంతులేని అభివనాన్ని సొంతం చేసుకుంది. తాను అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని అని చెబుతోంది దివ్యాన్ష. మరి ఆమె మదిని దోచిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని. దిల్నాజ్.. ముంబైకి చెందిన దిల్నాజ్ కర్బరీ.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీ వద్ద దాదాపు పదిహేనేళ్ల పాటు కోచర్ డిజైన్ హెడ్‌గా పనిచేసింది. ఫ్యాషన్‌పై ప్రావీణ్యం, పట్టు రెండ ఉండటంతో 2009లో తన పేరు మీదనే ముంబైలో ‘దిల్నాజ్’ ఫ్యాషన్ హౌస్‌ని ప్రారంభించింది. వైబ్రెంట్ కలర్స్.. డిజైన్స్‌కి ఈ బ్రాండ్ పెట్టింది పేరు. గ్రాండ్ లుక్‌నిచ్చే దిల్నాజ్ బ్రాండ్ దుస్తులు సెలబ్రిటీలను సైతం మెప్పిస్తున్నాయి. ధర కాస్త ఎక్కువే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక దివ్వాన్ష కౌశిక్ కోసం దిల్నాజ్ డిజైన్ చేసిన చీర బ్రాండ్ ధర రూ. 59,900/- దివ్యాన్ష కౌశిక్జ్యూలరీ బ్రాండ్: జతిన్ మోర్ జ్యూయల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. జతిన్ మోర్.. అతిప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ఒకటి జతిన్ మోర్ జ్యూయల్స్. 1891లో ఆనంద్ మోర్ ప్రారంభింన వ్యాపారాన్ని.. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసుడు జతిన్ మోర్.. ‘జతిన్ మోర్ జ్యూయల్స్’ పేరుతో కొనసాగిస్తున్నాడు. సంస్కృతి, సంప్రదాయ, హస్తకళల సారాన్ని ఆధునిక డిజైన్స్‌లో వర్ణింనట్టుంటాయి ఈ ఆభరణాలు. అదే వీరి బ్రాండ్ వాల్య! ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతోపాటు ఆన్‌లైన్‌లోన లభ్యం. దివ్యాన్ష కౌశిక్ -దీపిక కొండి -
ఫ్యాషన్ జువెలరీలోనూ పువ్వుల నగలు
-
ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ
చినుకులా మొదలై..సునామీలా చుట్టేస్తున్న ‘చిను కలా’ స్టోరీ వింటే..ఎక్కు తొలి మెట్టు.. కొండని కొట్టు ఢీకొట్టు. గట్టిగా పట్టే నువు పట్టు...గమ్యం చేరేట్టు అన్న సినీ కవి మాటలు గుర్తు రాకమానవు. శిల..శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే. ఆ కష్టాలు, కడగండ్లే సరికొత్త భవిష్యత్తుకు పునాది. పొట్టతిప్పల కోసం అష్టకష్టాలు పడుతూ లగ్జరీ అంటే ఏంటో తెలియని జీవితంనుంచి కోట్ల టర్నోవర్‌తో ఒక లగ్జరీ బ్రాండ్‌తో ఉన్నత శిఖరాలకు చేరి చిను కలా తన కలలను పండించుకున్న తీరు స్ఫూర్తి దాయకం. ప్రసిద్ధ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ రూబన్స్ యాక్సెసరీస్ డైరెక్టర్ చిను కలా సక్సెస్ స్టోరీ: 1981 అక్టోబర్ 10న రాజస్తాన్‌లో పుట్టిన చిను స్కూల్లో చదువుకుంటున్నపుడే కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లోంచి పారిపోయింది. ముంబైలోని సెయింట్ అలోసియస్ 10వ తరగతి చదువుతున్నపుడే.. దాదాపు 15 ఏళ్లకే పొట్టకూటికోసం రోడ్డుమీద పడింది. ఇంటి గడపదాటే నాటికి ఆమె వద్ద కేవలం రూ. 300, ఒక బట్టల బ్యాగ్ మాత్రమే ఉన్నాయి. (నిజానికి 13 ఏళ్ల వయస్సప్పుడే తండ్రి ఇంట్లోంచి పొమ్మంటూ అవమానించాడట) ఏం చేయాలో అర్థం కాక ముంబైలోని రైల్వే స్టేషన్లో రెండు రోజులు పడుకుంది. ఒక మూల కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తూ కంటికి ధారలా ఏడ్చింది. డోర్-టు-డోర్ సేల్ గురించి ఒక మహిళ ద్వారా తెలుసుకుని చివరికి సేల్స్‌గర్ల్ అవతార మెత్తింది. ఇంటింటికీ తీరుగుతూ వంటింటి కత్తుల, కోస్టర్ సెట్లను అమ్మడం స్టార్ట్‌చేసింది. అలా రోజుకు కేలం 20 రూపాయల సంపాదనతో కడుపు నింపుకునేది. (ముద్దుల మనవలకు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్) ముంబై లాంటి మహానగరంలో ఒంటరిగా, అదీ సేల్స్ గర్ల్‌గా ఎక్కే గడపా, దిగే గడపా అన్నట్టు తిరుగుతూ అనేక అవమానాలను ఎదుర్కొంది. అందరూ ఈమె ముఖం మీదే తలుపులు వేసేవారు. వంద ఇళ్లు తిరిగితే ఒకటో రెంటో అమ్మ గలిగేది. దీనికి తోడు అక్కడ పనిచేసేవాళ్లందరికీ ఒకటే హాలు, వంటగదీ లేదు. వాష్ రూం అంతకన్నా లేదు. దుర్భర జీవితం. అయినా ఓడిపోలేదు. ఆరు-ఏడు నెలల తర్వాత లీడర్‌గా మారింది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకే కదిలింది. అలుపెరుగని జీవన పోరాటంలో పట్టు వదలక ఒక్కో మెట్టు ఎక్కుతూ రూ.40 కోట్ల టర్నోవర్ కంపెనీ రూబన్స్ యాక్సెసరీస్ యజమానిగా అవతరించింది. అంతేనా స్నేహితుల ప్రోత్సాహంతో 2007లో, గ్లాడ్రాగ్స్ మిసెస్ ఇండియా అందాల పోటీలకు ఎంపికైంది. అలా ఫ్యాషన్ ,ఆభరణాల ప్రపంచానికి పరిచయం అయింది. మోడల్‌గా రాణించింది. ఈ ప్రయాణంలో వెయిట్రెస్‌గా పనిచేయడంతోపాటు ఎన్నో రకాల పనులు చేసింది. అలా ముంబైలోని టాటా కమ్యూనికేషన్స్‌లో టెలీమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం రావడం ఆమె జీవితంలో ఒక పెద్ద బ్రేక్ , అక్కడే ఎంబీఏ గ్రాడ్యుయేట్ అమిత్ కలాతో పరిచయం ప్రేమగా కారింది. 2004లో అమిత్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టింది. చిను కలలకు రెక్కలిచ్చిన భర్త భర్తగా,వ్యాపారవేత్తగా అమిత్ చినుకి కొండంతగా అండగా నిలిచాడు. నైపుణ్యాలను మెరుగుపరిచాడు. వ్యాపారవేత్త కావాలన్న ఆమె కలలకు రెక్కలిచ్చాడు. ఫలితంగా 2008లో కార్పోరేట్ మర్చండైజింగ్‌లో నైపుణ్య కంపెనీ ఫాంటే కార్పొరేట్ సొల్యూషన్స్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎదురైన ప్రతి సవాల్‌ను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చిన చిను కలా 2014లో బెంగళూరు మాల్లోని చిన్న కియోస్క్ నుండి రూబన్స్ యాక్సెసరీస్‌ను ప్రారంభించింది. 2021 నాటికి తన బ్రాండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లి పలువురి ప్రశంసలు అందుకుంది. తనలాంటి చాలామంది మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇపుటు కోట్ల టర్నోవర్‌తో సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్‌గా రాణిస్తోంది. భర్త, కుమార్తతో కలిసి బెంగళూరు, ఫీనిక్స్ మాల్ సమీపంలోని 5వేల చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్న చిను గరాజ్లో ఖరీదైన బీఎండబ్ల్యూ-5 కారు కొలువు దీరడంలో ఆశ్చర్యం ఏముంది? పోటీని ఎదుర్కోవాలంటే..రెండడుగులు ముందుండాలి! పోటీని ఓడించాలంటే.. ప్రత్యర్థులకంటే రెండు అడుగులు ముందుండటమే ఏకైక మార్గం అంటారు చిను. అందమైన డిజైన్లుతో ఏడాదికి కనీసం 10-12 కలెక్షన్లను తీసుకొస్తూ రూబన్స్ యాక్సెసరీస్ పాపులర్ అయిందని, మార్కెట్లో భారతీయ ,పాశ్చాత్య డిజైన్లను కలిగి ఉన్న ఏకైక బ్రాండ్ మాదే అంటారామె. ఇటీవీల షార్క్ ట్యాంక్ ఇండియా 2 తాజా ఎపిసోడ్లో, చిను కలా , అమిత్ కలా తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, ప్రయాణం, డిజైనర్ జ్యువెలరీ బ్రాండ్-రూబన్స్ గురించిన విశేషాలు పంచు కోవడం అందిరినీ ఆకర్షించింది. రోజుకు 15 గంటలుకు మించి పనిచేస్తానంటూ చిను. దేశీయ ఫ్యాషన్ జ్యువెలరీ మార్కెట్ వాటాలో(రూ. 21000 కోట్లు అంచనా) భవిష్యత్తులో 25 శాతం వాటాను సాధించాలనేదే చిను లక్క్ష్యం. -
పండగ ఆభరణాలు.. షుగర్ బాల్ జ్యువెలరీ గురించి తెలుసా?!
Sugarball Jewellery: జనవరి రాగానే చాలా మంది ఎదురుచూసే పండగ సంక్రాంతి. ఢిల్లీ వాసులు సక్రాత్ అని, గుజరాతీయులు ఉత్తరాయణం అని, తమిళనాడులో పొంగల్ అని, తెలుగు రాష్ట్రాలలో మకర సంక్రాంతి అనీ అంటారు. పేరు భిన్నంగా ఉండవచ్చు. కానీ వేడుకలో ఉత్సాహం ప్రతి చోటా అధికంగానే ఉంటుంది. అందుకు తగినట్టుగానే మగువలు అలంకరణలోనూ వైవిధ్యం చూపుతుంటారు. సంక్రాంతి అంటేనే ప్రకృతి పండగ.. పతంగుల సంబరం.. ఈ వేడుకకు మరింత వన్నె తెచ్చేవి సంప్రదాయ దుస్తులు మాత్రమే కాదు.. వాటిని మరింత మెరుపులీనేలా చేసే ఆభరణాలు కూడా! షుగర్ బాల్ జ్యువెలరీ సంక్రాంతికి సుగర్ బాల్స్‌తో చేసిన ఆభరణాలను ధరించడం కొన్ని చోట్ల ఆచారంగా ఉంది. పెళ్లయిన ఏడాదికి నవ వధువుకు చేసే ఈ అలంకరణ మరాఠాలోనూ ఇతర సంప్రదాయాల్లో కనిపిస్తుంది. గసగసాలు లేదా నువ్వులను పంచదార పాకంలో కలుపుతారు. వీటిని సన్నని మంటమీద మిశ్రమం బాగా చిక్కబడేవరకు కలుపుతూ ఉంటారు. ఈ మిశ్రమంతో పూసల్లాంటి చిన్న చిన్న బాల్స్‌ని తయారుచేస్తారు. ఈ చక్కెర బాల్స్‌ని అందమైన వివిధ రకాల ఆభరణాలుగా రూపుకడతారు. ఇవి వధువు భవిష్యత్తు జీవితాన్ని ఆనందకరంగా మార్చుతాయని వారి నమ్మకం. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా వీటి అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది. పువ్వుల క్రాంతి ఆభరణం అంటే బంగారమే కానక్కర్లేదు. భారతదేశ వివాహ వేడుకల్లో మెహిందీ సమయాల్లో ధరించే ప్రత్యేకమైన పుష్ప హారాలు సంక్రాంతినీ సందడిచేస్తున్నాయి. అమ్మాయిల అందాన్ని పువ్వులతో రెట్టింపు చేస్తున్నాయి. వీటిలో పొడవు హారాలు, చోకర్స్, జూకాలు, గాజులు పువ్వుల అల్లికతో అందంగా అమర్చుకోవచ్చు. ధరించే దుస్తులతోనూ వీటిని మ్యాచ్ చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ పువ్వుల ఆభరణాలు అందుబాటులోకి వచ్చాయి. గోటా పట్టీ ధరించే దుస్తుల రంగులతో ఫ్యాబ్రిక్, గోటాపట్టీ జ్యువెలరీ కూడా పోటీపడుతుంటాయి. దీంతో ఇవి పండగ కళను మరింత పెంచుతాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్‌తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement