-
జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్: తెలుగు, తమిళ సినీతారలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ నటులతో ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ... మ్యాచ్ నిర్వహణతో వచ్చిన ఆదాయాన్ని సీఎం సహాయ నిధికి అందిస్తామని వెల్లడించారు. సినీ నటుల క్రికెట్ మ్యాచ్ కు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. -
‘క్రికెట్ విత్ స్టార్స్’ తారల ఎంపిక
-
30న సినీ తారల ‘మేము సైతం’
తుపాన్ బాధితులకు బాసటగా సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో.. హైదరాబాద్, న్యూస్‌లైన్: హుద్ హుద్ తుపాన్ విలయంతో తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు తెలుగు సినిమా తారలంతా కలసి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం ఈ నెల 30న హైదరాబాద్‌లో ఆటపాటలతో సందడిగా సాగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో హోరెత్తనుంది. ఆ రోజు హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ‘క్రికెట్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో నటీనటులంతా కలసి క్రికెట్ ఆడనున్నారు. టోర్నమెంట్లో ఆడే నాలుగు జట్లకు నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘డ్రా’ పద్ధతి ద్వారా ఆయా టీముల్లో ఆడే తారలను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో నాగార్జున, ఎన్టీఆర్ రాలేకపోవడంతో... నాగార్జున టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని అఖిల్, ఎన్టీఆర్ టీమ్‌కి వైస్ కెప్టెన్ అయిన శ్రీకాంత్ వారి స్థానంలో హాజరయ్యారు. సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, డి.సురేశ్‌బాబు, ఎమ్మెల్ కుమార్ చౌదరి పాల్గొన్నారు. నాగార్జున టీమ్: అక్కినేని అఖిల్, కల్యాణ్‌రామ్, శర్వానంద్, నిఖిల్, నాగశౌర్య, సచిన్ జోషి, శివాజీరాజా, రాజీవ్ కనకాల, అల్లరి నరేశ్, సాయికుమార్. హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, మధుశాలిని, సోనియా, డిషా పాండేలు ఈ టీమ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. వెంకటేశ్ టీమ్: మంచు విష్ణు, మంచు మనోజ్, నితిన్, నారా రోహిత్, సుశాంత్, నవీన్‌చంద్ర, డా.రాజశేఖర్, దాసరి అరుణ్‌కుమార్, మాదాల రవి, ఆదర్శ్. హీరోయిన్లు సమంత, లక్ష్మీ మంచు, సంజన, ప్రియా బెనర్జీ, తేజస్వినిలు ఈ టీమ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. ఎన్టీఆర్ టీమ్: శ్రీకాంత్, గోపీచంద్, నాని, సందీప్‌కిషన్, సాయిధర్మతేజ, తనీష్, ప్రిన్స్, తరుణ్, సమీర్, రఘు, తమన్. కథానాయికలు అనుష్క, దీక్షాసేథ్, నిఖిత, శుభ్ర అయ్యప్ప, అస్మితాసూద్లు ఈ టీమ్‌కి గ్లామర్ తేనున్నారు. చరణ్ టీమ్: రవితేజ, సుధీర్‌బాబు, సుమంత్, తారకరత్న, వరుణ్‌సందేశ్, వడ్డే నవీన్, ఖయ్యూం, అజయ్. కథానాయికలు కాజల్ అగర్వాల్, చార్మి, అర్చన, పూనమ్‌కౌర్, రీతూ వర్మలు ఈ టీమ్‌లో అలరించనున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement