-
తెనాలిలోనే సినిమా పేర్ల రిజిస్ట్రేషన్
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని సీమాంధ్ర ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి లభించింది. స్థానిక చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కల్యాణమండపంలో శుక్రవారం సీమాంధ్ర ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా వివరాలను వెల్లడించారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ ఆమోదంతో సినిమాలకు టైటిల్స్, బ్యానర్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్సులు, లాబ్ లెటర్లు, డ్యూరేషన్ సర్టిఫికెట్లను జారీ చేసే అవకాశం తమ సంస్థకు లభించిందని చెప్పారు. తాము ఆమోదించిన టైటిల్స్‌కు కేంద్ర సెన్సార్ కార్యాలయం అనుమతిని ఇస్తుందన్నారు. అక్టోబరు మొదటి వారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు దిలీప్‌రాజా వెల్లడించారు. నిర్మాత చదలవాడ హరిబాబు, సినీ హీరోయిన్ మౌనికరెడ్డి, మిలటరీ ప్రసాద్, బి.జయకుమార్ ఉన్నారు. చదవండి: పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. -
ట్రెండ్‌ని టైటిల్ చేసుకుంటున్నారు
కొత్త ట్రెండ్, హాట్ టాపిక్స్‌ను క్యాచ్ చేసి సినిమా టైటిల్స్‌గా ఫిక్స్ చేస్తుంటారు. తాజాగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం సంగతి తెలిసిందే. ఈ హీట్‌ను సినిమా టైటిల్స్ రూపంలో వాడుకోవాలనుకుంటున్నారు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఆల్రెడీ ‘పుల్వామా ఎటాక్, సర్జికల్ స్ట్రైయిక్ 2.0, అభినందన్, హిందుస్తాన్ హమారా హై’ అనే టైటిల్స్‌ను కూడా రిజిస్టర్ చేశారట. అంతే కాకుండా ప్రస్తుతం బోర్డర్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వెబ్‌సిరీస్ ఐడియాలు కూడా రెడీ చేస్తున్నారట. మరి ఈ టైటిల్స్, ఐడియాలన్నీ సినిమా నిర్మాణం వరకూ వెళ్తాయా? వేచి చూడాలి. -
టైటిలాభరణం
కొత్త సినిమా గురూ! ‘శంకరాభరణం’ కెమేరా- సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఛోటా కె. ప్రసాద్, నిర్మాత - ఎం.వి.వి. సత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ - కోన వెంకట్, దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్, శంకరాభరణం. పేరు వినగానే ఆణిముత్యం లాంటి సినిమా గుర్తుకొస్తుంది. తెలుగువాణ్ణి తలెత్తుకు తిరిగేలా చేసిన ఆ ఫిల్మ్ టైటిల్‌తో మరో సినిమా చేయడం సాహసం. పెపైచ్చు, ఆ టైటిల్‌తో క్రైమ్ కామెడీ తీయడం మరీ సాహసం. కానీ, ‘సాహసం శాయరా డింభకా! విజయం వరిస్తుంది’ అన్నది నమ్మి, ఆ పనికే దిగారు ఇప్పుడీ కొత్త చిత్ర దర్శక, నిర్మాతలు. అలా వచ్చింది కోన వెంకట్ అన్నీ తానై తీసి, తీయించిన కొత్త ‘శంకరాభరణం’. టైటిల్ క్యూరియాసిటీ పక్కనపెట్టి, ‘దొరకునా ఇటువంటి సినిమా’ అని పాడుకుంటూ కథలోకొస్తే - రఘు (సుమన్) అమెరికాలో కోటీశ్వరుడు. అతని భార్య రజ్జూ దేవి (సితార). ఓ కూతురు, ఓ కొడుకు గౌతమ్ (నిఖిల్). కష్టపడకుండా, కులాసా జీవితం గడిపే హీరో జీవితంలో ఒక పెద్ద కుదుపు. నమ్మినవాళ్ళు మోసం చేయడంతో ఆస్తులు పోయి, అర్జెంటుగా కోట్లు కట్టకపోతే కటకటాల వెనక్కి వెళ్ళే ముప్పులో పడతాడు హీరో తండ్రి. పాతికేళ్ళ క్రితం ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని, అమెరికా వచ్చేశాననీ, బీహార్‌లోని ‘శంకరాభరణం’ అనే ప్యాలెస్‌కు తానే వారసురాలిననీ, దాన్ని అమ్మి అప్పుల నుంచి బయటపడవచ్చనీ హీరో తల్లి చెబుతుంది. ఆ ప్యాలెస్ అమ్మి డబ్బు తేవడానికి అమెరికా నుంచి హీరో బీహార్ బయల్దేరతాడు. ఇక్కడ బీహార్‌లో విలువైన దేనినైనా కిడ్నాప్ చేసి, డబ్బులు గుంజడం బిజినెస్. రాష్ట్ర హోమ్ మంత్రి (‘మిర్చి’ సంపత్) కూడా ఆ కిడ్నాపింగ్ ముఠాల వెనుక మనిషే. బీహార్ వచ్చిన హీరో తమ ప్యాలెస్‌లో ఉంటున్న మామయ్య బద్రీనాథ్ (రావు రమేశ్)నీ, ఆయన బంధుగణాన్నీ మాయ చేసి, ప్యాలెస్ అమ్మేయడానికి ప్లాన్ చేస్తాడు. అమెరికా వెళ్ళాలని మోజు పడే మామయ్య చిన్న కూతురు హ్యాపీ (నందిత) హీరోను ప్రేమిస్తుంది. మరోపక్క అతనూ దగ్గరవుతాడు. ఈ అమెరికా ఎన్నారై దగ్గర బోలెడంత డబ్బుందని ఊరంతా భ్రమపడుతుంది. దాంతో, కిడ్నాపర్ భాయ్ సాబ్ (సంజయ్ మిశ్రా) హీరో, హీరోయిన్లను కిడ్నాప్ చేస్తాడు. తీరా తన దగ్గర డబ్బులే లేవని అసలు నిజం చెప్పి, హీరో తనను మరో కిడ్నాపర్‌కి కోట్లకు అమ్మించేలా చేస్తాడు. అలా ఒక కిడ్నాపర్ నుంచి మరో కిడ్నా పర్కు హీరో, హీరోయిన్లు ట్రాన్‌సఫరవుతుంటారు. ఈ కిడ్నాప్ డ్రామాల కథ ఎటు నుంచి ఎటు, ఎన్ని మలుపులు తిరిగిందన్నది మిగతా సినిమా. కథ కన్నా సీన్లు, క్యారెక్టర్లు సవాలక్ష ఉన్న ఈ సినిమాకు తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ, దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో తడబాటు తప్ప లేదనిపిస్తుంది. తెర నిండా కళకళలాడుతూ చాలా మంది ఆర్టిస్టులున్నారు. ఒకరి వెంట మరొకరుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. కానీ, మనసు కెక్కేలా వాళ్ళ నటనను చూపెట్టే సన్నివేశాలే వెతుక్కోవాలి. వెరైటీ స్క్రిప్ట్‌లతో ముందుకొస్తున్న హీరో నిఖిల్ ఈసారి అమెరికన్ ఇంగ్లీష్ యాసలో ఎన్నారైగా అలరించడానికి శాయశక్తులా యత్నించారు. అమెరికా మోజున్న హ్యాపీగా నందితది కాలక్షేపం క్యారెక్టర్. కిడ్నాపింగ్ విలన్లుగా ఒకరికి ముగ్గురున్నారు. ఎవరికివారు ఫరవాలేదనిపిస్తారు. కానీ, ఎవరూ ప్రధాన విలన్ కాకపోవడమే చిక్కు. లేడీ కిడ్నాపింగ్ లీడర్ మున్నీ దీదీగా అంజలిది సినిమా చివర కాసేపు వచ్చే స్పెషల్ అప్పీయరెన్స్. నాలుగు సీన్లు, కాసిన్ని డైలాగులు, ఒక స్పెషల్ సాంగ్ ఉన్నాయి. సినిమా నిండా చాలామంది కమెడియన్లున్నారు. కొన్నిచోట్ల నవ్విస్తారు. ఎక్కువ మార్కులొచ్చేది థర్టీ ఇయర్స్ పృథ్వికి, అతని ఎస్సై పాత్ర ‘పర్సంటేజ్’ పరమేశ్వర్‌కి! అయితే, లేడీ కిడ్నాపింగ్ ముఠా స్త్రీలంతా కలసి అతడిపై పడి, గదిలోకి తీసుకెళ్ళడం లాంటివి కామెడీ అనుకోలేం. ‘లాజిక్‌లు వెతక్కండి... మ్యాజిక్ చూడండి’ అని స్టాట్యూటరీ సిల్వర్‌స్క్రీన్ వార్నింగ్‌తో మొద లయ్యే సినిమా ఇది. కాబట్టి, బీహార్‌లో మనుషులు అచ్చ తెలుగు యాసల్లో ఎలా మాట్లా డుతున్నారు లాంటి సందేహాలు శుద్ధ వేస్ట్. ముందే చెప్పేశారు కాబట్టి, ఇక సినిమా అంతా మ్యాజిక్ చూడడం కోసం కళ్ళలో వత్తులు వేసుకోవాల్సి ఉంటుంది! సీనియర్ కో-డెరైక్టర్ ఉదయ్ నందనవనమ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. కానీ, దర్శకత్వ పర్యవేక్షణంతా కోన వెంకట్‌దే. ఎవరి భాగమెంతో తెరపై చూసి చెప్పడం కష్టమే. కథనంలో బిగింపు, ఎడిటింగ్‌లో తెగింపు అవసరమని గుర్తొచ్చే ఈ సినిమాలో అందమైన లొకేషన్లలో కెమేరా పనితనం భేష్. ప్రవీణ్ లక్కరాజు బాణీల్లో కొన్ని బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరే వాద్యఘోష పెంచారు. వెరసి, ఫస్టాఫ్‌లో కథ ముందుకు జరగకపోయినా డైలాగ్ మీద డైలాగ్ పడిపోయే ఆర్టిస్టుల హడావిడి, రీరికార్డింగ్ హంగామాతో ఉక్కిరిబిక్కిరవుతాం. సెకండాఫ్‌లో పృథ్వి ఎంటరయ్యాక జనం వినోది స్తారు. డబ్బు కన్నా అనుబంధాలు ఎక్కువని చెప్ప డానికీ, హీరోకూ- ఫ్యామిలీకీ మధ్య ఎమోషనల్ స్ట్రగుల్‌కీ తోడ్పడే సీన్లు ఇంకా అల్లుకోవాల్సింది. ముగింపు దగ్గరకొస్తుంటే వేగం పెరిగే ఈ ఫిల్మ్‌లో ఆఖరి టైటిల్ కార్డు - ‘వేర్లు బలంగా ఉంటేనే చెట్టు నిలుస్తుంది. బంధాలు బలంగా ఉంటేనే కుటుంబం నిలుస్తుంది’. అలాగే, స్క్రిప్టు బలంగా ఉంటేనే సినిమా నిలుస్తుంది. మరి, ఆ బలం, బాక్సా ఫీస్ దగ్గర అలా నిలిచే సత్తా ఈ ‘శంకరాభరణం’కి ఉందా? అది ప్రేక్షకదేవుళ్ళు చెప్పాల్సిన తీర్పు. - రెంటాల జయదేవ * హిందీ హిట్ ‘ఫస్ గయేరే ఒబామా’ హక్కులు కొని, దాన్ని తెలుగులోకి మలుచుకున్నారు కోన వెంకట్. ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవాస భారతీయుడు. * బీహార్ నేపథ్యంలో జరిగే ఈ కిడ్నాప్ కథ షూటింగ్ ప్రధానంగా మహారాష్ట్ర, పరిసరాల్లో చేశారు. ఇటీవల రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చిన కొద్ది సినిమాల్లో ఇది ఒకటి. -
టెంపర్ చూపిస్తారట!
పూరి జగన్నాథ్ సినిమా అంటే.. టైటిల్ నుంచే చర్చ మొదలు. హీరో స్వభావాన్ని బట్టి ఆయన పెట్టే టైటిల్ అంటే... యువతలో పిచ్చ క్రేజ్. ‘ఇడియట్’ నుంచి అలా అలోచించడం మొదలుపెట్టారాయన. పోకిరి, దేశముదురు, చిరుత, నేనింతే... ఇవన్నీ ఆ కోవకు చెందిన టైటిల్సే. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో టైటిల్ చేరబోతోందని సమాచారం. అదే ‘టెంపర్’. ఈ టైటిల్‌ని బట్టి హీరో పాత్రని పూరీ ఎలా డిజైన్ చేసి ఉంటారో ఊహించేసుకోవచ్చు. పైగా ఇందులో హీరో ఎన్టీఆర్. ఇక చెప్పేదేముంది? మాస్‌కి పండగే. బండ్ల గణేశ్ ఈ చిత్రానికి నిర్మాత. కుమ్మేస్తా, రుబాబు టైటిల్స్ ఈ సినిమాకు ప్రచారంలో ఉన్నాయి. అయితే, పూరీ మస్తిష్కంలో మాత్రం ఈ టైటిల్స్ లేవని పూరీ ఆంతరంగికుల సమాచారం. ఈ సినిమాకు పూరీ అనుకున్న టైటిల్స్ నేనో రకం, టెంపర్. ఈ రెండు పేర్లలో ‘టెంపర్’ వైపే పూరీ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అంటే... త్వరలోనే పూరీ-ఎన్టీఆర్ కలిసి తెరపై తమ టెంపర్‌ని చూపించనున్నారన్నమాట. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ అధికారిగా నటించనున్నారట. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. జనవరి 9న చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో పూరీ, బండ్ల గణేశ్ ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement