-
బ్యాట్స్‌మెన్ అదుర్స్
అడిలైడ్: టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోను ప్రదర్శించింది. మొదటి రోజు బౌలర్లు సత్తా చాటితే... రెండో రోజు ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. గ్లిడెరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... రెండో రోజు మంగళవారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (114 బంతుల్లో 60; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. విజయ్ (82 బంతుల్లో 51 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు), పుజారా (80 బంతుల్లో 55 రిటైర్డ్ అవుట్; 11 ఫోర్లు), సాహా (75 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (54 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రైనా (49 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 55/1తో ఆట కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. విజయ్, పుజారా రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అర్ధసెంచరీలు పూర్తయిన తర్వాత ఇద్దరు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. తర్వాత కోహ్లి ఆకట్టుకున్నా... రహానే (1), రోహిత్ (23) విఫలమయ్యారు. లంచ్ తర్వాత కెప్టెన్‌తో జత కలిసిన రైనా వేగంగా ఆడాడు. స్లో బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆరో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రైనా అవుటయ్యాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో కోహ్లి, అశ్విన్ (6) అవుటైనా.. చివర్లో సాహా, కరణ్‌లు వీరవిహారం చేశారు. సీఏ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించారు. లాలర్, షార్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. శుక్రవారం నుంచి జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్... సీఏ ఇన్విటేషన్ ఎలెవన్ జట్టుతో తలపడుతుంది. స్కోరు వివరాలు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 219 భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ రిటైర్డ్ అవుట్ 51; ధావన్ (సి) టర్నర్ (బి) లాలర్ 10; పుజారా రిటైర్డ్ అవుట్ 55; కోహ్లి (సి) గ్రిమ్‌వేడ్ (బి) షార్ట్ 60; రహానే (సి) కార్టర్స్ (బి) గ్రిమ్‌వేడ్ 1; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) లాలర్ 23; రైనా (సి) కార్టర్స్ (బి) ప్యాటిసన్ 44; సాహా నాటౌట్ 56; అశ్విన్ (సి) అండ్ (బి) షార్ట్ 6; కరణ్ నాటౌట్ 52; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (91 ఓవర్లలో 8 వికెట్లకు) 363. వికెట్ల పతనం: 1-21; 2-106; 3-120; 4-131; 5-178; 6-233; 7-267; 8-285 బౌలింగ్: లాలర్ 20-2-55-2; మూడీ 17-2-74-0; గ్రెగరీ 6-1-26-0; కాన్వే 10-1-37-0; గ్రిమ్‌వేడ్ 17-3-61-1; ప్యాటిసన్ 7-0-24-1; షార్ట్ 10-1-60-2; టర్నర్ 4-1-24-0. -
'ప్రాక్టీస్' లో బౌలర్లు భేష్
అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనను భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ మొదటి రోజు మన ఆటగాళ్లు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టీమిండియా బౌలర్లు రాణించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 71.5 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ ఆరోన్ 3 వికెట్లు పడగొట్టగా... కరణ్‌శర్మ, భువనేశ్వర్, షమీ తలా 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ధావన్ (10) పెవిలియన్ చేరగా...విజయ్ (32 బ్యాటింగ్), పుజారా (13 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అందరికీ వికెట్ టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ తనదైన శైలిలో తొలి ఓవర్లోనే షార్ట్ (0)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. అనంతరం కార్టర్స్ (151 బంతుల్లో 58; 6 ఫోర్లు), టర్నర్ (29) రెండో వికెట్‌కు 51 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ దశలో ఆరోన్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అయితే కెల్విన్ స్మిత్ (40)తో కలిసి కార్టర్స్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. లోయర్ ఆర్డర్లో హ్యరీ నీల్సన్ (43 నాటౌట్) రాణించడంతో సీఏ స్కోరు 200 పరుగులు దాటింది. భారత బౌలర్లందరూ కనీసం ఒక వికెట్ పడగొట్టగా...వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 5 క్యాచ్‌లు పట్టి, ఒక స్టంపింగ్ చేయడం విశేషం. అనంతరం భారత ఇన్నింగ్స్‌లో ధావన్ త్వరగానే అవుటైనా... విజయ్, పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
కూటముల కురుక్షేత్రం
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement