-
మీ ప్రతిభాశక్తి ఆదర్శనీయం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అనుక్షణం ఆచరిస్తూ అత్యున్నత శిఖరాలకు ఎదిగిన మిమ్మల్ని సదా అనుసరిస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాని మోదీ శ్లాఘించారు. బుధవారం ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ‘జ్ఞానగని అయిన మీ ప్రతిభాశక్తి మొదట్నుంచీ నన్ను అమితంగా ఆకర్షిస్తోంది. దశాబ్దాల మీ అపార అనుభవం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. చురకత్తుల్లాంటి మీ ఏకవాక్య పలుకులు నన్ను ఎన్నోసార్లు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. భావ వ్యక్తీకరణ అనేది మీలోని అత్యంత ప్రధానమైన అస్త్రం. నెల్లూరు నుంచి న్యూఢిల్లీదాకా సాగిన మీ అసాధారణ ప్రయాణ ఘట్టం అద్భుతం, సదా ఆదర్శనీయం వెంకయ్య గారూ’ అంటూ వెంకయ్యపై మోదీ పొగడ్తల వాన కురిపించారు. ‘సవాళ్లు ఎదురైన ప్రతీసారీ మరింత రెట్టించిన ధైర్యం, ఉత్సాహం, బాధ్యతలతో ముందుకు సాగారు. రాజ్యసభ చైర్మన్‌గా పార్లమెంటరీ క్రమశిక్షణ, సంప్రదాయాల పరిరక్షణలో అందరికీ చుక్కానిగా మారారు. రాజ్యసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించినపుడు పార్లమెంట్ గౌరవాన్ని తగ్గి్గస్తున్నారంటూ మీరు పడే బాధ ప్రతిసారీ మీ స్వరంలో ప్రతిధ్వనించింది’ అని అన్నారు. బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిప్రదాత ‘బీజేపీతో దశాబ్దాల మీ అనుబంధం చిరస్మరణీయం. వ్యవస్థీకృత అంశాల్లో మీ అంకితభావం ప్రతీ పార్టీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. తొలినాళ్లలో పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అంతగా విస్తరించని కాలంలోనే బీజేపీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరారు. అకుంఠిత దీక్షతో పనిచేశారు. పార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి పార్టీని వ్యవస్థాగతంగా పటిష్టంచేశారు. ప్రస్తుతం అవి ప్రజాసేవా కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. పార్టీలో దశాబ్దాల అనుబంధంలో మీ నుంచి నేను నేరుగా ఎన్నో అంశాల్లో సలహాలు, సూచనలు పొంది లబ్ధిపొందాను. చిన్న మాటల్లోనే పెద్ద భావాలను పలికించగల భావ వ్యక్తీకరణ మీ సొత్తు. ఈ విషయంలో మీరు వినోబా భావేను స్మరణకు తెస్తారు’ అని మోదీ అన్నారు. -
మాజీ సర్పంచ్ అరెస్టు
కొత్తచెరువు (పుట్టపర్తి) : అక్రమంగా విద్యుత్ వాడుకున్నారని ఏడాది కిందట నమోదైన కేసులో నిందితుడైన కొత్తచెరువు మాజీ సర్పంచి హరినాథ్చౌదరిని జిల్లా యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బుక్కపట్నం రహదారిలో ఉన్న వాటర్‌ప్లాంట్‌కు ఆయన అక్రమ విద్యుత్ వాడుతున్నారని అప్పట్లో విద్యుత్ అధికారులు రూ.3 లక్షలు పైబడి జరిమానా విధించారు. అప్పటి నుంచి జరిమానా చెల్లించకపోవడంతో వారు ఆయనకు నోటీసులు జారీచేస్తూ వచ్చారు. చివరకు అరెస్టు వారంట్ జారీ కావడంతో శుక్రవారం జిల్లా యాంటీ పవర్ టెప్తు స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ విషయంపై ట్రాన్స్‌కో ఏఈ శీననాయక్ను వివరణ కోరగా విద్యుత్ చౌర్యం ఘటనలో జరిమానా చెల్లించకపోతే అరెస్టు తప్పదన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement