-
'నాతో సినిమా చేస్తే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తాడు'
విలక్షణ పాత్రలతో బాలీవుడ్ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా హీరోగా కూడా అలరిస్తున్న ఈ గ్రేట్ యాక్టర్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ లీడ్ రోల్లో నటించిన ఫ్రీకీ అలీ ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగం నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తనతో పాటు హీరోయిన్గా నటించిన భామలకు నెక్ట్స్ సినిమానే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తున్నాడన్నాడు నవాజ్. అందుకు ఉదాహరణలు కూడా చెప్పాడు. తన సరసన మాంజీ సినిమాలో హీరోయిన్గా నటించిన రాధికా ఆప్టే వెంటనే రజనీ కాంత్ కబాలీలో నటించింది. ప్రస్తుతం తన ఫ్రీకీ అలీలో హీరోయిన్గా నటించిన అమీజాక్సన్ రజనీ నెక్ట్స్ సినిమా రోబో సీక్వల్లో హీరోయిన్గా నటిస్తోంది అంటూ అదంరికీ షాక్ ఇచ్చాడు. తన సినిమా ప్రమోషన్ కోసం సరదాగా నవాజుద్దీన్ చేసిన ఈ కామెంట్స్‌కు హాట్ బ్యూటి అమీ జాక్సన్ కూడా వంత పాడింది. -
చార్మినార్ వద్ద చెడ్డీలు అమ్మిన నటుడు!
సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసినవారందరికీ నవాజుద్ధీన్ సిద్ధిఖీ సుపరిచితుడే. ఆ సినిమాలో అతడు చేసిన 'రిపోర్టర్' పాత్ర అంత తేలికగా మరచిపోయేది కాదు. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తలాష్, కిక్ లాంటి సినిమాల్లో కూడా తనదైన నటనతో మెప్పించాడు సిద్ధిఖీ. అయితే తాజాగా అతడు చార్మినార్ సెంటర్లో చెడ్డీలు అమ్ముతూ కెమెరా కంటపడ్డాడు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.. తన సినిమా ప్రమోషన్ కోసం పడిన ప్రయాసే అది. బాలీవుడ్ తీరే వేరు. సినిమాను ప్రమోట్ చేయడానికి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు నటీనటులు. అవసరమైతే ఉన్నట్టుండి జనాల మధ్యలో ప్రత్యక్షమవుతారు కూడా. అచ్చంగా అలానే చేశాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫ్రీకీ అలీ' సినిమాలో సిద్ధిఖీ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో తన పాత్ర మాదిరిగా రోడ్డెక్కి చెడ్డీలు అమ్మాడు. చెడ్డీల వ్యాపారం సాగినంతసేపు ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఇక 'ఫ్రీకీ అలీ' కథ విషయానికొస్తే.. రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద చెడ్డీలు అమ్ముకుంటూ ఉంటాడు అలీ అనే కుర్రాడు. పార్ట్ టైం జాబ్‌గా ఓ రౌడీ దగ్గర పని చేస్తూ అతడితో కలిసి మామూళ్ల వసూళ్లకు వెళ్తుంటాడు. అలానే ఓ వ్యక్తి వద్ద వసూళ్ల కోసం గోల్ఫ్ కోర్టుకి వెళతాడు. అక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన అతనిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. అతనికో ఆశయాన్ని తెచ్చిపెడుతుంది. పేవ్మెంట్ చెడ్డీల వ్యాపారి.. ఆ తర్వాత పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడు ఎలా అయ్యాడనేదే కథ. సెప్టెంబరు 9 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ కోసం గురువారం హైదరాబాద్‌కు విచ్చేసింది చిత్ర యూనిట్. గోల్ఫ్ క్రీడాకారుడు కావడానికి అలీ పడిన పాట్లు హాస్యంతో కూడుకున్నవై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతుంది మూవీ టీం. అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. -
నన్నే వద్దంటారా.. అయితే ఓకే!
చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు, మీ సినిమాలో నటిస్తానని సల్మాన్‌ఖాన్ స్వయంగా బంపర్ ఆఫర్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. సల్మాన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అంతేకానీ, వద్దంటారా? చెప్పండి. సల్లూ భాయ్ తమ్ముడు సోహైల్ ఖాన్ మాత్రం అన్నయ్య ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారు. నవాజుద్ధీన్ సిద్ధిఖీ హీరోగా సోహైల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ఫ్రీకీ అలీ’. ఈ స్క్రిప్ట్ సల్మాన్‌కి పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో చిన్న పాత్రలో అయినా నటిస్తానని అడిగితే.. ‘‘నీ లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్‌కి సరిపడే క్యారెక్టర్ మా సినిమాలో లేదు. ఒకవేళ నిన్ను తీసుకుంటే స్టోరీ డిస్ట్రబ్ అవుతుంది. నువ్వు మాకొద్దు’’ అని అన్నయ్యతో సోహైల్ చెప్పారట. క్రేజ్ కంటే కథకు ప్రాముఖ్యం ఇస్తున్న తమ్ముణ్ణి సల్మాన్ అభినందించి, నన్నే వద్దంటారా.. అయితే ఓకే అని సరదాగా అన్నారట. అమీ జాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో సల్మాన్ ఇంకో తమ్ముడు అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. -
'అవి రెండూ జరగలేదు'
బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్.. పెళ్లి గురించి ఓపెన్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మీడియా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తనదైన స్టైల్లో సెటైర్లు వేసే సల్మాన్.. ఈసారి కాస్త ఘాటైన సమాధానం ఇచ్చాడు. సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న 'ఫ్రీకీ అలీ' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సల్మాన్‌కు.. మీడియా నుంచి పెళ్లి ప్రశ్నలు మొదలయ్యాయి. సల్మాన్ స్పందిస్తూ.. వివాహం, శృంగారం..ఆ రెండూ నా జీవితంలో జరుగలేదంటూ సెలవిచ్చాడు. సల్మాన్ సమాధానం విని చుట్టూ నవ్వులు విరిశాయి. 50 ఏళ్ల ఈ బ్యాచిలర్ ఇదివరకు ఓసారి 'నేను వర్జిన్' అనే స్టేట్మెంట్తో వార్తల్లో నిలిచాడు. మరోసారి ఓపెన్‌గా మాట్లాడి 'టాక్ ఆఫ్ ది డే' అయ్యాడు. గత పదేళ్లుగా సల్మాన్ పెళ్లి బాలీవుడ్లో ఆసక్తికర వార్తగా కొనసాగుతుండడం విశేషం. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'ఫ్రీకీ అలీ' చిత్రం సెప్టెంబరు 9న విడుదల కానుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అతి సాధారణ కుటుంబానికి చెందిన అలీ తన ప్రేమను గెలుచుకోవడం కోసం గోల్ఫ్ ఛాంపియన్ కావడమే ఈ చిత్ర కథ. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్ ఖాన్ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement