-
5 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు చార్జ్!
వాషింగ్టన్: భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉద్దేశించిన ఒక అధునాతన సాంకేతికత సాయంతో విద్యుత్ కారును కేవలం ఐదు నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చని నాసా ఆర్థికసాయంతో పరిశోధన చేసిన ఒక అధ్యయన బృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోడ్డు వెంట ఉన్న చార్జింగ్ స్టేషన్లో దాదాపు 20 నిమిషాలు, ఇళ్లలో అయితే గంటల తరబడి విద్యుత్ కార్లను చార్జ్ చేయాల్సి వస్తోంది. దాంతో ఇప్పటికీ భారత్‌లో కొందరు విద్యుత్ వాహనాలకు యజమానులుగా మారేందుకు సంసిద్ధంగా లేరు. ప్రస్తుతమున్న అధునాతన చార్జర్లు 520 ఆంపియర్ల కరెంట్‌నే బదిలీచేయగలవు. వినియోగదారులకు ఎక్కువగా అందుబాటులో ఉన్న చార్జర్లు అయితే కేవలం 150 ఆంపియర్లలోపు విద్యుత్‌నే పంపిణీచేయగలవు. అయితే, నూతన ఫ్లో బాయిలింగ్, కండన్సేషన్ ఎక్స్పరిమెంట్తో ఇది సాధ్యమేనని అమెరికాలోని పురŠూడ్య విశ్వవిద్యాయంలోని పరిశోధకులు చెప్పారు. అయితే, 1,400 ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సామర్థ్యముండే చార్జింగ్ స్టేషన్లలో ఇది సాధ్యమేనని నాసా పేర్కొంది. ఇంతటి ఎక్కువ ఆంపియర్ల విద్యుత్ ప్రసరణ సమయంలో వేడి బాగా ఉద్భవిస్తుంది. దీనికి చెక్‌పెట్టేందుకు ద్రవ కూలెంట్‌ను ముందుగా చార్జింగ్ కేబుల్ గుండా పంపించారు. ఇది కరెంట్‌ను మోసుకెళ్లే కండక్టర్లో జనించే వేడిని లాగేస్తుంది. దీంతో 4.6 రెట్లు వేగంగా చార్జింగ్ చేయడం సాధ్యమైంది. కరెంట్ ప్రసరించేటపుడు వచ్చే 24.22 కిలోవాట్ల వేడిని ఈ విధానం ద్వారా తొలగించగలిగారు. ‘కొత్త పద్ధతి కారణంగా చార్జింగ్ సమయం బాగా తగ్గుతుంది. ఎక్కువ సేపు చార్జింగ్ జంజాటం లేదుకాబట్టి ఎక్కువ మంది ఎలక్టిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతారు’ అని పరిశోధకులు వ్యాఖ్యానించారు. భారరహిత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ రెండు ఫేజ్‌ల ఫ్లూయిడ్ ఫ్లో, వేడి బదిలీ ప్రక్రియను పరీక్షించనున్నారు. -
నిమిషంలోనే ఫుల్ చార్జ్!
అల్యూమినియం రేకు కాదిది. మొబైల్ ఫోన్ బ్యాటరీ! ప్రపంచంలోనే తొలి అల్యూమినియం అయాన్ బ్యాటరీ అయిన ఇది జస్ట్.. అరవై సెకన్లలోనే రీచార్జ్ అయిపోతుంది! ధర కూడా చవకే. దీనిని వంచొచ్చు. మడత కూడా పెట్టుకోవచ్చు! మొబైల్ఫోన్లను చిటికెలో ఫుల్ చార్జ్ చేసే ఈ సరికొత్త బ్యాటరీని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. బ్యాటరీ పేలి గాయాలు కావడం, అరుదుగా ప్రాణాలు పోవడమూ మనం చూస్తున్నాం. కానీ ఈ బ్యాటరీతో ఆ ప్రమాదం కూడా లేదు. ఎందుకంటే ఇది కాలదు. మంటల్లో వేసినా పేలదు! ఇంతకుముందు అల్యూమినియం అయాన్ బ్యాటరీ తయారీ కోసం చాలా మంది ప్రయత్నించినా, క్యాథోడ్ ఎలక్ట్రోడ్ తయారీలో విఫలమయ్యారు. కానీ స్టాన్ఫోర్డ్ శాస్త్రవేత్తలు దీనికి ఆనోడ్‌గా అల్యూమినియంను, క్యాథోడ్‌గా గ్రాఫైట్‌ను, ఎలక్ట్రోలైట్‌గా అయానిక్ లిక్విడ్‌ను ఉపయోగించి విజయం సాధించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement