-
సినిమా రివ్యూ - గడ్డం గ్యాంగ్
చిత్రం - గడ్డం గ్యాంగ్, తారాగణం - రాజశేఖర్, షీనా, అచ్చు, ‘సత్యం’ రాజేశ్, నాగబాబు, నరేశ్, సీత, నోయల్, పాటలు - రామజోగయ్యశాస్త్రి, బాలాదిత్య, సంగీతం - అచ్చు, సమర్పణ - జీవితా రాజశేఖర్, నిర్మాతలు - శివాని, శివాత్మిక, దర్శకత్వం -సంతోష్ పీటర్ జయకుమార్ .............................. కొన్ని సినిమాలకు కొన్ని విషయాలు కలిసొస్తుంటాయి. రిలీజ్ టైమ్ మొదలు ఆ కథకు లభించిన పాత్రధారులు, వాళ్ళకున్న (లేదా లేని) ఇమేజ్‌లు, ఆ సినిమా తీసిన భాషా సమాజంలోని పరిస్థితులు - ఇలా సవాలక్ష కారణాలు ఒక సినిమా విజయవంతం కావడానికి! కానీ, అవేవీ గుర్తించకుండా ఒక భాషలో హిట్టయిన కథ కదా అని మరోభాషకు యథాతథంగా దించేస్తే... అప్పుడు ఆ కథ, రీమేక్ సినిమా పరిస్థితి నీళ్ళలో నుంచి బయటపడ్డ చేపపిల్లే! తమిళంలో గత ఏడాది ఘనవిజయం సాధించిన ‘సూదుకవ్వం’ అనే చిన్న బడ్జెట్ ప్రయత్నాన్ని ఇప్పుడు తెలుగులో హీరో రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’గా అందించడం చూశాక, ఈ ఆలోచనలన్నీ మరోసారి మదిలో మెదిలితే తప్పు లేదు. కథేమిటంటే... హైదరాబాద్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ కమ్ రూమ్మేట్లు (‘సత్యం’ రాజేశ్, నటుడి అవతారం కూడా ఎత్తిన సంగీత దర్శకుడు అచ్చు). సొంత ఊళ్ళో సినీతార అనుష్కకు గుడి కట్టి, అందరితో తిట్లు తిని హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన మిత్రుడు సురేశ్ (అచ్చు) దగ్గరకు వచ్చేస్తాడు మరో మిత్రుడు. ఉద్యోగాలు పోగొట్టుకున్న ఇద్దరు, ఈ మూడోవాడితో కలసి తిరుగుతున్న టైమ్‌లో అనుకోకుండా వాళ్ళకు ‘గడ్డం’ దాస్ (రాజశేఖర్) తారసపడతాడు. భౌతికంగా లేని మరదలు షాలూ (షీనా)ను పక్కనే ఉందని ఊహించుకుంటూ గడిపే దాస్ చిన్న చిన్న కిడ్నాప్‌లు చేసి, డబ్బులు వసూలు చేసుకోవడం ద్వారా గడిపేస్తుంటాడు. అలా అందరూ ఒక గ్యాంగ్‌గా తయారవుతారు. ఆ సమయంలో పారిశ్రామికవేత్త (కాదంబరి కిరణ్‌కుమార్) దగ్గర నుంచి వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది. నిజాయతీపరుడైన ఆర్థిక మంత్రి ధర్మరాజు (నరేశ్) కుమారుడు సత్య హరిశ్చంద్ర (ర్యాప్ గాయకుడు నోయల్)ను కిడ్నాప్ చేస్తే 2 కోట్లిస్తామని! ఆ ప్లాన్‌కు ఒప్పుకొన్న గ్యాంగ్ మంత్రి దగ్గర నుంచి 2 కోట్లు వసూలు చేస్తుంది. తీరా ఆ డబ్బు అందుకున్నాక మంత్రి గారి కొడుకే డబ్బు మీద ఆశతో ఆ గ్యాంగ్‌ను మోసగించి, డబ్బుతో పారిపోతాడు. అక్కడకు చిత్ర ప్రథమార్ధం అయిపోతుంది. ఆ తరువాత గడ్డం గ్యాంగ్ ఎదుర్కొన్న సమస్యలేమిటి, ఈ కిడ్నాప్ కథలోని లోతులు తెలుసుకోవడానికి రాజకీయ - పోలీసు పెద్దలు ప్రత్యేకించి దింపిన గుంతకల్ ఎస్.ఐ. గబ్బర్ సింగ్ (తమిళ మాతృకలో చేసిన తమిళ నటుడే ఇందులోనూ చేశాడు) ఏం చేశాడు, అసలు గడ్డం దాస్ ఈ కిడ్నాప్‌లన్నీ దేని కోసం చేస్తున్నాడు లాంటి ప్రశ్నలన్నీ ద్వితీయార్ధం చివరి దాకా కూర్చుంటే తీరుతాయి. ఎలా చేశారంటే... హీరో రాజశేఖర్‌కు ఇది చాలా విభిన్నమైన పాత్ర. దానికి తగ్గట్లుగా ఆయన తన ఇమేజ్‌నూ, స్టైల్‌నూ మార్చుకొని మరీ సినిమా చేశారు. కానీ, అసలు స్క్రిప్టులోనే ఆ పాత్ర చిత్రణ, దాని స్వరూప స్వభావాలేవీ నిర్దుష్టంగా లేకపోవడంతో, ఇంత శ్రమపడినా ఆశించిన ఫలితం దక్కడం కష్టమే! అయినా ఆయన కష్టాన్ని గుర్తించక తప్పదు. మామూలు హీరో ఇమేజ్‌కు భిన్నంగా ఈ ప్రయత్నం చేసిన రాజశేఖర్ తన కెరీర్‌పై పునరాలోచించుకోవాలి. రాగల రోజుల్లో పూర్తిస్థాయి క్యారెక్టర్ యాక్టర్‌గా ఆయన మారితే, అటు ఇండస్ట్రీకీ, ఇటు ఎదిగొస్తున్న ఇద్దరమ్మాయిల (శివాని, శివాత్మిక) తండ్రిగా ఆయనకూ మరింత ఉపయోగం ఉంటుంది. షీనా చేసిన పాత్ర నిడివి చిన్నది. ఉన్నంతలో నరేశ్ ఫరవాలేదనిపిస్తారు. ఎస్.ఐ. గబ్బర్ సింగ్‌గా నటించిన తమిళ నటుడు మాతృకలో లాగానే, రీమేక్‌లోనూ నోరు విప్పకుండా, కనీసం ఒక్కటైనా డైలాగ్ లేకుండానే సీరియస్‌గా సాగే పాత్రను పండించారు. ముమైత్ ఖాన్ ఒక ఐటమ్ సాంగ్‌లో నర్తిస్తుంది. అచ్చు సంగీతం అక్కడక్కడి మెరుపులతో సరిపెడుతుంది. దర్శకుడి గురించి గట్టిగా చెప్పుకోవడానికీ ఏమీ లేదు. ఇంతకీ ఎలా ఉందంటే... ఫస్టాఫ్ చాలా నిదానంగా, పాత్రల పరిచయంతోనే అయిపోతుంది. చక్కటి మలుపుతో... ఇంటర్వెల్. సెకండాఫ్ కొంత ఆసక్తిగా, చకచకా నడుస్తుంది కానీ, చివరకు వచ్చేసరికి అదొక్క పాజిటివ్ సరిపోకపోవచ్చు. నిజం చెప్పాలంటే, ఈ సినిమా ఒక అతుకుల బొంత. ఏ సీనుకు ఆ సీను నడవడమే తప్ప, ఒక కథ, దానికి బలమైన పాత్రలు, వాటి మధ్య అంతస్సంఘర్షణ లాంటివేమైనా ఆశిస్తే తప్పు ప్రేక్షకులది. నరేశ్ తన బావమరిది అయిన డి.జి.పి. పాత్రధారి ‘వైజాగ్’ ప్రసాద్‌ను ఆదేశించే తీరుచూస్తే, కథలో నరేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రా, లేక హోమ్ మంత్రా అని సందేహం కలుగుతుంది. సినిమా సెకండాఫ్ అంతా మినిస్టర్ నుంచి గడ్డం గ్యాంగ్ వసూలు చేసిన రూ. 2 కోట్ల డబ్బు చుట్టూ ప్రధానంగా నడుస్తుంది. మరి, సదరు కిడ్నాప్ చేస్తే నమ్మినబంటు ఇస్తానన్న రెండు కోట్ల గురించి ఆ సీన్లో తప్ప, మళ్ళీ సినిమాలో ఎక్కడా రాదు. ఆ సీన్లో అలా చెప్పించామన్న సంగతి దర్శక, రచయితలు కూడా కన్వీనియంట్‌గా మర్చిపోయారు. అలాగే, ఇంతకీ హీరో గారి షాలూ ఉన్నట్లా, పోయినట్లా, ఎదురుగా లేని ఆమెను హీరో ఊహించుకుంటూ మాట్లాడడానికి కారణం ఏమిటి లాంటి అనేక సందేహాలు సినిమా చూస్తున్నప్పటి నుంచి సగటు ప్రేక్షకుణ్ణి వేధిస్తుంటాయి. కానీ, వాటన్నిటినీ సహిస్తూ, భరిస్తూ సినిమా పూర్తిగా చూసేయాల్సిందే! తీరా చూసినా, ఆ సందేహాలకు మరికొన్ని చేరేవే తప్ప, ఆరేవీ తీరేవీ కాదు. వీటన్నిటి ఫలితంగా సినిమా చూస్తుంటే, ప్రేక్షకులు కథతో, పాత్రలతో కలసి ప్రయాణించలేకపోతారు. ఈ ‘గడ్డం గ్యాంగ్’కు ఉన్న అతి పెద్ద నెగిటివ్ అదే! - రెంటాల జయదేవ -
గడ్డం గ్యాంగ్ మూవీ స్టిల్స్
-
విజయం ఖాయం
వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా ఉన్నా.. ఏదో తెలియని వెలితి. దానికి కారణం ఈ మధ్యకాలంలో నా కెరీర్ ఆశాజనకంగా లేకపోవడమే. అయితే, ఈ చిత్రంతో నా కెరీర్ మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని రాజశేఖర్ అన్నారు. తమిళ చిత్రం ‘సూదు కవ్వమ్’ తెలుగు రీమేక్ ‘గడ్డం గ్యాంగ్’లో నటించారాయన. ఈ చిత్రంపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. పి. సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. రాజశేఖర్ మాట్లాడుతూ - ‘‘‘సూదు కవ్వమ్’ని చూడగానే తెలుగులోకి రీమేక్ చేయాలనుకున్నా. వినూత్న కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. సంగీత దర్శకుడు అచ్చు మంచి పాటలు ఇచ్చారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
వినూత్న చిత్రాలే చేస్తా: రాజశేఖర్
‘‘తమిళ చిత్రం ‘సూదు కవ్వమ్’ నచ్చడంతో, ఈ రీమేక్‌లో చేయడానికి ఒప్పుకున్నాను. మూస చిత్రాలు చేయడం ఇష్టం లేకే ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాను. ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇకనుంచి ఈ తరహా చిత్రాలే చేస్తా’’ అని రాజశేఖర్ అన్నారు. పి. సంతోష్ దర్శకత్వంలో రాజశేఖర్, షీనా జంటగా జీవితారాజశేఖర్ నిర్మించిన చిత్రం ‘గడ్డం గ్యాంగ్’. అచ్చు స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సీడీని ఆవిష్కరించి టి.సుబ్బరామిరెడ్డికి ఇచ్చారు. ఈ వేడుకలో బీజేపీ నేత కిషన్‌రెడ్డితో పాటు సాయికుమార్, పోకూరి బాబురావు తదితర చిత్రరంగ ప్రముఖులు అతిథులుగా పాల్గొని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. జీవితారాజశేఖర్ మాట్లాడుతూ- ‘‘ఈ మధ్యకాలంలో మేం నిర్మించిన చిత్రాలు మాకు నష్టాన్నే మిగిల్చాయి. చిత్రబృందం అంతా కష్టపడి ఈ సినిమా చేశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
‘గడ్డం గ్యాంగ్’సినిమా వర్కింగ్ స్టిల్స్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement