-
శాంసంగ్ కొత్త గెలాక్సీలు వచ్చేశాయ్!
గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో తీవ్రంగా నష్టపోయిన దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, మరో రెండు కొత్త గెలాక్సీలతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వచ్చేసింది. గెలాక్సీ ఏ5(2017), గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్ ఫోన్లను సోమవారం భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మొదట రష్యాలో లాంచ్ చేసిన అనంతరం నేడు భారత్ కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ5(2017) ధర రూ.28,990కాగ, గెలాక్సీ ఏ7(2017) ధర రూ.33,490. మార్చి 15 నుంచి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. నేటినుంచే ఈ స్మార్ట్ ఫోన్ల ప్రీబుకింగ్స్ శాంసంగ్ ఈ-స్టోర్, ఆఫ్ లైన్ రీటైలర్స్ ద్వారా కంపెనీ అందిస్తోంది. బ్లాక్ స్కై, గోల్డ్ సాండ్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్7-స్టైల్డ్ డిజైన్ ఈ ఫోన్లకు ప్రత్యేక ఆకర్షణ. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగిన ఈ కొత్త ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఐపీ68-రేటింగ్స్ ను కలిగి ఉన్నాయి. స్క్రీన్ సైజ్, బ్యాటరీ సామర్థ్యంలోనే ఈ రెండింటిలో అతిపెద్ద మార్పులు కనిపిస్తాయి. మిగతా స్పెషిఫికేషన్లలో పెద్దగా మార్పులేమి లేకుండా 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ సపోర్టుతో ఈ ఫోన్లను కంపెనీ రూపొందించింది. గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్ ఫోన్ ఫీచర్లు డిస్ ప్లే : 5.20 అంగుళాలు ప్రాసెసర్ : 1.9 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ రెసల్యూషన్ : 1080x1920 పిక్సెల్స్ ర్యామ్ : 3జీబీ స్టోరేజ్ : 32జీబీ విస్తరణ మెమరీ : 256జీబీ వరకు ఫ్రంట్ కెమెరా : 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా : 16 మెగాపిక్సెల్ ఓఎస్ : ఆండ్రాయిడ్ 6.0 బ్యాటరీ : 3000 ఎంఏహెచ్ గెలాక్సీ ఏ7(2017) ఫీచర్లు : డిస్ ప్లే : 5.70 అంగుళాలు ప్రాసెసర్ : 1.9 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ రెసల్యూషన్ : 1080x1920 పిక్సెల్స్ ర్యామ్ : 3జీబీ స్టోరేజ్ : 32జీబీ విస్తరణ మెమరీ : 256జీబీ వరకు ఫ్రంట్ కెమెరా : 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా : 16 మెగాపిక్సెల్ ఓఎస్ : ఆండ్రాయిడ్ 6.0 బ్యాటరీ : 3600 ఎంఏహెచ్ -
లాంచింగ్‌కు ముందే ఆ ఫోన్లు లీకైపోయాయ్!
కొత్త ఏడాదిలో గెలాక్సీ కొత్త సిరీస్ ఫోన్లతో మన ముందుకు రాబోతుంది స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శాంసంగ్. జనవరి 5వ తేదీన గెలాక్సీ ఏ(2017) సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ప్లాన్స్ చేసింది. కౌలాలంపూర్‌లో జరిగే ఈ ఈవెంట్‌కు మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానాలు పంపేసింది. అయితే గ్రాండ్‌గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ గెలాక్సీ ఫోన్ల వివరాలు విడుదలకు ముందే లీకైపోయాయి. గెలాక్సీ ఏ3, గెలాక్సీ ఏ5, గెలాక్సీ ఏ7లలో ఈ మూడు డివైజ్‌లు రాబోతున్నాయని తెలుస్తోంది. ఐపీ68 రేటింగ్‌తో ఈ మూడు డివైజ్‌లను పెట్టనున్నట్టు సమాచారం. వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌ను ఇవి కలిగి ఉన్నాయట. ఫింగర్ ప్రింట్ స్కానర్స్, ఎన్ఎఫ్సీలతో ఇవి రూపొందాయట. లీకైన గెలాక్సీ ఏ7(2017) ఫీచర్లు... 5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 16 ఎంపీలతో ఫ్రంట్, రియర్ కెమెరా ధర : సుమారు రూ.28,800 లీకైన గెలాక్సీ ఏ5(2017) ఫీచర్లు... 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ దీనికి కూడా 16 మెగాపిక్సెళ్ల ఫ్రంట, రియర్ కెమెరా ధర : సుమారు రూ.25,700 గెలాక్సీ ఏ3(2017) రూమర్లు... 4.7 అంగుళాల హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆక్టాకోర్ హెక్సినోస్ 7870 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement