-
గేమింగ్‌లో గెలుపు జెండా.. ‘పాయల్ ధారే’ విజయపథం
‘ఉమన్ గేమర్! వినడానికి కొత్తగా ఉంది’ అని ఒకరు ఎగతాళిగా నవ్వారు. ‘ఆడడం బాగానే ఉంటుందిగానీ, కెరీర్‌కు బాగుండదు’ అని గంభీరస్వరంతో నిరాశ పరిచారు మరొకరు. అంతా అయోమయంగా ఉంది. అలా అని ఆగిపోలేదు. ఓనమాలు నేర్చుకుంటూనే, కొత్త విషయాలపై పట్టు సంపాదిస్తూనే మేల్–డామినేటెడ్ స్పేస్ అనుకునే గేమింగ్‌లో బిగ్గెస్ట్ యూట్యూబ్ ఉమన్ గేమర్(ఇండియా)గా గెలుపు జెండా ఎగరేసింది పాయల్ ధారే... కరోనా మహమ్మారి పదునుగా కోరలు చాస్తున్న సమయంలో, లాక్డౌన్ రోజుల్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన పాయల్ ధారే గేమింగ్–ఫోకస్డ్ ఛానల్‌కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే యూట్యూబ్ వీడియో ప్లాట్‌ఫామ్‌పై లైవ్‌స్ట్రీమింగ్ కంటెంట్ గురించి ఆమెకు అంతగా అవగాహన లేదు. కాలేజీలో స్నేహితులతో కలిసి ‘పబ్జీ’ గేమ్ ఇష్టంగా ఆడేది. ‘పబ్జీ’ని నిషేధిస్తారనిగానీ, గేమింగ్‌ను తాను కెరీర్‌గా ఎంచుకుంటాననిగానీ అనుకోలేదు పాయల్. గేమింగ్‌పై ఇష్టం పెరుగుతున్న క్రమంలో తన మనసులో మాటను ఇంట్లో చెప్పింది. ‘గేమింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటాను’ తల్దిదండ్రులు ససేమిరా అన్నారు. ‘చదువుపై దృష్టి పెట్టు’ అని మందలించారు. వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా తొలి విజయం సాధించింది పాయల్. తాము ఉండే చింద్వారా పట్టణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రమే. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో గేమింగ్ సెషన్స్ క్లిప్స్‌ను పోస్ట్ చేసేది. 100కె ఫాలోవర్స్‌తో తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఈ సమయంలోనే యూట్యూబ్‌లో ప్రయత్నించమని స్నేహితులు, ఫాలోవర్స్ నుంచి ఒక సూచన వచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం సులభం కాబట్టి మొదట దాన్నే ఎంచుకున్నాను. మీ గేమింగ్ స్కిల్స్‌కు యూట్యూట్ అనేది సరిౖయెన వేదిక అనే సలహాతో పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను’ అంటుంది పాయల్. ఛానల్ మొదలైన తరువాత రకరకాల విషయాలు స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రేక్షకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేది. లైవ్‌స్ట్రీమింగ్ గురించి ఎన్నో రోజులు రిసెర్చ్ చేసింది. ఎలాంటి కంటెంట్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారు? లైవ్‌స్ట్రీమింగ్ పనితీరు ఎలా ఉంటుంది? ఇప్పుడున్న గేమింగ్ ఛానల్స్‌కు భిన్నంగా ఎలా ప్రయత్నించవచ్చు....ఇలా రకకరాల విషయాలపై లోతైన పరిశోధన చేసింది. పాయల్ కాస్త సిగ్గరి. నలుగురి ముందు మాట్లాడాలంటే భయం. కెమెరా ఫేస్ చేయాలంటే కష్టం. ‘ఒకటి సాధించాలని బలంగా అనుకొని బరిలోకి దిగితే, వారిలోని రెండు లోపాలు మాయమవుతాయి’ అంటారు. పాయల్ విషయంలోనూ అదే జరిగింది. బరిలోకి దిగిన తరువాత కెమెరాను హాయిగా ఫేస్ చేయడం నేర్చుకుంది. బెటర్ ఇంటర్నెట్ కోసం సొంత పట్టణం వదిలి, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి మారాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వద్దని గట్టిగా చెప్పారు. వారిని ఒప్పించడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఇక్కడికి మారిన తరువాత సబ్స్కైబర్ల సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో తనకు పేరున్న గేమర్స్లాగా పర్సనల్ కంప్యూటర్ సెటప్ లేదు. లైవ్‌స్ట్రీమ్, అప్‌లోడ్‌కు తన దగ్గర ఉన్న ఫోన్ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మాత్రం తన దగ్గర డ్యూయల్ మానిటర్స్‌తో కూడిన మంచి పీసీ సెటప్ ఉంది. ‘పాయల్ గేమింగ్’ ఛానల్ 2.5 మిలియన్ సబ్స్రైబర్లతో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని పాయల్ ఊహించలేదు. అయితే ఇది అంత సులువుగా దక్కిన విజయం కాదు. ‘సబ్స్క్రైబర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. అయితే అదే ఛానల్ విజయవంతంగా దూసుకుపోతున్నప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రోత్సహించే వారి కంటే రాళ్లు రువ్వే వాళ్లే ఎక్కువగా ఉంటారు. నా లైవ్స్ట్రీమ్స్పై కొందరు హేట్ కామెంట్స్ చేశారు. కొందరు బాడీ షేమింగ్ చేశారు. మొదట్లో బాధపడేదాన్ని. వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే విషయం అర్థమైన తరువాత వాటిని తేలికగా తీసుకున్నాను’ అంటుంది పాయల్. విజయం కోసం పోరాటం ఎంత ముఖ్యమో, ఆ విజయాన్ని నిలుపు కోవడం కోసం గట్టిగా నిలబడడం కూడా అంతే ముఖ్యం. పాయల్ ధారే ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉంది. ఇదీ చదవండి: విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే! -
గేమర్ గర్ల్స్‌కు కావల్సినంత డబ్బు, కానీ...
సిడ్నీ: ఆకర్షణీయమైన ఉద్యోగం, లక్షల్లో జీతాలు, అంతకన్నా ఎక్కువ స్పాన్సర్‌షిప్‌లు, అప్పుడప్పుడు డొనేషన్లు వెరసి లెక్కలేనంత డబ్బు. అందమైన ఫ్లాటు. ఆడపిల్లలకు జీవితంలో ఇంతకన్నా ఏం కావాలి అని అనుకొంటారు ఎవరైనా. అయితే ఈ జీవితాన్ని అనుభవిస్తున్న ఆస్ట్రేలియా వీడియో గేమ్ అమ్మాయిలు మాత్రం మౌనంగా ఏడుస్తున్నారు. తమదంతా పైపై మెరుగుల జీవితమని వారు వాపోతున్నారు. కాల్పనిక జగత్తులో, అంటే వర్చువల్ వీడియో గేముల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా మగవాళ్లు లైంగికంగా తమను వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమర్ అమ్మాయిలు తమ కంపెనీలు లేదా వీడియో గేమ్ వెబ్సైట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీడియో గేమ్ లవర్లతో వర్చువల్ వీడియో గేమ్స్ ఆడుతుంటారు. అందుకు వారికి కంపెనీల నుంచి లక్షల్లో జీతాలు, ఉండటానికి అందమైన ఫ్లాటే కాకుండా స్పాన్సర్‌షిప్‌లు వస్తుంటాయి. అప్పుడప్పుడు తమ అభిమానుల నుంచి డొనేషన్లు అందుతుంటాయి. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లలో కూడా వారికి వాటా లభిస్తుందట. గేమింగ్ ప్రపంచంలో ఎక్స్మింక్స్గా పరిచయమైన చెల్సియాకు నెలకు ఆరు అంకెల జీతం (డాలర్లలో) లభిస్తుందని, అయినప్పటికీ అభిమానుల వేధింపులకు బాధ కలుగుతుందని చెప్పారు. ‘ మగవాళ్లు ఆట మీద దష్టి పెట్టకుండా నా అందం మీద, నా శరీరం మీద దష్టి ఎక్కువగా పెడతారు. కొందరు లైంగికంగా వేధించేందుకు ప్రయత్నిస్తారు. నేను ఫార్మసీలో డిగ్రీ చదివాను. ఆ ఉద్యోగంకన్నా ఎక్కువ జీతమే ఇక్కడ అందుతుంది. అయితే ఏ నెల ఎంత వస్తుందో తెలియదు. ఒక్కోసారి డొనేషన్లే వెయ్యి డాలర్ల నుంచి ఐదువేల డాలర్ల వరకు వస్తాయి’ అని మూడున్నర లక్షల మంది అభిమానులను కలిగిన చెల్సియా తెలిపారు. ‘ట్విచ్ డాట్ టీవీ’ ఫ్లాట్‌ఫామ్‌పై ఆమె కనిపిస్తారు. ‘మీరు ఇలా బాగుంటారు, అలా బాగుంటారు. దుస్తులు లేకుండా ఇంకా బాగుంటారు. మిమ్మల్ని అలా చూడాలని ఉందంటూ’ వర్చువల్ గేముల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా మగవాళ్లు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆన్లైన్లో లాసర్ఫ్రూట్గా పరిచయమైన క్యాథలిన్ వాపోతున్నారు. జీతాలు చెల్లించే యజమాన్యాలు కూడా తమను లైంగికంగా వేధిస్తున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని గేమింగ్ గర్ల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement