-
ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్, ట్రాన్స్మిషన్), డైరెక్టర్(ఫైనాన్స్), డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) పోస్టులతోపాటు జెన్కో డైరెక్టర్ (జలవిద్యుత్), డైరెక్టర్ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్ (హెచ్ఆర్ అండ్ ఐఆర్), డైరెక్టర్ (కోల్–లాజిస్టిక్స్), డైరెక్టర్ (ఫైనాన్స్–కమర్షియల్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖా స్తుదారుల వయసు 62 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేసింది. ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1ని చివరి తేదీగా నిర్ణయించింది. త్వరలోనే డిస్కమ్‌ల డైరెక్టర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో డైరెక్టర్లుగా సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్ సర్వీస్, రిటైర్డ్ విద్యుత్ అధికారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. డైరెక్టర్ల నియమకానికి మార్గదర్శకాలను జారీ చేస్తూ 2012 మే 14న జారీ చేసిన జీవో 18 ప్రకారం.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లీస్టును రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వీనర్లుగా, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్‌రంగ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ సిఫారసు చేసిన షార్ట్ లిస్టు లోని ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకరిని డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.. డైరెక్టర్ పదవి కాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలక్షన్ కమిటీ సిఫారసులతో మరో ఏడాది, ఆ తర్వాత కూడా ఇంకో ఏడాది పొడిగించడానికి వీలుంది. -
పొరపాట్లు దిద్దుకుంటాం
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో లోపాలను పొరపాట్లును సరిదిద్దుకుంటామని ఏపీజెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. సోమవారం ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదం నేపధ్యంలో ఆయన మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఏడీఈ నాగేంద్ర మృతి బాధకరమని, సెఫ్టీ నియమాలను జెన్కోలోని అన్ని స్టేషన్లో కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆర్టీపీపీ అధికారులు, గామన్ ఇండియా కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆరో యూనిట్‌లోని బాయిల్, చిమ్నీ, ఈఎస్పీ, టర్బెన్ పనులను పరిశీలించారు. అనంతరం సీఈ చాంబర్లో విలేఖర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని జెన్కో పరిధిలో ఇంత ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అన్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది పరిశీలించి పొరపాట్లు సరిచేసుకుంటామని చెప్పారు. ఈ సంఘనపై ప్రత్యేకంగా కమిటీ వేస్తామని చెప్పారు. ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు... ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదంపై జెన్కో డెరైక్టర్ బలరాం ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కమిటీని నియామించినట్లు చెప్పారు. ఈ కమిటీలో జెన్కో సివిల్ సీఈ రత్నబాబు, టీపీసీ సీఈ కృపసాగర్, ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ రెండు వారాల లోగా అన్ని కోణాలలో విచారణ చేసి పూర్తి సమాచరంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సెఫ్టీ పాటించకపోతే లోనికి రాన్వికండి... ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగాలు, అధికారులు, కార్మికులు ఏవరైనా సరై సెఫ్టీ నియమాలు పాటించకపోతే లోనికి రాన్వివద్దని జెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. ఆర్టీపీపీలోని ఆరో యూనిట్లో అన్ని చోట్ల సెఫ్టీకి సంబంధించి బోర్టులు ఉంచాలని సూచించారు. ప్రధానంగా గేటు వద్ద పర్యవేక్షణ చేసి సెఫ్టీ లేకపోతే బయటకు పంపాలని ఆదేశించారు. ప్రాజె క్ట్ పనులలో ప్రత్యేకంగా సెఫ్టీపై పర్యవేక్షణ అధికారులను నియమిస్తామన్నారు. ఎస్ఈలు ఈ సెఫ్టీపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌లలో అదనంగా అంబులెన్సుల సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. నష్టపరిహారంతో గాయపడిన కార్మికులకు సాయంగా నిలుస్తాం ప్రమాదంలో మృతి చెందిన ఏడీఈ నాగేంద్రకు కంపెనీ ఇస్తున్న నష్టపరిహారంతో పాటు జెన్కో బోర్డు కూడా అందిస్తుందన్నారు. గాయపడిన కార్మికులకు వైద్య ఖర్చులను బోర్టు భరిస్తుందన్నారు. ముఖ్య మంత్రి సంతాపం.. ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏడీఈ నాగేంద్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారని ఏపీజెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని సీఎం చెప్పారని ఆయన తెలిపారు. ఆర్టీపీపీ బొగ్గు కొరతను అధిగమిస్తాం. ఆర్టీపీపీలోని బొగ్గు కొరతను త్వరలోనే అధిగమిస్తామని ఆయన అన్నారు. 15 రోజులకు అవసరమైన బొగ్గు ఉండాలని, అరుుతే కొరత కారణంగా ప్రస్తుతం ఏరోజుకారోజు అన్నట్లు నడుస్తోందన్నారు. క్రిష్ణపట్నంకు బొగ్గు తరలిపోతోందని, అలాగే విజయవాడ బొగ్గును ఆర్టీపీపీకి ఇస్తున్నామని చెప్పారు. సింగరాణి నుంచి 1 మిలియన్ బొగ్గు ఇక్కడికి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలోనే ఆర్టీపీపీలో 20 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నామని ఎక్కడ కూడా కోతలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజెన్కో డెరైక్టరు బలరాం, జెన్కో సివిల్ సీఈ రత్నబాబు, టీపీసీ సీఈ కృపసాగర్, ఆర్టీపీపీ సీఈ కుమారుబాబు, ఎస్ఈలు శేషారెడ్డి, శ్రీధర్‌బాబు, రామముత్యలరావు, రామసుబ్బారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నర్సంహరావు, దేవేంద్రనాయక్లు, సంక్షేమ శాఖ అధికారి తిరుమల రావు, ఎస్పీఎఫ్ కమాడెంట్ మునిరాజ, ఆర్ఐ ఉస్సేనయ్య, కలమల్ల ఎస్ఐ హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
పకడ్బందీగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పనులు వేగంగా చేయిస్తున్నాం: కలెక్టర్
ఆత్మ ఘోష..!
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలుస్తాం
దేవుడి భూమిని క్రీడా మైదానంగా మార్చే యత్నం
రామన్‌పాడులో 1,010 అడుగులు
వెళ్దామంటే దారులు లేవు
ప్రైవేట్ క్లినిక్‌లలో తనిఖీలు
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
- ‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
- Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఈసీ నోటీసులు
Advertisement