-
విద్యార్థినుల హాస్టల్.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు..
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేట ఆదర్శ కళాశాల హాస్టల్ విద్యార్థినులు దయ్యం భయంతో వసతి గృహాన్ని ఖాళీ చేశారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్స్‌లో భాగంగా చదువుకుంటున్న విద్యార్థినులకు గదిలో నీడలాగ ఒక ముఖం కనిపించిందని, వెనుకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని, వింత శబ్దాలు వినిపించాయని చెప్పారు. దీంతో బెదిరిపోయిన విద్యార్థినులు బుధవారం ఉదయమే సొంత ఊర్లకు వెళ్లిపోయారు. కాగా, విద్యార్థినులు హోమ్‌సిక్ తోనే వెళ్లిపోయారని, తిరిగి రాగానే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మోడల్‌స్కూల్ ప్రిన్సిపల్ శ్రీలత పేర్కొన్నారు. -
శ్మశానంలో పరిశోధనలకు వెళ్తే..
వినియోగంలో లేని 12 శతాబ్దానికి చెందిన ఓ శ్మశాన వాటికను పరిశీలించేందుకు వెళ్లిన పరిశోధకులకు విచిత్ర అనుభవాలు ఎదురయ్యాయట. బ్రిటన్ లోని నార్త్ యార్క్ షైర్ లో గల బొల్టన్ అబ్బే శ్మశాన వాటికను 12వ శతాబ్దంలో నిర్మించారు. కొన్ని శతాబ్దాల తర్వాత దాని వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు. కాగా, శ్మశానానికి వెళ్లిన పరిశోధకుల్లో ఒకరైన టిమ్ అట్కిన్ సన్స్ ఆ ప్రాంతం మొత్తాన్ని ఫోటోలు తీశారు. శ్మశానంలో ఉన్న సమయంలో తమకు విచిత్ర అనుభవాలు ఎదురైనట్లు ఆయన చెప్పారు. ఎవరో తమని చూస్తున్నట్లు బృంద సభ్యులు మొత్తం అనుభూతి చెందినట్లు తెలిపారు. శ్మశానంలోకి ప్రవేశించగానే ఒక్కసారి పెద్ద మొత్తంలో గాలి, ధూళి చెలరేగినట్లు చెప్పారు. దీంతోపాటు దూరం నుంచి నక్కలు ఊళలు వేశాయడంతో తమ ఒళ్లు జలదరించినట్లు తెలిపారు. శ్మశానం నుంచి తిరిగివచ్చిన అనంతరం అక్కడ తీసిన ఫోటోలను పరిశీలించగా.. శ్మశాన ప్రవేశ ద్వారాన్ని తీసిన చిత్రంలో ఎవరో తమ వైపు చూస్తున్నట్లు ఉందని చెప్పారు. ఆ రోజు రాత్రి మొత్తం దేశవ్యాప్తంగా వాతావరణం అల్లకల్లోలంగా మారిందని పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement