-
నేను ఫ్లాప్ యాక్టర్
కరణ్ జోహార్ బాలీవుడ్లో ఎన్నో బ్లాక్‌బాస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ వంటి చిత్రాలు ఓ ఉదాహరణ. డైరెక్టర్‌గా సూపర్ సక్సెస్ అయిన కరణ్ ‘నేను ఫ్లాప్ యాక్టర్’ అంటున్నారు. పూర్తి స్థాయి యాక్టర్‌గా కరణ్ చేసిన ‘బాంబే వెల్వెట్, వెల్కమ్ న్యూయార్క్’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. ‘‘నేనో ఫ్లాప్ యాక్టర్‌ని. నటుడిగా చేసిన ఏ ఒక్క సినిమా సరిగ్గా ఆడలేదు. సక్సెస్ఫుల్ సినిమాలు లేకపోవడంతో ఎవ్వరూ నన్ను యాక్టర్‌గా తీసుకోవాలనుకోవడం లేదు. అలాగే ఆ సినిమాల్లో నా నటన కూడా అంత చెప్పుకోదగ్గ రేంజ్లో లేదు’’ అని నిజాయితీగా పేర్కొన్నారు. -
మంచి దర్శకుడే కాదు... మార్గదర్శకుడు
సందర్భం: నేడు రాజ్‌కుమార్ హిరానీ బర్త్‌డే 2003వ సంవత్సరం భారతీయ సినిమా ప్రేక్షకలోకం ఆర్ద్రతతో హర్షించింది. కళామతల్లిని కనకవర్షంతో అభిషేకించింది. మనసు తడిని చెంప మీద ఆనంద భాష్పాలుగా రాల్చింది. ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’ అనే కొత్త డాక్టరు ఆగమనంతో దశాబ్దాలుగా మూస సినిమాల కథా వస్తువుల్లోని బ్యాక్టీరియాను పోగొట్టి ప్రేక్షకులనూ, పరిశ్రమలోని ఆలోచనాపరుల్నీ ఆరోగ్యంతో ఉత్తేజితుల్ని చేసింది. ఇన్ని అద్భుతాలకు మూలకారకుడు భూమ్మీద పడింది 1962 నవంబర్ 22న. ప్రేక్షకలోకాన్నీ, నాతిగా భావించి ముచ్చటగా మూడు ముళ్లేశాడు ఈ దర్శకుడు - రాజ్‌కుమార్ హిరానీ. ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్’ - ఈ మూడు ముళ్లు వేసి ‘నాతి చరామి’ అన్నాడీయన. ప్రేక్షక లోకంలో ఏడు జన్మల అనుబంధం పెనవేసుకున్నాడు. ఈ మూడు చిత్రాల్లో... సాధారణ చలన చిత్రాల్లో లోపించిన, మరుగున పడిన మానవ ‘ధర్మం’ ఉంది. మనుషులు మర్చిపోయిన మానవత్వపు విలువలను ఆచరించాలన్న ‘కామం’ (కోరిక) ఉంది. నిర్మాత విధూ వినోద్ చోప్రాకు ప్రేక్షకులిచ్చిన ‘అర్థం’ (ధనం) భారీగా ఉంది. ‘ఇలాంటి సినిమాల్రా మాక్కావాలి’ అనిపించేలా శాటిస్ఫ్యాక్షన్ ప్రేక్షకుడికి - ‘మోక్షం’గా లభించింది. దటీజ్ రాజ్‌కుమార్ హిరానీ. చాలా పెద్ద సమస్యల్ని చిరునవ్వు నవ్వేలా తేలికగా ప్రస్తావించడం, జీవితాన్ని కాంప్లికేట్ కాకుండా ఎలా చూసుకోవాలో చిన్న చిన్న పరిష్కార మార్గాలు చూపడం, ప్రేమను శరీరం మీద కాకుండా మనసులతో చూపడం, అన్ని కళాత్మక భావాలనీ కమర్షియల్‌గా కళ్ల ముందు ఆవిష్కరించడం - నిజంగా సినిమా చూడడం వచ్చిన వాడికి ఇంతకంటే నచ్చే విషయం మరొకటి ఉండదు. ‘ఖల్నాయక్’ వేషధారిని ‘మున్నాభాయ్’గా మెప్పించడం ఓ సాహసం. ‘జాదూ కీ జప్పీ’ (కౌగిలి మంత్రం) సినిమాకే కాదు ఆత్మీయతలు కొరవడిన ఆధునిక సమాజానికీ ఓ అవసరం. సీక్వెల్ కథలు హిట్ అవ్వడమే చాలా అరుదైన రోజుల్లో ‘లగేరహో మున్నాభాయ్’ సినిమా తీయడం ఇంకో పెద్ద సాహసం. అహింస, సత్యం అనే ఆయుధాలతో భారతావనికి స్వాతంత్య్రం సాధించిన గాంధీ మహాత్ముని ఆశయాలనూ, ఆలోచనలనూ ఇవాళ్టి సమాజంలో ఎలా ఆచరణలో పెట్టచ్చో చూపించిన చిత్రం - ‘లగేరహో...’. ‘గూండా గిరీ’కి వ్యతిరేకంగా ‘గాంధీగిరి’ని ప్రేరేపించడం దర్శకునిలోని ఎవరెస్ట్ అంత ఎత్తై వ్యక్తిత్వానికి నిలువెత్తు దర్పణం. రాంచోడ్ పాత్రతో ‘త్రీ ఇడియట్స్’లో విద్యావ్యవస్థలో వ్యక్తిత్వ వికాసం ఎంత అవసరమో చూపించిన తీరు అద్భుతం. కొంతమంది మేధావులైన దర్శకులు సమస్యల్ని వెండితెర మీద ప్రతిబింబిస్తారు. అవార్డు సినిమాలగానో, ఆర్ట్ సినిమాలగానో పేరు పొంది, మంచి దర్శకులవుతారు. రాజ్‌కుమార్ హిరానీ మాత్రం సమస్యలకు పరిష్కారాన్ని చూపాడు. జనామోదం పొంది, కమర్షియల్గానూ సక్సెస్ అయ్యాడు. మంచి దర్శకుడేకాదు, మార్గదర్శకుడు కూడా అయ్యాడు. ఈ తరం యువతరానికి రాజ్‌కుమార్ హిరానీ సినిమాల సారాంశాలు, కథాంశాలు... పాఠ్యాంశాలు. 2014లో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాను... కొత్తగా రాయాలంటే రాజ్‌కుమార్ హిరానీ స్క్రిప్టులు అన్నీ కలిపి రాసేసుకోవడమే. ఆయన సినిమా ఒక ‘చికెన్ సూప్ ఫర్ ద సోల్’! ఒక ‘సీక్రెట్’! మానవ జీవన పోరాటంలో శిథిలమైపోతున్న నైతిక విలువలనూ, మానవీయ దృక్పథాన్నీ, ఆత్మీయతనూ, సరళమైన మృదుభాషణనూ, ఆలింగనాన్నీ, ఓదార్పునూ, నవ్వునూ, కన్నీటినీ - అన్నిటినీ స్పృశించి మనలో వాటికి మళ్లీ జీవం తొడుగుతున్న వెండితెర బ్రహ్మ - రాజ్‌కుమార్ హిరానీ. ‘పీకే’తో ఆయనతో నాలుగో అడుగు వేయడం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అఖిల భారత సినీ ప్రేక్షకులలో నేనొకడిని! ఆయనకు మనందరి తరపునా ‘శతమానం భవతి’. జన్మదిన శుభాకాంక్షలతో...
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement