-
మహనీయుడి కారుకి ప్రాణం పోశారు
కోల్‌కతా: మహనీయుడి కారు మళ్లీ ప్రాణం పోసుకుంది. స్వాంతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్(నేతాజీ) నడిపిన కారు మరోసారి రోడ్డు ఎక్కేందుకు సిద్ధమైంది. జనవరి 18న కోల్‌కతాలోని నేతాజీ భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ కారు ప్రారంభం కానుంది. ఈ కారులో ప్రయాణించే భాగ్యం కూడా తొలిసారి రాష్ట్రపతి ప్రణబ్‌కు దక్కనుంది. దాదాపు 80 ఏళ్ల తర్వాత ఇది ఊపిరి పీల్చనుంది. చాలా ఏళ్లుగా కదలకుండా ఓ అద్దాల గదిలో ఉన్న ఆ కారును తిరిగి మనుగడలోకి తెచ్చేందుకు జర్మన్ ఆడి కారు సంస్థ అధికారులతో నేతాజీ రీసెర్చ్ బ్యూరో(ఎన్ఆర్ బీ) ఒప్పందం చేసుకున్న మేరకు ఈ కారు సిద్ధమైంది. చదవండి.. (మహనీయుడి కారుకి మళ్లీ ప్రాణం) 1937లో జర్మనీలోని వాండరర్ సెడాన్ కంపెనీ ఈ కారును తయారు చేయగా దానిని సుభాష్ చంద్రబోస్ సోదరుడు తెప్పించారు. బోస్ ఈ కారును ఉపయోగించేవారు. స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజుల్లో ఆయనను ఓసారి బ్రిటిష్ సేనలు గృహ నిర్బంధం చేశాయి. దీంతో జనవరి 16, 1941న వాండరర్లో కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్డులోని తన నివాసం నుంచి బిహార్‌లోని గోమో ప్రాంతానికి(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) బోస్ పారిపోయారు. అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. దీనినే చరిత్రలో 'గ్రేట్ ఎస్కేప్'గా అభివర్ణిస్తారు. అప్పటి నుంచి గొప్ప జ్ఞాపికగా ఉంటున్న బోస్ కారు చివరకు కదలనుంది. -
మహనీయుడి కారుకి మళ్లీ ప్రాణం
కోల్‌కతా: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన కారుకు మళ్లీ ప్రాణం రానుంది. చాలా ఏళ్లుగా కదలకుండా ఓ అద్దాల గదిలో ఉన్న ఆ కారును తిరిగి మనుగడలోకి తెచ్చేందుకు జర్మన్ ఆడి కారు సంస్థ అధికారులతో నేతాజీ రీసెర్చ్ బ్యూరో(ఎన్ఆర్ బీ) ఒప్పందం చేసుకుంది. ఈ కారుకు 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. 1937లో జర్మనీలోని వాండరర్ సెడాన్ కంపెనీ ఈ కారును తయారు చేయగా దానిని సుభాష్ చంద్రబోస్ ఉపయోగించారు. స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజుల్లో ఆయనను ఓసారి బ్రిటిష్ సేనలు గృహ నిర్బంధం చేశాయి. దీంతో జనవరి 16, 1941న వాండరర్లో కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్డులోని తన నివాసం నుంచి గోమో ప్రాంతానికి(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) బోస్ పారిపోయారు. అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది బోస్ మేనళ్లుడు సిసిర్ బోస్. దీనినే చరిత్రలో 'గ్రేట్ ఎస్కేప్'గా అభివర్ణిస్తారు. కట్టుదిట్టంగా ఆయన ఇంటిచుట్టు బ్రిటీష్ సేనలు, నిఘా అధికారులు ఉన్నప్పటికీ బోస్ వారు కళ్లుగప్పి తప్పించుకున్నారు. అందుకే ఇది 'గ్రేట్ ఎస్కేప్'గా నిలిచిపోయింది. ఆ కారును ప్రస్తుతం నేతాజీ ఇంటిలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో అద్దాల గదిలో ఉంచుతున్నారు. ఆయన ఇళ్లు ప్రస్తుతం ఎన్ఆర్బీగా మారిన సంగతి తెలిసిందే. దీని చైర్ పర్సన్ కృష్ణ బోస్ ఇటీవల జర్మనీకి చెందిన ఆడి కంపెనీని సంప్రదించి ఆ కారుకు తిరిగి ప్రాణంపోయాలని చెప్పారు. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. వింటేజ్ కార్ల నిపుణుడు పల్లాబ్ రాయ్ సమక్షంలో ఈ కారు తిరిగి రూపుదిద్దుకోనుంది. ఇది ఈ ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తి అవనున్నట్లు ఎన్ఆర్ బీ చైర్ పర్సన్ కృష్ణ బోస్ మీడియాతో చెప్పారు. కాగా, చరిత్రలో నిలిచిపోయిన ఈ కారు నెంబర్ బీఎల్ఏ 7169. ఈ కారు ద్వారా తప్పించుకోగలిగిన బోస్ ఆ వెంటనే అఫ్గనిస్థాన్ నుంచి వయా కాబూల్, మాస్కో ద్వారా జర్మనీ చేరుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement