-
విజయవాడ గ్రేటర్ విజయవాడ కానట్లేనా?
-
త్వరలో గ్రేటర్..!?
మారనున్న నగర రూపు ప్రస్తుత నగర జనాభా 11.97 లక్షలు గ్రామాల విలీనం అనంతరం 15.20 లక్షలు ప్రస్తుత నగర విస్తీర్ణం 64 చదరపు కిలోమీటర్లు గ్రేటర్ అయ్యాక 403.70 చ.కిలోమీటర్లు విజయవాడ సెంట్రల్ /విజయవాడ రూరల్ : గ్రేటర్ దిశగా విజయవాడ పరుగుతీస్తోంది. విజయవాడ రూరల్ మండలాన్ని నగరంలో విలీనం చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసింది. మండలంలోని 11 గ్రామాలను విలీనం చేసేవిధంగా ప్రత్యేక జీవోను సిద్ధం చేసిందని సమాచారం. రూరల్ మండలంలోని నున్న, పాతపాడు, పి.నైనవరం, అం బాపురం, జక్కంపూడికాలనీ, గొల్లపూడి,రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాలు విజయవాడలో విలీనం కానున్నాయి. కొత్తూరు తాడేపల్లి, పైడూరుపా డు, రాయనపాడు గ్రామాలను జి.కొండూరు మండలంలో కలిపి, రూరల్ మండలాన్ని పూర్తి గా తొలగించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. నగరంలో కొత్తగా ఏర్పాటుచేసే మండల రెవెన్యూ కార్యాలయాల పరిధిలోకి ఈ గ్రామాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఫైల్ సిద్ధం గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన 2011లోనే తెరపైకి వచ్చింది. అప్పట్లో శివారు గ్రామ పంచాయతీలు దీన్ని వ్యతిరేకించాయి.రాజధాని నేపథ్యంలో బెజవాడ ప్రాధాన్యత పెరిగింది. మెట్రోరైలు ఏర్పాటు నేపథ్యంలో గ్రేటర్ తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో సర్కార్ మళ్లీ గ్రేటర్ పల్లవి అందుకుంది. ఎనిమిది నెలల క్రితం టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేను నిర్వహించి నివేదిక ఇచ్చారు. గ్రేటర్‌కు సంబంధించి నగరపాలక సంస్థ ఐదునెలల క్రితమే కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. గన్నవరం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, బుద్ధవరం, వెదురుపావులూరు, కంకిపాడు, పెనమలూరు, పోరంకి, కానూరు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, ముస్తాబాద, నున్న, పాతపాడు, నైనవరంతో పాటు మరో 28 గ్రామలను విజయవాడలో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ రూపుతెచ్చేందుకు కసరత్తు ముమ్మరమైంది. దీనికి సంబంధించిన ఫైల్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి టేబుల్‌పైకి చేరి నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే గ్రేటర్ జాబితాలో బెజవాడ చేరనున్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలుస్తోంది. పాలకుల్లో గుబులు గ్రేటర్ కదలికలు ముమ్మరం కావడంతో మండలస్థాయి పాలకుల్లో గుబులు రేగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలం ఇక కనుమరుగుకానుంది.ఈ మేరకు మార్చి రెండో వారంలో మండల పరిషత్ చివరి సమావేశాన్ని నిర్వహించేందుకు పాలకవర్గం ఏర్పాట్లు చేస్తోంది. ఐదేళ్లకు ఎన్నికైన మండల పరిషత్ పాలకులు మూడేళ్ల పదవీకాలంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మొత్తం 45 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా కొన్ని గ్రామపంచాయతీలు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా పంచాయతీల విముఖతను ప్రభుత్వం పట్టించుకొనే పరిస్థితి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement