-
కన్నుల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క?
1. జిరాప్ ధాల్మియం వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? 1) నాలుక 2) కండరం 3) కంటిరెప్ప 4) కన్ను 2. కిందివాటిలో ట్రేస్ మూలకం కానిది? 1) మాంగనీస్ 2) సిలీనియం 3) కాల్షియం 4) ఫ్లోరిన్ 3. ఒక గ్రాము కొవ్వు ఎన్ని కిలో క్యాలరీల శక్తినిస్తుంది? 1) 9.54 2) 9.45 3) 9.35 4) 9.53 4. కిందివాటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియకు ఆవశ్యకమైంది ఏది? 1) రైబోఫ్లోవిన్ 2) నియాిసిన్ 3) పెరిడాక్సిన్ 4) థయాలిన్ 5. జంతువుల్లో పిండి పదార్థం? 1) లాక్టోస్ 2) సుక్రోజ్ 3) సెల్యులోజ్ 4) గ్లైకోజెన్ 6. థైరాక్సిన్ హార్మోన్ గురించి సరికానిది? 1) జీవక్రియ రేటును పెంచుతుంది 2) ఎక్కువ ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యేట్లు చేస్తుంది 3) కణజాలాలు పెరగడంలో, {పత్యేకత పొందడంలో తోడ్పడుతుంది 4) రక్తం, ఎముకల్లో ఉండే C2,ఫాస్పేట్ల స్థాయిని నియంత్రిస్తుంది 7. ద్విధావిచ్ఛిత్తి జరుపుకునే జంతువు? 1) బ్యాక్టీరియా 2) యూగ్లీనా 3) 1, 2 4) ఏదీకాదు 8. మస్తిష్క వల్కలంలో ఉండే నాడీకణాల సంఖ్య(బిలియన్లలో)? 1) 2.6 2) 3.6 3) 4.6 4) 5.6 9. ఎల్లోజ్వరాన్ని కలిగించే వాహకాలు ఏవి? 1) ఎలుకలు 2) కీటకాలు 3) కోతులు 4) పాములు 10. పెరుగుదలకు కావాల్సిన ఏదో ఒక పదార్థం పాలలో ఉందని 1912లో కనుగొన్నవారు? 1) సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 2) హెచ్.జి. హాప్కిన్స 3) సర్‌క్రిక్ 4) సర్ వాట్సన్ 11. వానపాములో స్త్రీ బీజ కోశాలుండే ఖండితాల సంఖ్య? 1) 11 2) 12 3) 13 4) 14 12. ఫోరోఫిరిన్ అణువుల్లో ఉండేవి? 1) హిమోగ్లోబిన్‌లోని గ్లోబిన్ ప్రోటీన్ 2) ఐరన్ 3) కర్బన అణువులు 4) అన్నీ 13. నాడీ మండలంలో క్రియాత్మక పరిమాణాలు? 1) గ్లియల్ కణాలు 2) సహాయ కణాలు 3) నాడీకణాలు 4) నిస్సెల్ కణాలు 14. శరీరంలోకి ప్రవేశించిన ప్రతిజనకాలను గుర్తించి, ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తూ వ్యాధులను నివారించే W.B.C.? 1) మోనో సైట్లు 2) లింఫోసెట్లు 3) ఇస్నోఫిల్స్ 4) బేసోఫిల్స్ 15. జాతీయ గీతం వినగానే భక్తి శ్రద్ధలతో లేచి నిలబడటం ఏ చర్య? 1) నిబంధన రహిత 2) నిబంధన సహిత 3) సంకల్పిత 4) అసంకల్పిత 16. కప్పలో సంతానోత్పత్తి కాలం? 1) జూన్ - ఆగస్టు 2) జూన్ - సెప్టెంబరు 3) జూన్ - అక్టోబరు 4) ఆగస్టు- నవంబరు 17. ఉభయ జీవుల్లో సిరాసరిణి తెరుచుకునే హృదయపు గది? 1) ఎడమ జఠరిక 2) కుడి కర్ణిక 3) కుడి జఠరిక 4) ఎడమ కర్ణిక 18. బాల్య వివాహాల అదుపు చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చేసింది? 1) 1972 2) 1974 3) 1976 4) 1978 19. అధిక సంఖ్యలో అండాలు ఒక సమూహాంగా విడుదలవుతాయి. దీన్ని ఏమంటారు? 1) స్పాన్ 2) మిల్ట్ 3) స్కలన నాళం 4) పుటికలు 20. ఏ వ్యాధి చికిత్సలో డై ఇథైల్ కార్బ మొజైన్ను ఔషధంగా వాడతారు? 1) బోదరోగం 2) కోరింత దగ్గు 3) గవద బిళ్లల వ్యాధి 4) తట్టువ్యాధి 21. శరీరం మొత్తం బరువులో ఎంతశాతం కంటే ఎక్కువ కొవ్వులు ఉన్నవారిని స్థూల కాయులు అంటారు? 1) 10 2) 15 3) 12 4) 20 22. పరిపూర్ణ ప్రోటీన్లు అని వేటినంటారు? 1) మాంసం 2) పాలు 3) గుడ్లు 4) అన్నీ 23. పారామిషియంలో సమవిభజన ద్వారా ఏర్పడిన ‘8’ కేంద్రకాల్లో అదృశ్యం అయ్యేవి ఎన్ని? 1) 2 2) 3 3) 4 4) 5 24. ఆడకప్పలో ఉండనివి? 1) స్వరకోశాలు 2) ఏంప్లక్సరి 3) 1, 2 4) ఏదీకాదు 25. అతిముఖ్యమైన వేగస్ కపాలనాడీ ఎన్నోది? 1) ఒకటి 2) ఐదు 3) పది 4) పదకొండు 26. హార్మోన్లు చర్య జరిపే కణజాలం? 1) నిర్వాహక 2) మృదు 3) లింప్ 4) స్థంభాకార 27. గర్బధారణ తర్వాత ఎన్ని వారాలకు ముఖ్య అవయవాలన్నీ ఏర్పడతాయి? 1) 11 2) 10 3) 9 4) 12 28. చేపల్లో అంతర జలశ్వాస రంధ్రాలు తెరచుకునే భాగం? 1) నోరు 2) ఆస్యకుహరం 3) గ్రసని 4) స్వరకోశాలు 29. అండాశయంలో ఉబ్బిన భాగం నుంచి అండాలు పెరిగే భాగాన్ని ఏమంటారు? 1) అండాతర కణజాలం 2) కలాజా 3) అండన్యాస స్థానం 4) అండద్వారం 30. రక్త వర్గాలను కనిపెట్టినవారు? 1) అరిస్టాటిల్ 2) విలియం హార్వే 3) కార్లలాండ్ స్టీనర్ 4) ల్యూవెన్ హుక్ 31. సాలమండర్లో శ్వాసక్రియ? 1) పుపుస శ్వాసక్రియ 2) జల శ్వాసక్రియ 3) చర్మ శ్వాసక్రియ 4) విసరణ 32. ఎర్రరక్తకణంలో కేంద్రకం ఉన్న సక శేరుకాలకు ఉదాహరణ? 1) కప్ప 2) ఒంటె 3) కప్ప, మానవుడు, ఒంటె 4) కప్ప, ఒంటె 33. చేమంతిలో పిలకమొక్కలు దేని నుంచి ఏర్పడతాయి? 1) వేరు 2) కాండం 3) పత్రం 4) వేరు బుడిపెలు 34. ఎయిడ్స వ్యాధిలో బలహీనపడే తెల్ల రక్త కణాలు? 1) బేసోఫిల్స్ 2) న్యూట్రోఫిల్స్ 3) మోనోసైట్స్ 4) లింఫోసైట్స్ 35. కణజాల వర్ధనంలో ఏకస్థితిక మొక్కల ఉత్పత్తికి వాడేవి? 1) పత్రాలు 2) కాండ కణాలు 3) పరాగ రేణువులు 4) వేరు చివరి కణాలు 36. ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక? 1) కాలేయం 2) క్లోమం 3) ఎముక మజ్జ 4) ప్లీహం 37. ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండకోశంలోని కణాలు ఎన్ని గుంపులుగా చేరతాయి? 1) 7 2) 2 3) 4 4) 3 38. ఎలర్జీ సమయంలో పెరిగే తెల్ల రక్తకణాలు? 1) ఇసినోఫిల్స్ 2) న్యూట్రోఫిల్స్ 3) లింఫోసైట్స్ 4) మోనోసైట్స్ 39. కన్నుల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క? 1) క్యారట్ 2) రణపాల 3) బంగాళదుంప 4) చేమంతి 40. కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కానికి తోడ్పడే పుష్ప భాగం? 1) కేసరావళి 2) అండకోశం 3) ఆకర్షక పత్రావళి 4) రక్షక పత్రావళి 41. జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించుకునే శక్తి ఉన్నవి? 1) మొక్కలు 2) జంతువులు 3) మానవుడు 4) జీవులు 42. ఏ తెల్ల రక్తకణాల కేంద్రకం మూత్రపిండం ఆకారంలో ఉంటుంది? 1) మోనోసైట్స్ 2) లింఫోసైట్స్ 3) త్రాంబోసైట్స్ 4) ఎరిత్రోసైట్స్ 43. అంకురచ్చర రహిత విత్తనాలకు ఉదాహరణ? 1) వరి 2) బఠాణి 3) మొక్కజొన్న 4) ఆముదం 44. కణజాల వర్ధనంలో టోటిపొటెన్సీ దేనికి సంబంధించింది? 1) పత్రాలు 2) కాలస్ 3) ఎక్స్‌ప్లాంట్ 4) ఏదీకాదు 45. పిండకోశంలోని ప్రతిపాదక కణాల సంఖ్య? 1) 2 2) 3 3) 4 4) 5 46. క్యారట్ మొక్కల్లో చేసే ఛేదనాలు? 1) కాండం 2) వేరు 3) పత్రం 4) అన్నీ 47. దానిమ్మ, నిమ్మ, నారింజల్లో గూటి పద్ధతి ఒక? 1) నేల అంటు తొక్కడం 2) కొమ్మ అంట్లు 3) వేరు ఛేదనం 4) కాండ ఛేదనం 48. వేరు మొగ్గల నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేవి? 1) క్యారట్, వేప 2) క్యారట్, కరివేపాకు 3) వేప, కరివేపాకు 4) అన్నీ 49. కొంచెం గట్టిదారు ఛేదనాలకు ఉదాహరణ? 1) మందార, స్వర్ణగన్నేరు 2) డాలియా, పిసినిక 3) గులాబీ, జిరేనియం 4) డాలియా, జిరేనియం 50. కంటిలోని శంకులలో ఉండే వర్ణకం? 1) ఐడాఫ్సిన్ 2) ట్రిిపిన్స 3) పెప్సినోసిన్ 4) రాఢాఫ్సిన్ 51. శోషరసం ఏ వ్యవసకు చెందుతుంది? 1) జీర్ణ 2) విసర్జన 3) నాడీ మండలం 4) రవాణా 52. మనదేశంలో ఖజి+ శాతం? 1) 63 2) 7 3) 93 4) 50 53. పదార్థాల రవాణా, శరీర రక్షణ చర్యల్లో రక్తం ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడే ప్రోటీన్లు? 1) గ్లోబ్యులిన్లు 2) ఆల్బుమిన్‌లు 3) పొత్రాంబిన్ 4) పైబ్రినోజన్ 54. బ్యాక్టీరియా ద్విదావిచ్ఛిత్తి, శిలీంద్ర సిద్ధబీ జాశయంలో కేంద్రకాలు జరిపే విభజనలు వరుసగా? 1) క్షయ, సమ 2) క్షయ, క్షయ 3) సమ, సమ 4) సమ, క్షయ 55. అంకురచ్ఛద కేంద్రకం ఏ స్థితిలో ఉంటుంది? 1) త్రయ స్థితికం 2) ఏక స్థితికం 3) ద్వయ స్థితికం 4) చతుర స్థితికం 56. బొద్దింకలో ఎన్ని గదుల హృదయం ఉంటుంది? 1) 3 2) 11 3) 5 4) 13 57. ప్లాస్మాలో అ, ఆ ప్రతిరక్షకాలు లేని రక్త వర్గం? 1) B 2) A 3) O 4) AB 58. ఒక వ్యక్తి రక్తాన్ని మరో వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు? 1) ధమని 2) సిర 3) కండరాలు 4) వాయునాళం 59. పత్ర కోరకాల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుకునే మొక్క? 1) చేమంతి 2) ఆలుగడ్డ 3) కరివేపాకు 4) రణపాల 60. ద్వివలయ ప్రసరణ హృదయం ఉన్న జీవి? 1) వానపాము 2) బొద్దింక 3) చేప 4) కోతి 61. బ్లడ్ బ్యాంకులో నిర్జీవ స్థితిలో రక్తం గడ్డకట్ట కుండా ఉండటానికి ఉపయోగించే పదార్థం? 1) కాపర్ 2) సోడియం సిట్రైట్ 3) సోడియం నైట్రేట్ 4) హెపారిన్ 62. కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది? 1) ఆవర్ణిక 2) స్ట్రోమా 3) త్వచం 4) గ్రానా 63. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా ఏ కాంతిలో జరుగుతుంది? 1) ఎరుపు, నీలి 2) ఆకుపచ్చ, నీలి 3) అరుణ, నీలి 4) అరుణ, ఎరుపు 64. గ్లూకోజ్ ఫైరూవిక్ ఆమ్లంగా ఏర్పడే టప్పుడు పొందే నికర లాభం? 1) 38 అఖ్కీ అణువులు 2) 4 అఖ్కీ అణువులు 3) 36 అఖ్కీ అణువులు 4) 2 అఖ్కీ అణువులు 65. మైటోకాండ్రియాలో లోపలి ముడుతలను ఏమంటారు? 1) క్రిస్టే 2) మాతృక 3) ప్రాథమిక రేణువులు 4) స్ట్రోమా 66. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృధులాస్థి ఉంగరాల ఆకారం? 1) U 2) O 3) S 4) C 67. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది? 1) ఉదర వితానం 2) అంగిలి 3) ఉపజిహ్వక 4) ఏదీ కాదు 68. అమీబాలో శ్వాసక్రియ విధానం? 1) ఉచ్ఛ్వాసం 2) బాష్పీభవనం 3) విసరణం 4) ఆష్మాసిస్ 69. ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్లో ఏర్పడేది? 1) వాయు సహిత శ్వాసక్రియలో అఈ్క 2) వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ATP 3) సూర్యరశ్మిలో ఏర్పడే అఖ్కీ 4) అన్నీ 70. ఎడమ ఊపిరితిత్తిలోని తమ్మెల సంఖ్య? 1) 3 2) 2 3) 1 4) 4 71. సిరాసరణి లేని జంతువు? 1) కప్ప 2) చేప 3) సాలమండర్ 4) మానవుడు 72. గ్లూకోజ్ ఆక్సీకరణలో మొదటిదశ? 1) క్రెబ్స్ వలయం 2) సిట్రిక్ వలయం 3) గ్లెకాలసిస్ 4) కిణ్వనం సమాధానాలు 1) 4; 2) 3; 3) 2; 4) 2; 5) 4; 6) 4; 7) 3; 8) 1; 9) 3; 10)2; 11) 3; 12) 4; 13) 3; 14) 2; 15) 2; 16) 2; 17) 2; 18) 4; 19) 1; 20)1; 21) 4; 22) 4; 23) 2; 24) 3; 25) 3; 26) 1; 27) 4; 28) 3; 29) 3; 30) 3; 31) 3; 32) 4; 33) 2; 34) 4; 35) 3; 36) 4; 37) 4; 38) 1; 39) 3; 40) 3; 41) 1; 42) 1; 43) 2; 44) 3; 45) 2; 46) 2; 47) 2; 48) 3; 49) 4; 50) 1; 51) 4; 52) 3; 53) 1; 54) 3; 55) 1; 56) 4; 57) 4; 58) 2; 59) 4; 60) 4; 61) 2; 62) 2; 63) 3; 64) 4; 65) 1; 66) 4; 67) 1; 68) 3; 69) 2; 70) 2; 71) 4; 72) 3. -
బయాలజీ
సూక్ష్మజీవులు - వ్యాధులు లివెన్హుక్ 1674లో మొదటిసారి బ్యాక్టీరియాలను కనుక్కొన్నాడు. బ్యాక్టీరియాల గురించి చదివే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. లూయీపాశ్చర్ బ్యాక్టీరియాల ప్రాముఖ్యతను తెలిపాడు. మానవుల్లో కలిగే బ్యాక్టీరియల్ వ్యాధులు కలరా: బ్యాక్టీరియా పేరు: విబ్రియోకలరా వ్యాధి లక్షణాలు: దేహ నిర్జలీకరణం, కళ్లు గుంటలు పడటం, కండరాల నొప్పులు సంక్రమణ: కలుషిత ఆహారం, నీరు టైఫాయిడ్: బ్యాక్టీరియా పేరు: సాల్మోనెల్లాటైఫీ వ్యాధి లక్షణాలు: జ్వరం, తలభారం, పొట్టభాగం పచ్చిగా ఉండటం సంక్రమణ: కలుషిత నీరు, పాలు, ఆహారం డిప్తీరియా: బ్యాక్టీరియా పేరు: కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా వ్యాధి లక్షణాలు: తీవ్ర గొంతునొప్పి సంక్రమణ: ప్రత్యక్ష తాకిడివల్ల కోరింతదగ్గు/పెర్టుసిస్: బ్యాక్టీరియా పేరు: బోర్థిటెల్లా పెర్టుసిస్ వ్యాధి లక్షణాలు: ‘వూఫ్’ అనే శబ్దంతో దగ్గు, శ్లేష్మం సంక్రమణ: తుంపరల ద్వారా టెటానస్/ధనుర్వాతం: బ్యాక్టీరియా పేరు: క్లాస్ట్రీడియం టెటానై వ్యాధి లక్షణాలు: మెడ, దవడ కండరాలు బిగుసుకుపోవడం సంక్రమణ: తుప్పుపట్టిన సూదులు గుచ్చుకున్నప్పుడు క్షయ/టీబీ: బ్యాక్టీరియా పేరు: మైకోబ్యాక్టీరియం ట్యుబర్కులోసిస్ వ్యాధి లక్షణాలు: శ్వాసకోశాలు ప్రభావితం కావడం, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు సంక్రమణ: ప్రత్యక్ష తాకిడి, తక్కువ వెలుతురు గదుల్లో నివసించడం వల్ల కుష్ఠు: బ్యాక్టీరియా పేరు: మైకోబ్యాక్టీరియం లెప్రె వ్యాధి లక్షణాలు: వ్యాధిసోకిన భాగాలు స్పర్శను కోల్పోవడం(వేళ్ల చివరి భాగాలు) సంక్రమణ: అంటువ్యాధి కాదు, (దీర్ఘకాల సన్నిహిత సంబంధం వల్ల వ్యాప్తి చెందుతుంది) బొటులిజం(ఫుడ్ పాయిజన్): బ్యాక్టీరియా పేరు: క్లాస్ట్రీడియం బొటులినం వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు సంక్రమణ: పంకిలమైన ఆహారం వల్ల న్యుమోనియా: బ్యాక్టీరియా పేరు: డిప్లోకోకస్ న్యుమోనియా వ్యాధి లక్షణాలు: ఛాతిలో నొప్పి, ఆయసం సంక్రమణ: గాలి ద్వారా ప్లేగు: బ్యాక్టీరియా పేరు: అర్సినియాపెస్టిస్ వ్యాధి లక్షణాలు: జ్వరం, చర్మంమీద నల్లటి మచ్చలు సంక్రమణ: ఎలుకల ద్వారా మానవునికి సిఫిలిస్: బ్యాక్టీరియా పేరు: ట్రెపోనిమా పాలిడమ్ వ్యాధి లక్షణాలు: జననాంగాలపై పుండ్లు సంక్రమణ: అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీదే గెలుపు!
ముగిసిన తెప్పోత్సవాలు
పోలీసుల అదుపులో ఒడిశా వేటగాళ్లు
పిడుగుపాటుకు యువకుడికి గాయాలు
తిమ్మాపురంలో విజయ్ దేవరకొండ సందడి
అప్పన్నకు రెండవ విడత చందనం సమర్పణ
ఫ్లైఓవర్‌పై లారీ బోల్తా
ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు
కమనీయం.. కల్యాణోత్సవం
తప్పక చదవండి
- రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ఏముందంటే..
- ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చాల్సి ఉంది!
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్‌లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
Advertisement