-
'శాకుంతలం' సినిమాకు ఊహించని షాక్, తొలిరోజే ఇలా జరిగిందేంటి..
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ రోజే ఊహించని షాక్ తగిలింది. శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఎందుకంటే.. నేడు(ఏప్రిల్ 14)న డాక్టర్ బీఆర్ అబేద్కర్ జయంతి నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమయింది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఉండటంతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అక్కడే ఉన్న ఐమాక్స్ థియేటర్‌పై భారీ దెబ్బ పడింది. థియేటర్‌కు వచ్చే అన్ని దారులు మూసివేయడంతో శాకుంతలం షోలను రద్దు చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 5 గంటలకు వేసే బెనిఫిట్ షోతో పాటు సాయంత్రం 6 గంటల వరకు అన్ని షోలను రద్దు చేశారు.ఆ తర్వాత రాత్రి పది గంటల నుంచి యథావిధిగా షోలు నిర్వహించనున్నారు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం పేర్కొంది. An important update to our beloved fans & moviegoers in Hyderabad : Due to Dr. Ambedkar Statue Inauguration Tomorrow, all the shows at Prasads Imax have been Cancelled. Book your tickets accordingly in other screens!#Shaakuntalam in cinemas from Tomorrow! 🎟️… pic.twitter.com/TTjdOSloDT — Gunaa Teamworks (@GunaaTeamworks) April 13, 2023 -
‘శాకుంతలం’పై సమంత రివ్యూ
సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని తాజాగా నిర్మాతలు 'దిల్' రాజు, నీలిమా గుణతో కలిసి కలిసి సమంత వీక్షించింది. అనంతరం ఇన్‌స్టా వేదికగా ‘శాకుంతలం’పై రివ్యూ ఇచ్చింది. ‘ఫైనల్లీ... ఈ రోజు 'శాకుంతలం' సినిమా చూశా. చాలా అందంగా ఉంది. ఇదొక దృశ్య కావ్యం. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒక్కటైన శాకుంతలం కథకు గుణశేఖర్‌గారు ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చిన్న పిల్లలకు ఈ ప్రపంచం నచ్చుతుంది. ఇటువంటి సినిమా ఇచ్చిన దిల్ రాజు, నీలిమా గుణలకు థాంక్స్'అని సమంత రాసుకొచ్చింది. శాకుంతలం రివ్యూ చదివిన సమంత ఫ్యాన్స్...శాకుంతలంతో సమంత మరో హిట్ అందుకోనుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'శాకుంతలం' వాయిదా?
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 17న విడుదల కాబోతుంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్,అనన్య నాగల్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అర్హ ఈ చిత్రంతో డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. శాకుంతలం సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సమంతపై మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్
గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఓవైపు గ్రాఫిక్స్, మరోవైపు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సులతో ట్రైలర్ అదిరిపోయింది. శాకుంతలగా సమంత మేకోవర్, మణిశర్మ నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ , దుర్వాస మహర్షి పాత్రలో మంచు మోహన్ బాబు, భరతుడిగా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటిస్తోంది. (చదవండి: ఓపిక లేకపోయినా వచ్చాను.. సమంత ఎమోషనల్) తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సమంత అద్భుతంగా చేశావు. నాన్న దుర్వాస మహర్షి పాత్రలో నిన్ను చూడడం మంత్రముగ్ధులను చేసింది. అర్హ పాప భరతుడు పాత్రలో బాగా నటించావు’అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మింన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. . @Samanthaprabhu2, you nailed it with grace in #Shaakuntalam. 🙌🏻🤗 Nanna watching you as Durvasa Maharshi, has left me spellbound. 😍😍 Last and the cutest #Arha papa as #Bharathudu is a spectacle to watch out for!! ♥️https://t.co/iED4KfGNEm — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 9, 2023 -
పెళ్లికూతురిలా ముస్తాబైన గుణశేఖర్ కూతురు.. ఫోటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ పెళ్లి కూతురిలా ముస్తాబైంది. మరికాసేపట్లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. నేడు(శుక్రవారం)ఫలక్ నుమా ప్యాలెస్‌లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రవి ప్రఖ్యా అనే బిజిమెన్మ్యాన్ను నీలిమ వివాహం చేసుకోనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో గ్రాండ్‌గా జరిగింది. కాగా నీలిమ గుణ కూడా సినీ రంగంపై ఆసక్తితో నిర్మాతగా మారారు. తన తండ్రి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమ దేవి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాను నీలిమ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement