-
వందేళ్ల నాటి బైక్‌కి ఇంత క్రేజా.. కోట్లు పెట్టి మరీ..!
సాక్షి, ముంబై: 'హార్లే డేవిడ్సన్' ఈ పేరుకి ప్రపంచ మార్కెట్లో పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే అత్యంత ఖరీదైన వెహికల్ తయారీ సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచిన ఈ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం కూడా వాహనాలను తయారు చేసింది అని చాలా తక్కువమందికే తెలుసు. 1908వ సంవత్సరంలో అంటే సుమారు 110 సంవత్సరాల ముందు హార్లే డేవిడ్సన్ తయారు చేసిన ఒక వెహికల్ ఇటీవల వేలంలో అక్షరాలా రూ. 7 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజమే. 'ఓల్డ్ ఐస్ గోల్డ్' అంటే ఇదేనేమో.. నిజానికి ఆశ్చర్యం కలిగించే రీతిలో అమ్ముడైన ఈ 'హార్లే డేవిడ్సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్‌సైకిల్' అమెరికాలో లాస్ వెగాస్‌లో మెకమ్ వేలం ద్వారా విక్రయించారు. వేలం పాటలో ఇది 9,35,000 డాలర్లకు అమ్ముడు బోయింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ. 7.73 కోట్లు. ఈ రకమైన మోటార్ సైకిల్స్‌ని కంపెనీ 1908 లో కేవలం 450 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. అందులో ఒకటే ఇటీవల వేలం పాటలో విక్రయించబడిన హార్లే డేవిడ్సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్ సైకిల్. దాదాపు 110 సంవత్సరాల క్రితం మోటార్‌సైకిల్ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉండటం విశేషమే మరి. ఇందులో వీల్స్ , ఇంజిన్ బెల్ట్-పుల్లీ, మఫ్లర్ స్లీవ్, సీటు కవర్ , దాని ఆయిల్ ట్యాంక్ వంటి భాగాలను కూడా ఇందులో స్పష్టంగా చూడవచ్చు. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ వెహికల్స్ కంటే కూడా ఇది చాలా ఖరీదైనది స్పష్టంగా తెలుస్తోంది. -
హర్లే డెవిడ్సన్ బైక్‌పై బాలయ్య
చెన్నై: హీరో నందమూరి బాలకృష్ణ హర్లే డెవిడ్సన్ మోటార్ బైక్‌పై దూసుకుపోనున్నాడు. 'లెజెండ్' సినిమాలో బాలయ్య ఈ ఫీట్ చేయనున్నాడు. ప్రత్యేకంగా తయారుచేసిన పసుపు రంగు హర్లే డెవిడ్సన్ బైక్‌పై ఆయన ఓ పాటలో కనిపించనున్నారు. దీన్ని తయారుచేయడానికి రూ.20 లక్షలు ఖర్చు చేశారు. 'లెజెండ్'లో ఓ పాట కోసం దీన్ని స్పెషల్‌గా తయారు చేయించారని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. 'లెజెండ్' సంక్రాంతికి సందడి చేయనున్నాడు. 'సింహా' తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు
డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్‌రావు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement