-
హిమాచల్ ఫలితాలు: కాంగ్రెస్ విజయంపై స్పందించిన ఖర్గే
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ అప్డేడ్ 07: 00PM హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ముగిసింది. హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. మొత్తం 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. అప్డేడ్ 06: 30PM హిమాచల్ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం వెనక శ్రమించిన కార్యకర్తలు, పార్టీ నేతలకు కృతజ్ఙతలు తెలిపారు. వారి కృషి వల్లే ఈ ఫలితం లభించిందన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా తమకు సహకరించిందని తెలిపారు. సోనియా గాంధీ ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయన్నారు. ఈ విజయం క్రెడిట్ తను తీసుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సాధారణమని తెలిపారు. हिमाचल प्रदेश की जनता को इस निर्णायक जीत के लिए दिल से धन्यवाद। सभी कांग्रेस कार्यकर्ताओं और नेताओं को हार्दिक बधाई। आपका परिश्रम और समर्पण इस विजय की शुभकामनाओं का असली हकदार है। फिर से आश्वस्त करता हूं, जनता को किया हर वादा जल्द से जल्द निभाएंगे। — Rahul Gandhi (@RahulGandhi) December 8, 2022 కాగా హిమాచల్ ఎన్నికల్లో విజయం అందించినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.ఔ అప్డేడ్ 06: 00PM బీజేపీపై ఉన్న అభిమానానికి, పార్టీకి అందించిన మద్దతుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. I thank the people of Himachal Pradesh for the affection and support for the BJP. We will keep working to fulfil the aspirations of the state and raise people’s issues in the times to come. @BJP4Himachal — Narendra Modi (@narendramodi) December 8, 2022 అప్డేడ్ 04: 15PM హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించనుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. ప్రియాంక గాంధీ 10 పాయింట్ల మ్యానిఫెస్టో అక్కడ పనిచేసిందన్నారు. అయితే గుజరాత్ ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. ప్రచార సమయంలో పరిస్థితి భిన్నంగా ఉందని, బీజేపీకి ఊహించని విజయమని అన్నారు. 2012, 2017, 2022 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. అప్డేడ్ 03: 45PM కాంగ్రెస్ విజయం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. ఇప్పటికే 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 53 స్థానంలో గెలుపొందింది.. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నాయి. అప్డేడ్ 03: 15PM సీఎం జైరాం ఠాకూర్ రాజీనామా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై జైరాం ఠాకూర్ గెలుపొందినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి చెందడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. కసుంప్టి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత అనిరుధ్ సింగ్ మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి(బీజేపీ), రాష్ట్ర మంత్రి సురేష్ భరద్వాజ్‌పై 8,655 ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్డేట్ 3: 00PM హిమాచల్ ప్రదేశ్ మంత్రి రామ్ లాల్ మార్కండ ఓటమి చెందారు. లాహౌల్ &స్పితి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రవి ఠాకూర్ చేతిలో 1,616 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. అప్డేట్ 2: 300PM హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి(బీజేపీ రెబల్) అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు. అప్డేట్ 2: 00PM కాంగ్రెస్ దూకుడు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 24 సీట్లలో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 35ను చేరుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. అప్డేట్ 1: 10PM ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ ధీమా హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోందని, కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తీసుకురాబోమని, కానీ, వారిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ఏదైనా చేస్తుంది, ఏ స్థాయికైనా వెళ్తుందన్నారు. అప్డేడ్ 11: 25AM ఆధిక్యంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 36 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు.. బీజేపీ 28 సీట్లు, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అప్డేడ్ 11: 05AM రెబల్స్‌తో బీజేపీ చర్చలు హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మొత్తం 68 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 35 అవసరం. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింగి బీజేపీ. రెబల్స్‌తో చర్చలు చేపట్టింది. అందుకోసం వినోద్ తావ్డేను హిమాచల్‌కు పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ 32, కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇరు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండే అవకాశం ఉన్నందున రెబల్స్‌ను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఈ క్రమంలో ఆపరేషన్ లోటస్ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అప్డేట్ 10:30AM ► శాసన సభ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు తలో 32 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అప్డేట్ 9:50AM ► అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు తలో 33 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ ఇంకా ఖాతా తెరవలేదు. అప్డేట్ 9:25AM ► హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ 34, బీజేపీ 33, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరలవలేకపోయింది. అప్డేట్ 8:55AM ► పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ 33, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 22, కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ► హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 17, కాంగ్రెస్ 13 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. 11 గంటలకు ఫలితాలపై ఒక అంచనా వస్తుంది. హిమాచల్‌లో మొత్తం 68 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త రికార్డులు నెలకొల్పాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఈ హోరాహోరీ పోరులో గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది. డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇదీ చదవండి: ఎంసీడీ.. ఆప్, బీజేపీ మధ్య అధికార పోరుకు కొత్త వేదిక -
సామూహిక మతమార్పిడులకు పదేళ్ల జైలు
సిమ్లా: బలవంతపు మత మార్పిడుల నివారణకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. శనివారం అసెంబ్లీ ఆమోదించిన చట్ట సవరణ బిల్లు ప్రకారం.. ఒకే విడతలో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందిని బలవంతంగా లేదా మాయమాటలు చెప్పి మతం మార్పించిన వారికి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చు. మతం మారిన వారు తమ తల్లిదండ్రుల కులం, మతంకు సంబంధించిన ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేరు. ఈ మేరకు వారు ముందుగా డిక్లరేషన్ ఇవ్వాలి. సంబంధించిన బిల్లును అసెంబ్లీ మూజు వాణి ఓటుతో ఆమోదించింది. చదవండి: (చాటింగ్, హాట్ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా) -
అసెంబ్లీని కుదిపేసిన రేప్ కేసు
సిమ్లా: బాలిక హత్యాచార కేసు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఘటనపై చర్చ చేపట్టాలంటూ బీజేపీ పట్టుబట్టడం.. అందుకు స్పీకర్ అంగీకరించకపోవటంతో సభలో గందరగోళం నెలకొనగా, చివరకు సభ వాయిదా పడింది. జూలై మొదటి వారంలో సిమ్లా కొట్ఖాయ్ పట్టణంలో 16 ఏళ్ల బాలిక అతి దారుణంగా అత్యాచారం ఆపై హత్యకు గురైన విషయం తెలిసింది. ఘటన వెనుక ఆరుగురు సంపన్న కుటుంబానికి చెందిన యువకులు ఉన్నారంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. అంతేకాదు నేరస్థుల ఫోటోలు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ కూడా అయ్యాయి. అయినప్పటికీ సరైన సాక్ష్యాలు లేవంటూ పోలీసులు చెబుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశం విధాన సభను కుదిపేసింది. నోటీసులు ఇచ్చినప్పటికీ అంశంపై స్పందించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదంటూ బీజేపీ ఆరోపించింది. దీనికి తోడు స్పీకర్ బ్రిజ్ బిహరి లాల్ భుటాలి కూడా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున నివేదిక వచ్చాకే చర్చించాలని సూచించటంతో ప్రతిపక్షం స్వరం పెంచి నినాదాలు చేసింది. దీంతో స్పీకర్ 15 నిమిషాలు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి మారకపోవటంతో చివరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇక సభ వాయిదాతో బీజేపీ అసెంబ్లీ బయట ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ప్రతిపక్ష నేత ప్రేమ్‌కుమార్ దుమాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోపక్క ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నా గుడియా న్యాయ మంచ్ సంఘం రేపు అసెంబ్లీ బయట నిరసనకు పిలుపునిచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement