-
బాబుకు గుండెలో రంధ్రాలు... పూడుకుపోతాయా?
మా బాబు పుట్టిన రెండు నెలల తర్వాత బాగా జలుబుగా ఉన్నట్లు అనిపిస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. కొన్ని పరీక్షలు చేసి, బాబు గుండెలోపల రెండు రంధ్రాలు ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. ‘చిన్న వయసు కదా... వాటంతట అవే పూడుకుంటాయి’ అన్నారు. మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. మీరు బాబుకు గుండెలో రంధ్రాలున్నాయంటూ చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ బాబుకు ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్డీ... అంటే గుండె పై గదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. ఇలా గుండె గదుల్లోని గోడలపై రంధ్రాలు ఉన్న సమస్యతో పిల్లలు నీలంగా మారిపోతూ (సైనోసిస్) ఉంటే అలాంటప్పుడు పిల్లలకు తక్షణం శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో గుండె గదుల గోడలకు రంధ్రాలు ఉండీ, పిల్లలు నీలంగా మారనప్పుడు, శ్వాసకోశానికి సంబంధించిన ఇతరత్రా సమస్యలు ఏవీ లేకుండా తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు. అయితే అలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి చికిత్స అవసరమన్నది ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి ఉంటుంది. ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యల (అసోసియేటెడ్ కార్డియాక్ డిఫెక్ట్స్)పైన కూడా ఆధారపడి ఉంటుంది. గుండె పై గదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 శాతం నుంచి 70 శాతం మందిలో ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 శాతం నుంచి 40 మందిల్లోనూ ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పలేం. ఇలా గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు ఉన్న పిల్లలకు తరచూ నెమ్ము రావడం చూస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలకు తక్షణ చికిత్స అవసరం. మీరు మీ అబ్బాయిని కనీసం ప్రతి ఆర్నెలకు ఒకసారి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. ఒకవేళ గుండె గదుల మధ్యనున్న రంధ్రాలు వాటంతట అవే మూసుకోకపోయినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స సహాయంతో – శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండానే మందులతో దాదాపు 90 శాతం నుంచి 95 శాతం సక్సెస్‌రేట్‌తో సమర్థంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌తో ఫాలోఅప్‌లో ఉండండి. మూత్రంలో ఎరుపు కనిపిస్తోంది...? మా బాబుకి తొమ్మిదేళ్లు. మూడు నెలల కిందట బాబుకి మూత్రంలో రక్తం పడింది. అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంసీయూ... ఇలా కొన్ని టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్ నార్మల్ అనే వచ్చాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ అని యాంటీబయాటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు మళ్లీ బాధ పడుతున్నాడు. వారం కిందట మళ్లీ మూత్రంలో రక్తం పడింది. డాక్టర్ దగ్గరకెళితే మళ్లీ పరీక్షలు చేశారు. అవి కూడా నార్మలే. మా బాబుకు ఉన్న సమస్య ఏమిటి? ఇలా మాటిమాటికీ రక్తం ఎందుకు పడుతోంది? దయచేసి సలహా ఇవ్వండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సా«ధారణమైన సమస్య. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకూ ఎలాంటి ప్రమాదం ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచన. పిల్లల యూరిన్‌లో రక్తం కనబడటానికి గల కొన్ని కారణాలు మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యునలాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ కాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా కాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ప్రధానం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి. మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్‌లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండటం ముఖ్యం. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను మీ డాక్టర్‌తో మరోసారి చర్చించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. ఇన్నిసార్లు కామెర్లా? మా అబ్బాయికి మూడేళ్లు. గత ఎనిమిది నెలల్లో వాడికి మూడు సార్లు కామెర్లు వచ్చాయి. మాది ఓ మోస్తరు టౌన్. మూడుసార్లూ ఇక్కడే డాక్టర్‌కు చూపించి చికిత్స చేయించాం. గత వారం రోజులుగా మళ్లీ కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మా వాడికి ఎందుకు ఇలా జాండీస్ పదే పదే వస్తోంది. కొందరు పెద్దలు చెప్పిన మీదట కొన్ని పసరు మందులు కూడా వాడుతున్నాం. మా బాబుకు కామెర్లు మాటిమాటికీ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మాకు సలహా ఇవ్వండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి దీర్ఘకాలిక కామెర్లు ఉన్నాయని చెప్పవచ్చు. పసిపిల్లల నుంచి వివిధ వయసుల వారిలో వచ్చే దీర్ఘకాలిక కామెర్లకు అనేక కారణాలుంటాయి. వీటిలో కొన్ని చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉంది. పిల్లల్లో కొన్ని ఎంజైమ్ లోపాలు, నాటుమందులు వాడటం, వైరల్ హెపటైటిస్, థలసేమియా వంటి రక్తానికి సంబంధించిన జబ్బులు, కాపర్ మెటబాలిజమ్‌లో లోపం, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా కామెర్లు రావచ్చు. కొన్నిసార్లు హెపటో బిలియరీ సిస్టమ్‌లోని కొన్ని అనటామికల్ (శరీర నిర్మాణపరమైన లోపాలతో వచ్చే) సమస్యల వల్ల కూడా జాండీస్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబు దీర్ఘకాలిక జాండీస్‌కు కారణం ఇదీ అని నిర్ధారణగా చెప్పడం కష్టమే. కాబట్టి మీరు కొన్ని ప్రాథమిక రక్తపరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, ఎంజైమ్ పరీక్షలు చేయించాలి. దానితో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం, ఇతర మెటబాలిక్ సమస్యలను కనుగొనేందుకు అవసరమైన పరీక్షలు చేయించడం ప్రధానం. ఎందుకంటే పైన పేర్కొన్న కొన్ని మెడికల్ కండిషన్స్‌కు అవసరమైతే లివర్ బయాప్సీ వంటి పరీక్షలు చేసి తక్షణమే తగు చికిత్స చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్ లేదా కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యల కారణంగా వచ్చే కాలేయ వ్యాధులకు పరిష్కారం ఒకింత తేలిక. వాటిని సరైన చికిత్సతో పూర్తిగా విజయవంతంగా పరిష్కరించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లివర్ సమస్యల పురోగతిని నియంత్రించడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లివర్ ఫెయిల్ కాకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అదృష్టవశాత్తు మీ అబ్బాయికి లివర్ ఫెయిల్యూర్ సూచనలు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి మీరు మీ అబ్బాయి విషయంలో తక్షణం మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు పీడియాట్రిక్ గాస్ట్రో ఎంటరాలజిస్ట్ నేతృత్వంలో పూర్తి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. -
రెక్కలే రాని సీతాకోకచిలుక
పెరట్లో పూలమొక్కలను పరిశీలించి చూస్తోంది పింకీ. గన్నేరు చెట్టు ఆకు మీద ఏదో అతుక్కుని ఉన్నట్లనిపించింది. అమ్మని పిలిచి అదేమిటని అడిగింది. ‘‘అది సీతాకోకచిలుక గుడ్డులా ఉంది. దాన్ని ఏమీ చేయకు. ప్రతిదీ నీకే కావాలి. వెళ్లి చదువుకోపో’’ అని కోప్పడింది అమ్మ. ఓహో! ప్యూపా దశ అన్నమాట అని స్కూలు పాఠాన్ని గుర్తు చేసుకుంది పింకీ. అంతలోనే అమ్మ గద్దింపుతో చిన్నబుచ్చుకున్న పింకీ దగ్గరకు వెళ్లింది నానమ్మ. తనను బుజ్జగిస్తూ, చెవిలో ఏదో చెప్పింది. సంతోషంతో పింకీ కళ్లు మెరిశాయి. అమ్మ చూడకుండా ఆకును తెంచి, పాత జామెట్రీబాక్స్‌లో పెట్టింది. దానికి గాలి ఆడేందుకు వీలుగా పైన చిన్న రంధ్రాలు చేసింది. కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు పొద్దున్నే లేచిన పింకీ అగ్గిపెట్టె తెరిచేసరికి గుడ్డులో కదలిక కనపడింది. కాసేపటికి చిన్ని సీతాకోకచిలుక నెమ్మదిగా ఆ గుడ్డును పగులగొట్టుకుని బయటకు రావడం కనిపించింది. మరికొద్దిసేపటిలో దాదాపు ముప్పాతిక భాగం పైగా గుడ్డు నుంచి బయటికొచ్చింది. అయితే కొద్దిభాగం గుడ్డుకే అతుక్కుని ఉండడంతో దానికి సాయం చేద్దామని ఒక కత్తెర తెచ్చి నెమ్మదిగా దాన్ని కత్తిరించింది పింకీ. దాంతో పూర్తిగా బయటికొచ్చేసింది సీతాకోకచిలుక. అయితే ఎందుకోగాని అది ఎగరాలని ప్రయత్నించడం, ఎగరలేక కిందపడిపోవడం... జరుగుతుండేసరికి దీని సంగతి సాయంత్రం చూద్దాం లే అని బడికెళ్లిపోయింది. సాయంత్రం రాగానే బాక్స్ తెరిచి చూసింది. పాపం! దాని రెక్కలు సగం సగమే ఉన్నాయి. రెండు కాళ్లు కూడా లేవు. అందుకే అది ఎగరలేకపోతోందన్నమాట! బిక్కముఖం వేసింది పింకీ. వెక్కుతూ నానమ్మ దగ్గరకు వెళ్లింది. పింకీ చెప్పినదంతా విన్న నానమ్మ తనను దగ్గరకు తీసుకుని తలనిమురుతూ, ‘‘గుడ్డు నుంచి బయటికొచ్చేటప్పుడు దానిని పగలగొట్టుకునేందుకు చేసే ప్రయత్నమే దానికి తగిన బలాన్నిస్తుంది. నువ్వేమో సాయం చేద్దామనుకుని దాన్ని కత్తిరించేశావు. అందుకే దానికి రెక్కలు సరిగా రాలేదు. ఇప్పుడైనా కొంచెం ఓపిక పట్టు. కొన్నాళ్లకు బలం పుంజుకుని అదే ఎగిరిపోతుందిలే’’ అని బుజ్జగించింది. ‘సరే’నన్నట్లు తలూపింది పింకీ. ప్రతి ప్రాణికీ జీవించడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలను ప్రకృతే ప్రసాదిస్తుంది. మనం అర్థం చేసుకుని ఓపిక పట్టాలి. పిల్లల హోమ్ వర్క్ తామే చేయడం, వారి పుస్తకాల సంచిని తామే మోయడం, ఆటలాడుకుంటే దెబ్బలు తగులుతాయని ఎక్కడికీ పంపకపోవడం వంటి వాటి వల్ల పెద్దయినా వారిలో ఏ పనీ సొంతగా చేయలేకపోవడం, అతి సుకుమారంగా తయారు కావడం వంటివి జరుగుతాయి. అలాగని పూర్తిగా వదిలేయమని, సాయం చేయవద్దనీ కాదు. ఎంతవరకో అంతే చేయాలి. – డి.వి.ఆర్. -
పిల్లల హార్ట్‌లోని రంధ్రాలు
పిల్లల్లో గుండెలో రంధ్రాల సాధారణంగా రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్డీ... అంటే గుండె పై గదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. వీటి వల్ల పిల్లలకు ఉండే లక్షణాలు... పాలు తాగలేకపోవడం, ఆయాసం, పెరుగుదల సరిగా లేకపోవడం, ఊపిరితిత్తుల్లో నెమ్ము రావడం సాధారణంగా కనిపిస్తాయి. కొందరిలో రక్తనాళాల సమస్య వల్ల నీలంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ పిల్లలకు తక్షణ శస్త్రచికిత్స అవసరం. పాలు తాగలేకపోవడం, ఆయాసం, పెరుగుదల సరిగా లేకపోవడం, ఊపిరితిత్తుల్లో నెమ్ము రావడం... ఈ సమస్యలకు చికిత్స అనేది రంధ్రం పరిమాణం, స్థానాన్ని బట్టి చికిత్స చేస్తారు. అవి వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి, ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యలపై ఆధారపడి ఉంటుంది. గుండె పై గదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 శాతం నుంచి 70 శాతం మందిలో అవి వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 శాతం నుంచి 70 మందిలోనూ స్థానాన్ని బట్టి ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయ నేందుకు అవకాశం ఉండదు. పిల్లల్లో గుండె రంధ్రాలు ఉన్నప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. అంటే ప్రత్యేకంగా పిల్లలకోసం ఉండే గుండె చికిత్స నిపుణులు అన్నమాట. కొందరిలో అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. అయితే అది వెంటనే చేయాలా లేక కాస్తంత వ్యవధి తీసుకోవచ్చా అన్నది పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ నిర్ణయిస్తారు. సరైన సమయంలో చికిత్స చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.లేకపోతే ఊపిరితిత్తులు కూడా పాడై పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానం సహాయంతో ఆపరేషన్ లేకుండానే చాలా వరకు రంధ్రాలను మూయవచ్చు. -
నీటిసంరక్షణ గుంతలతో సత్ఫలితాలు
పెరుగుతున్న నీటి మట్టం కాంటూర్ కందకాల్లో జలకళ ఎల్లారెడ్డిపేట : సిరిసిల్ల మెట్ట ప్రాంతంలోని అడవుల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, కాంటూర్ కందకాల తవ్వకం, రాతి కట్టడాలు, చిన్నపాటి నీటి ఊటకుంటలు జలకళ సంతరించుకున్నాయి. ‘నీరున్న చోటే పంటలు పండుతాయ్.. చెట్లు ఉంటే వానలు పడుతాయ్’ నినాదాన్ని నిజం చేస్తున్నాయి. చెట్లు ఉన్న చోటే వర్షాలు పడతాయని సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అంతకు ముందే.. వీర్నపల్లి, కంచర్ల, అల్మాస్పూర్, మద్దిమల్ల, రంగంపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చిన్ననీటి ఊటకుంటలు, కాంటూర్ కందకాలు నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నీరు బూమిలోకి ఇంకుతోంది. బోర్లు, బావులతోపాటు చిన్ననీటి వనరుల్లో నీటి మట్టం పెరుగుతోంది. వర్షాలతో జలకళ వీర్నపల్లి అటవీ సెక్షన్లో గతేడాది నీటి నిల్వ సంరక్షణ పనులు చేపట్టారు. సుమారు 5,500 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీప్రాంతంలో దాదాపు 2,250 కాంటూర్ కందకాలు, రెండు చిన్ననీటి ఊటకుంటలు, 49 రాతి కట్టడాలు నిర్మించారు. కాంటూర్ కందకాల్లో చేరిన వర్షపునీరు భూమిలో ఇంకుతోంది. దిగువన ఉన్న ఒర్రెలు, కాలువల్లో ఊటలు నీటితో జలకళను సంతరించుకున్నాయి. అటవీ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోవుతోంది. అటవీ గ్రామాల్లోనూ జోరువానలు కురుస్తున్నాయి. రాతి కట్టడాలతో వర్షపునీరు నెమ్మదిగా ప్రవహిస్తుండడంతో భూసారం కొట్టుకుపోకుండా, భూమి కోతకు గురికావడంలేదు. వన్య ప్రాణులకు పుష్కలంగా తాగునీరు లభిస్తోంది. సమీప గ్రామాల్లోనూ సాగునీటికి కొదవలేకుండాపోయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement