-
హా అంటారా... హడలిపోతారా!
అందాల తారలు భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ అందం వెనక ఎంత ట్రాజెడీ ఉండి ఉంటే.. భయపెట్టాలనుకుని ఉంటారో ఊహించవచ్చు. అలా భయపెట్టే కథలతో కొందరు కథానాయికలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ప్రేక్షకులు ‘హా’ అంటూ హడలిపోతారా చూడాలి. ఇక ఈ హారర్ స్టోరీలపై ఓ లుక్ వేయండి. ‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’... ఇలా వీలై నప్పుడల్లా వెండితెరపై ఆడియన్స్‌ని భయ పెట్టారు హీరోయిన్ నయనతార. తాజాగా నయనతార గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరో హారర్ మూవీ ‘కనెక్ట్’. నయనతారతో 2015లో ‘మాయ’ సినిమా తీసిన అశ్విన్ శరవణన్యే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు హారర్ జానర్‌పై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాజల్ డైరీలో మూడు హారర్ సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా యోగిబాబు, దర్శక–నటుడు కేఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘోస్టీ’. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా, కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. అలాగే తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ‘కరుంగాప్పియమ్’ అనే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు కాజల్ అగర్వాల్. కాజల్‌తో పాటు ఈ సినిమాలో రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్ నటించారు. ఈ చిత్రంలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న యువతి పాత్రలో కాజల్ కనిపిస్తారు. ఇక హారర్ జానర్లో వచ్చిన చిత్రాల్లో ‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసుయే మలి భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌లో రజనీకాంత్ నటించగా, ‘చంద్రముఖి 2’లో రాఘవా లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. మరోవైపు వెండి తెరపై ఇప్పటివరకు గ్లామరస్‌గా కనిపించిన హన్సిక కూడా హారర్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘గార్డియన్’ అనే హారర్ ఫిల్మ్‌కు హన్సిక సైన్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. శబరి–గురుశరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్. కన్నన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న హారర్ సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాయ్‌లక్ష్మీ ‘సిండ్రెల్లా’గా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. వినో వెంకటేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాక్షీ అగర్వాల్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా.. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరోసారి ప్రేతాత్మగా కనిపించనున్నారని, ఈ సినిమాకు ‘స్త్రీ’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హారర్ బ్యాక్‌డ్రాప్‌లోనే మరికొందరు కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. -
హారర్ చిత్రంగా రమ్
కోలీవుడ్‌లో హారర్ కథా చిత్రాలకు ఆదరణ ఏ మాత్రం కొరవడలేదనడానికి నిదర్శనం ఆ తరహా చిత్రాల నిర్మాణాలు ఎక్కువ కావడమే. తాజాగా రమ్ అనే చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంతకు ముందు మసాలాపడమ్ చిత్రాన్ని అందించిన ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ అధినేత టి.విజయరాఘవేంద్ర నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. నవ దర్శకుడు సాయ్భరత్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో హృషికేష్, సంచితశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మియా, అంజత్‌ఖాన్, అర్జున్ చిదంబరం ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హాస్య నటుడు వివేక్, అంజాదే చిత్రం ఫేమ్ నరేన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సందర్భంగా చిత్రం వివరాలను నిర్మాత విజయరాఘవేంద్ర తెలుపుతూ చిత్రంలో హీరోగా నటిస్తున్న హృషికేష్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఈ కథ వినగానే నో అని చెప్పలేకపోయానన్నారు.అంత సంతృప్తి కలిగించడంతో వెంటనే షూటింగ్ మొదలెట్టేద్దాం అని చెప్పానన్నారు. హారర్ క్రైమ్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్ర కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుందన్నారు. ప్రముఖ హాస్యనటుడు వివేక్ నటిస్తున్న తొలి హారర్ చిత్రం ఇదే కావడం విశేషం అన్నారు. అదే విధంగా నటుడు నరేన్ చాలా వైవిధ్యపాత్రలో కనిపించనున్నారని చెప్పారు. వేదాళం, నానుమ్ రౌడీదాన్, తంగమగన్ వంటి వరుస విజయాలు సాధించిన యువ సంగీత దర్శకుడు అనిరుద్ తమ చిత్రానికి సంగీత భాణీలు కట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇది యూత్ టీమ్ రూపొందిస్తున్న చిత్రం అని కచ్చితంగా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించే చిత్రంగా రమ్ ఉంటుందని అన్నారు. -
కుటుంబ కథలో... హారర్ క్వీన్
అందచందాలతో అందరినీ ఆకర్షిస్తూ వచ్చిన బిపాసా బసు ఈ మధ్య వరుసగా హారర్ కథా చిత్రాలకే పరిమితమవుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఆ పాత్రలు బిపాసాకు కూడా బోర్ కొట్టినట్లున్నాయి. తాజాగా ఆమె తన రూటు మారుస్తున్నారు. ‘‘ఇప్పుడు హారర్ కథా చిత్రాలకు కాస్తంత విరామం ఇస్తూ, ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నా’’ అని 36 ఏళ్ళ బిపాసా వెల్లడించారు. ఈ కొత్త చిత్రం గురించి ఆమె చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మాటే చెబుతూ, ‘‘ఇక నుంచి ఎప్పుడూ హారర్ కథా చిత్రాలే చేస్తారేంటి అన్న ప్రశ్నకు ఇక దూరంగా ఉండచ్చు ’’ అని ఈ బాలీవుడ్ హారర్ క్వీన్ నవ్వేశారు. ఆమె నటించిన తాజా హారర్ చిత్రం ‘ఎలోన్’ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘‘నిజానికి, హారర్ చిత్రాలలో నటించకూడదని ఆ మధ్య అనుకున్నా. అందుకే ‘ఎలోన్’ చిత్రంలో నటించడానికి సంకోచించాను. కానీ స్క్రిప్ట్ చదివాక నో చెప్పాలని అనిపించలేదు’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement