-
టెక్నాలజీని ఆమె బాగా వాడారు.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ అయిన ఓ వీడియో వైరల్ గా మారింది. పైగా సెలబ్రిటీల మనసు దోచుకుంటోంది. 'నాన్నకు ప్రేమతో' మూవీలో 'ఐ వాన్నా ఫాలో ఫాలో యూ..' అనే పాటలో హీరో ఎన్టీఆర్ ఓ హోవర్ బోర్డుపై కదలడం చూశారు కదూ. అయితే అంతగా ఈ టెక్నాలజీ మనకు అందుబాటులోకి రాకున్నా ఓ ప్రాంతంలో మాత్రం ఈ హోవర్ బోర్డును ఓ మహిళ వినూత్నంగా ఉపయోగించారు. అలాగని తారక్ లాగ రోడ్లపై ఆమె ముందుకు సాగిపోలేదు. ఓ మహిళ హోవర్డ్ బోర్డుపై కూర్చుని తన ఇంటి ఆవరణలో శుభ్రం చేస్తుంటే ఆమె సన్నిహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక క్షణాల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. 'టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించారు. భారత్ ముందుకెళ్తుంది, మాడ్రన్ టైమ్స్ అంటూ' నటి మంచు లక్ష్మీ కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు. డిజిటల్ ఇండియా అంటే ఇదేనేమో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో అంతగా ఆకట్టుకుంటోంది. Technology used at its best! 😎 Totally made my day.. 🤣 #ModernTimes #AageBadhRahaIndia pic.twitter.com/WU99DtgJaV — Lakshmi Manchu (@LakshmiManchu) 4 October 2017 -
టెక్నాలజీని ఆమె బాగా వాడారు.. వైరల్ వీడియో
-
కొత్త చరిత్రకు నాంది.. సైనికులు గాల్లో ఇలా..!
'హోవర్‌బోర్డ్' ఈ పేరు వినే ఉంటారు కదా. దీని గురించి పిల్లలకు బాగా తెలుసు. వారు టీవీల్లో వీక్షించే సూపర్‌హీరో ప్రోగ్రామ్స్‌లో ఇది ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటుంది. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ హోవర్బోర్డును చూపించారు. అయితే ఇప్పటివరకూ సినిమాల్లో హీరోయిక్ సన్నివేశాలకు పరిమితమైన హోవర్‌బోర్డు టెక్నాలజీని దేశ రక్షణ కోసం వాడబోతున్నారు. అవును. ఫ్రాంకీ జపట అనే కంపెనీ ఈ మేరకు అమెరికాకు ప్రతిపాదనలు కూడా చేసింది. గంటకు 93 మైళ్ల టాప్ స్పీడ్‌తో ఈ హోవర్ బోర్డులు గాల్లో ఎగురుతాయని తెలిపింది. సైనికుల కోసం ప్రత్యేకంగా హోవర్బోర్డులు తయారు చేస్తామని అమెరికా రక్షణ శాఖకు ఫ్రాంకీ ప్రతిపాదించింది. కాగా, దీనిపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. హోవర్బోర్డులను సైనికులు వినియోగించడానికి అమెరికా అనుమతిస్తే రక్షణ రంగంలో కొత్త యుగానికి నాంది పలికినట్లు అవుతుంది. ఓ వ్యక్తి హోవర్‌బోర్డు మీద ఎగురుతున్న వీడియో క్లిప్‌ను ఫ్రాంకీ విడుదల చేసింది. అయితే, బోర్డు ఎలా పని చేస్తుంది తదితర వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. ఫ్రాంకీ విడుదల చేసిన వీడియోలో బోర్డు మీద ఉన్న వ్యక్తి బీచ్‌లో వేగంగా ఎగురుతూ విన్యాసాలు చేశాడు. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ టెక్నాలజీ రక్షణ రంగానికి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో యుద్ధాలకు సైనికులు హోవర్బోర్డుల మీద వెళ్తే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించండి. కౌంటర్ టెర్రరిజానికి హోవర్‌బోర్డు టెక్నాలజీ బాగా ఉపయోగపడేలా కనిపిస్తోందపడం అతిశయోక్తి కాదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
ది లీడర్..!
టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement