-
ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యానికి ముకుతాడు వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డొనేషన్లు, ఫీజులు కనీస వసతులతో పాటు నిర్వహణ తీరుతెన్నులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమైంది. సీసీ కెమెరాల నిఘా నడుమ పాఠశాల నిర్వహణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మండలం యూనిట్‌గా ఆయా పాఠశాల వ్యవహారంపై సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాల అనుమతి పునరుద్ధరించే సమయంలో చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. పాఠశాలకు అనుమతి రెన్యువల్ చేయడమో.. లేక తిరస్కరించడమో చేయనుంది. నిబంధనలు తూచ తప్పకుండా పాటించే విధంగా షరతులను అనుమతికి కొర్రీగా పెట్టనుంది. నిబంధనలు అమలు చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర స్కూళ్లపై కూడా.. ►స్టేట్ సిలబస్‌తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్‌పై కూడా పర్యవేక్షణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. స్టేట్ సిలబస్ పాఠశాలపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులది ఉండగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపునకు మాత్రం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) మాత్రమే జారీ చేస్తోంది. ►ఈ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్ఓసీ సైతం ఉపసంహరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఫీజులపై దృష్టి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు దండుకునే విషయంలో చూపే శ్రద్ధ.. మౌలిక వసతులను కల్పించడంలో లేకపోవడం సర్వసాధారణంగా తయారైంది. ►ప్రైవేటు యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలా ఉంచుతున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి.. ►ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. ►కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఒత్తిళ్లు, పలుకుబడితో అనుమతులు లభించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతుల జారీ అనుమానాలకు తావిస్తోది. -
నాసర్ స్కూల్ గెలుపు
ఐసీఎస్ఈ ప్రాంతీయ స్పోర్ట్స్ మీట్ సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ స్కూల్స్ 23వ ప్రాంతీయ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని ఐసీఎస్ఈ స్కూళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలిరోజు జరిగిన హాకీ మ్యాచ్‌లో నాసర్ స్కూల్ (బాలుర) జట్టు 6-2 తేడాతో సెయింట్ జోసెఫ్ స్కూల్ (హబ్సిగూడ)పై గెలుపొందింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నాసర్ జట్టు.. చివరిదాకా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని కట్టడి చేసింది. కెప్టెన్ షాలాన్ సిద్దిఖ్, మొహియుద్దీన్లు రెండేసి గోల్స్‌ను అందించగా, అలీ అజీజ్, ఆదిల్ అన్సారి చెరో గోల్ సాధించి నాసర్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. సెయింట్ జోసెఫ్ జట్టు తీవ్రంగా పోరాడినా.. రెండు గోల్స్‌తోనే సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాసర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మీర్ ఖుత్బుద్దీన్ ఖాన్ పాల్గొని టోర్నీని ప్రారంభించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్‌తో 'సలార్' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- 'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
- రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement