-
జపాన్‌లో మంచుగూళ్ల సంబరాలు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా!?
జపాన్‌లో ఏటా మంచుగూళ్ల సంబరాలు జరుగుతాయి. నెల్లాళ్ల పాటు జరిగే ఈ సంబరాల్లో జపాన్ ప్రజలు బాగా హిమపాతం జరిగే ప్రదేశాల్లో మంచుగూళ్లు నిర్మించుకుని, వాటిలో గడుపుతూ విందు వినోదాలతో ఓలలాడతారు. ‘యునిషిగవా ఓన్సెన్ కమకురా’ పేరిట జరుపుకొనే ఈ సంబరాలు ‘స్నో హౌస్ ఫెస్టివల్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందాయి. ఈ ఏడాది ఈ సంబరాలు జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో మంచు దట్టంగా పేరుకునే ప్రదేశాల్లో ‘ఇగ్లూ’ల మాదిరిగా మంచుతోనే చిన్న చిన్న గూళ్ల వంటి ఇళ్లు నిర్మించుకుని, వాటిలోనే తాత్కాలికంగా బస చేస్తారు. రాత్రివేళ వాటిలో పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించి, పరిసరాలను దేదీప్యమానం చేస్తారు. జపాన్‌లోని షింటో మతస్థుల దేవుడు ‘కమకురా దైమ్యోజిన్’ గౌరవార్థం ఈ సంబరాలను జరుపుకొంటారు. ఈ సంబరాల్లో షింటో మతస్థుల జలదేవత ‘సుయిజిన్’కు ప్రత్యేక పూజలు జరుపుతారు. జపాన్ను పన్నెండో శతాబ్ది నుంచి పద్నాలుగో శతాబ్ది వరకు పరిపాలించిన ‘కమకురా షొగునటే’ పాలకుల కాలం నుంచి షింటో మతస్థులు ఈ వేడుకలను జరుపుకొంటూ వస్తున్నారు. ఆనాటి రాచరిక ఆచార వ్యవహారాలను తలపించేలా ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంబరాల్లో భాగంగా యోకోటే నగరంలో ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు జరిపే కార్యక్రమాలను జానపద సాంస్కృతిక వారసత్వ కార్యక్రమంగా జపాన్ సాంస్కృతిక శాఖ గుర్తించింది. ఇవి కూడా చదవండి: కొంపముంచిన స్టంట్: ఏకంగా 29వ అంతస్థు నుంచి -
ప్రపంచంలోనే పెద్ద ఇగ్లూ కఫే
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఇగ్లూ (మంచు) కఫే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వెడల్పున్న ఈ కఫే 40 మందికి ఆతిథ్యమివ్వగలదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇగ్లూ కఫే అని ఓనర్ సయ్యద్ వసీం షా చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం స్విట్జర్లండ్లో చూసిన ఇలాంటి హోటళ్లు, కఫేలే దీని రూపకల్పనకు స్ఫూర్తి అన్నారు. ‘‘గతేడాది కూడా 4 టేబుళ్లతో 16 మంది కూచునేలా ఆసియాలోకెల్లా అతి పెద్ద ఇగ్లూ కఫే ఏర్పాటు చేశా. ఈసారి 10 టేబుళ్లకు, 40 మంది సామర్థ్యానికి పెంచాం. దీన్ని 25 మంది 64 రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి ఐదడుగుల మందంతో కట్టారు. ఇది మార్చి 15 దాకా కరగకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ తర్వాత మూసేస్తాం’’ అని వివరించారు. -
కొత్తవి ఖతర్నాక్..
పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్తరకం గ్యాడ్జెట్లను తయారుచేస్తున్నారు. మానవజీవితాల్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో వీటిని రూపొందిస్తున్నారు. వాటిలో కొన్ని మార్కెట్లోకి దూసుకొచ్చి విజయవంతమవుతున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం అనేక కొత్త ఉత్పత్తులు మార్కెట్లో దూసుకొస్తున్నాయి. ఇటీవల వినియోగంలోకి వచ్చిన కొన్ని కొత్త గ్యాడ్జెట్ల గురించి తెలుసుకుందాం.. ఈగ్లూ.. ఇది కొత్తతరం ఎకోఫ్రెండ్లీ రూమ్ హీటర్. ఇప్పటికే పలురకాల హీటర్లు మార్కెట్లో ఉన్నప్పటికీ ఇది మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. చాలా చిన్నగా అండం ఆకారంలో ఉండే ఈ హీటర్‌ను ఎక్కడికైనా మోసుకెళ్లొచ్చు. చిన్న క్యాండిల్తోనే పనిచేయడం దీని ప్రత్యేకత. క్యాండిల్స్ వెలిగినప్పుడు ఇది వేడిని విడుదల చేస్తుంది. తక్కువ శక్తి వినియోగంతోనే ఎక్కువ వేడిని అందిస్తుంది. మంచును సైతం కరిగించేంత వేడిని ఈగ్లూ కలిగి ఉంటుంది. విద్యార్థులు చలికాలంలో దీన్ని పక్కన పెట్టుకుని చదువుకోవచ్చని తయారీదారులు అంటున్నారు. దీన్ని వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలుగదు. స్మార్ట్ యూనిట్.. ప్రయాణ సమయాల్లో సూట్‌కేసులు, బ్యాగుల నుంచి దొంగతనాల్ని నివారించేందుకు రూపొందిన పరికరమిది. విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌లలో స్మార్ట్ యూనిట్‌ను ఉంచితే చాలు. ఎవరైనా మన అనుమతి లేకుండా వాటిని తెరవాలని చూసినా, ఇంకేదైనా సమస్య ఎదురైనా ఈ పరికరం వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. పైగా ఆటోమేటిక్ స్విచ్ ఆన్, ఆఫ్ అవడం దీని ప్రత్యేకత. మీరు ఈ పరికరాన్ని బ్యాగ్‌లో వేయగానే ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. బయటికి తీయగానే ఆఫ్ అయిపోతుంది. ఇది స్పందించే వేగం కూడా ఎక్కువే. కోబి.. బైక్ రైడింగ్కోసం ఉద్దేశించిన స్ట్రీట్ నేవిగేషన్ సిస్టమ్ కోబి. దీన్ని బైక్‌కు అమర్చుకుంటే ప్రయాణిస్తున్న ప్రదేశానికి సంబంధించిన వాతావరణం, గమ్య స్థానాలు, దగ్గరి దారులు వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానమై ఉండే ఈ పరికరం సమాచారాన్ని ఫోన్‌కు చేరవేస్తుంది. స్పిన్ రిమోట్.. కొత్త తరహా రిమోట్స్ని పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. అలా ఇటీవల ఆవిష్కరించిన రిమోట్లలో కొత్తది స్పిన్ రిమోట్. మనం ప్రస్తుతం వాడుతున్న రిమోట్స్ చాలా పెద్దవిగా ఉండి, రకరకాల బటన్స్ కలిగి ఉంటాయి. అయితే స్పిన్ రిమోట్ వాటికి భిన్నమైనది. గుండ్రంగా ఓ బంతిలాగా చేతిలో ఇమిడిపోయేలా ఉండే ఈ రిమోట్‌కు ఎలాంటి బటన్స్ ఉండవు. రిమోట్ యాంగిల్‌ను మార్చడం ద్వారానే దీన్ని వినియోగించవచ్చు. టి.విలు, ఎ.సి.లు, రూమ్ హీటర్లు, స్మార్ట్ఫోన్లు, మ్యూజికల్ గాడ్జెట్లువంటి వాటిని స్పిన్ రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. జెన్ ఎగ్.. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతల్ని తగ్గించేం దుకు తోడ్పడే పరిక రం జెన్ ఎగ్. కోడిగు డ్డు ఆకారంలో ఉండే ఈ పరికరంలో కొన్ని ఔషధ మూలికలు ఉంటాయి. దీనితో శరీరంపై మసాజ్ చేసుకోవడం వల్ల మానసిక ఆందోళనలు దూరమవుతాయి. దీన్ని చేతితో నొక్కుతూ మసాజ్ చేసుకోవడం వల్ల అందులోని ఔషధాలు విడుదలై ఒత్తిడిని తగ్గిం చి మానసిక శక్తిని అందిస్తాయి. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగే వీలుంది కాబట్టి దీన్ని వినియోగించి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. స్మార్ట్ ఇన్సోల్స్.. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన స్మార్ట్ ఇన్సోల్ ఇది. షూలు ధరించినప్పుడు పాదాల రక్షణకు ఉపయోగించే ఇన్సోల్స్ని ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించేలా తీర్చిదిద్దారు పరిశోధకులు. స్ట్రిడలైజర్ స్మార్ట్ ఇన్సోల్స్ అనే వీటిని షూలలో ధరించడం ద్వారా మీ ఆరోగ్య సమాచారం తెలుసుకోవచ్చు. వీటిని ధరించి పరుగెడుతున్నప్పుడు సంబంధిత సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అందిస్తాయి. రక్తప్రసరణ, ఎముకల పుష్టి వంటి సమాచారం తెలుసుకోవచ్చు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: 'క్యూట్‌గా స్వీట్‌గా' సాంగ్ వచ్చేసింది..
విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు
ఇంటర్ కూడా ఇక్కడే..
శృంగార వల్లభునికి రూ.4.04 లక్షల ఆదాయం
ఇంటర్ సప్లిమెంటరీకి రెడీ
అన్నదాత కన్నీరు తుడిచేలా..
No Headline
గ్రూప్–2 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు
బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
Advertisement