-
జీడీపీ వృద్ధి జోరు..
♦ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.3శాతం ♦ తయారీ రంగం ఊతం క్యూ1, క్యూ2 గణంకాలూ పైపైకి.. ♦ దీనితో 2015-16లో 7.6 శాతం రేటు ఖాయమన్న అంచనాలు న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలను మించింది. 7.3 శాతంగా ఈ రేటు నమోదయ్యింది. ఇంతక్రితం రెండు త్రైమాసికాల గణాంకాలను కూడా ఎగువముఖంగా సవరిస్తూ... కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) తాజా లెక్కలను సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 7 శాతం నుంచి భారీగా 7.6 శాతానికి సవరించారు. తరువాతి త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) వృద్ధి రేటు గణాంకాలను కూడా 7.4 శాతం నుంచి 7.7 శాతానికి పెంచారు. పరిశ్రమల మాట ఇదీ.. సంస్కరణలు మున్ముందూ కొనసాగుతాయన్న విశ్వాసాన్ని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 29 బడ్జెట్ ఆర్థిక రంగానికి మరింత ఊపునిస్తుందన్నది తమ అభిప్రాయమని తెలిపారు. కాగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వం సానుకూల విధాన చర్యలను వచ్చే బడ్జెట్లో తీసుకోవాలని అసోచామ్ పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయం, మౌలిక, స్టీల్, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇండస్ట్రీ బాడీ కోరింది. వివిధ దేశాలను చూస్తే... 2015లో చైనా 6.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. రష్యాలో అసలు వృద్ధిలేకపోగా 3.7 శాతం క్షీణత నమోదయ్యింది. బ్రెజిల్ కూడా ఇదే ధోరణిలో 3.7 శాతం క్షీణ వృద్ధిని నమోదుచేసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతోంది. ముఖ్యాంశాలు చూస్తే... వార్షికంగా చూస్తే... త్రైమాసికంలో మొత్తం వృద్ధి రేటు 6.6 శాతం నుంచి 7.3 శాతానికి ఎగిసింది. తయారీ: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 1.7 శాతం నుంచి భారీగా 12.6 శాతానికి ఎగసింది. ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్: వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 10.1 శాతానికి ఎగిసింది. వ్యవసాయం: 2014-15 మూడవ త్రైమాసికంలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 2.4 శాతం క్షీణత నమోదయ్యింది. అయితే ఈ క్షీణత ప్రస్తుతం 1 శాతానికి తగ్గింది. మైనింగ్ అండ్ క్వారీయింగ్: ఈ రంగంలో వృద్ధి రేటు 9.1 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు: వృద్ధి రేటు 8.8 శాతం నుంచి 6 శాతానికి దిగింది. నిర్మాణం: ఈ రంగంలో వృద్ధి రేటు 4.9% నుంచి 4%కి చేరింది. ఫైనాన్స్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: వృద్ధి రేటు 12.1 శాతం నుంచి 9.9 శాతానికి తగ్గింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: వృద్ధి రేటు 25.3 శాతం నుంచి భారీగా 7.5 శాతానికి పడింది. పెట్టుబడుల సంగతికి వస్తే... పెట్టుబడులకు సంకేతంగా ఉంటున్న స్థూల స్థిర మూలధన కల్పన (జీఎఫ్‌సీఎఫ్) వార్షికంగా (ప్రస్తుత ధరల వద్ద) రూ.38.44 లక్షల కోట్ల నుంచి రూ.39.82 లక్షల కోట్లకు పెరుగుతుందని తాజా అంచనాలు పేర్కొన్నాయి. 2015-16పై అంచనాలు ఇలా... తాజా లెక్కలతో మొత్తం ఆర్థిక సంవత్సరం (2015-16) అంచనాలు సైతం 7.6 శాతానికి పెరిగాయి. ఇదే జరిగితే 2010-11 తరువాత (అప్పట్లో 8.9 శాతం) ఇప్పటి వరకూ ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి అవుతుంది. 2014-15లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదయ్యింది. అయితే ఈ వృద్ధి రేటు 2015-16లో 7.3 శాతంగా ఉంటుం దని ఇప్పటివరకూ అంచనావేస్తూ వచ్చారు. తాజా గణాంకాలతో ఈ అంచనాలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) అంచనా వేసింది. తయారీ భారీ వృద్ధి, వ్యవసాయ రంగం మెరుగుపడే అవకాశాలు తమ అంచనాకు కారణమని సీఎస్ఓ పేర్కొంది. మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన తయారీ రంగం 2014-15లో 5.5 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే... 2015-16లో ఈ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని సీఎస్ఓ అంచనా. ఇక కొంచెం అటుఇటుగా అంతే వెయిటేజ్ ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు కూడా 0.2% నుంచి 1.1 శాతానికి పెరుగుతుందని అధికార వర్గాల అంచనాలు. ఆర్థిక మంత్రిత్వశాఖ మధ్యంతర ఆర్థిక విశ్లేషణలో 2015-16లో జీడీపీ వృద్ధి అంచనా 7 నుంచి 7.5 శాతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.4 శాతం. ఐఎంఎఫ్ అంచనా 7.3%గా ఉంటే... ఏడీబీ అంచనా 7.4%గా ఉంది. మూడీ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా 7%. తాజా గణాంకాలను చూస్తే... గణాంకాలు అందరి అంచనాలను మించే పరిస్థితి కనిపిస్తోంది. సానుకూల ఫలితం: శక్తికాంత దాస్ తాజా జీడీపీ వృద్ధిరేటు గణాంకాలు తగిన సానుకూల దిశలో ఉన్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం గడచిన 18 నెలల నుంచీ చేపడుతున్న విధాన, సంస్కరణాత్మక చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినట్లు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నెలవారీ తలసరి ఆదాయం రూ. 6,453 2011-12 ధరల వద్ద వాస్తవిక రీతిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తలసరి ఆదాయం రూ.77,431గా నమోదవుతుందని (నెలకు రూ.6,453) సీఎస్ఓ అంచనా. 2014-15లో ఈ విలువ రూ.72,889గా ఉంది. అంటే ఈ తలసరి ఆదాయంలో వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 6.2 శాతానికి పెరుగుతుందని సీఎస్ఓ అంచనా వేస్తోంది. జీడీపీ వృద్ధి తీరు ఇదీ.. -
వృద్ధి 7.7 శాతం: ఐడీఎఫ్సీ
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.7% నమోదవుతుందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఐడీఎఫ్సీ అంచనా వేసింది. ఇందుకు తగిన పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని ఐడీఎఫ్సీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్రనీల్ పన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్ని సానుకూల ఆర్థిక పరిస్థితులు గత 10 ఏళ్లలో ఎన్నడూ లేవన్నారు. వర్షాభావ పరిస్థితులు, సంస్కరణల నత్తనడక వంటి అంశాలను కారణంగా చూపుతూ రేటింగ్ సంస్థ మూడీస్ తన అంచనాలను 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, తమ సంస్థ మూడీస్ రీతిలో విశ్లేషించడంలేదని అన్నారు. సానుకూలతలు ఇవీ... తగిన ఆహార నిల్వలు, భారీ డిమాండ్ వంటి అంశాలు దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తాయన్నది తమ అంచనా అని పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4.5% నుంచి 5% శ్రేణిలో ఉండే అవకాశం ఉన్నందున, మార్చి నాటికి ఆర్బీఐ అరశాతం రెపో తగ్గించే అవకాశం ఉందని విశ్లేషించారు. క్రూడ్ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం భారత్‌కు ఆర్థికంగా కలిసి వస్తున్న మంచి అవకాశమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు డాలర్ మారకంలో రూపాయి 66 స్థాయిలో ఉండవచ్చన్నది అంచనా. మోడీ ప్రభుత్వం సంస్కరణ లకు కట్టుబడి ఉందన్న విషయం గమనించదగిందని పేర్కొన్నారు. -
మందగమనం నుంచి భారత్ బయటకు
న్యూఢిల్లీ: పాతికేళ్లలో ఎప్పుడూ చూడనంత తీవ్ర మందగమన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడుతోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణ సంస్థ- ఓఈసీడీ ఆర్థిక సర్వే ఒకటి తెలిపింది. అయితే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట 8 శాతం వృద్ధిని నమోదుచేసుకోడానికి తాజా ఆర్థిక సంస్కరణల అమలు కీలకమని కూడా ఆర్థిక సహకార, అభివృద్ధి సంఘం వ్యాఖ్యానించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, బలహీనమైన పెట్టుబడుల నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఐదు శాతం దిగువున నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) కాలంలో ఈ రేటు 5.7 శాతంగా నమోదయ్యింది. వృద్ధి అంచనాల పెంపు 2015-16లో 6.6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని సంస్థ తన తాజా అంచనాల్లో ప్రకటించింది. ఈ మేరకు గత అంచనాలను 5.7 శాతం నుంచి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.4 శాతం నమోదవుతుందని తెలిపింది. 2016-17 నాటికి 6.8 శాతానికి ఈ రేటు చేరుతుందని పేర్కొన్న ఓఈసీడీ, 8 శాతం వృద్ధికి చేరడానికి మరికొన్ని చర్యలను సూచించింది. ఇందులో సామాజిక, భౌతిక మౌలిక రంగానికి సబ్సిడీల వ్యయాన్ని బదలాయించడం, పన్ను సంస్కరణలు, మౌలిక రంగానికి అధిక నిధులు అందేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు, ఉపాధి కల్పనలో వ్యవస్థీకృత అడ్డంకుల తగ్గింపునకు కృషి... ఈ దిశలో కార్మిక సంస్కరణలు వంటి చర్యలు అవసరమని తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement