-
స్విస్ అకౌంట్లపై సర్జికల్ స్ట్రైక్స్‌కు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ దేశంలో బ్లాక్‌మనీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న కేంద్రప్రభుత్వం.. స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న నల్లకుబేరుల బాగోతం కూడా ఇక గుట్టురట్టు చేయనుంది. స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న భారతీయుల అకౌంట్ల ఫైనాన్సియల్ సమాచారాన్ని 2019 నుంచి ఆటోమేటిక్ రూపంలో భారత్ పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీబీడీటీ చైర్మన్ సుశిల్ చంద్రా, ఇండియాలో స్విస్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ గిల్లెస్ రోడ్యూట్లు ఇరుదేశాల మధ్య ఆటోమేటిక్ రూపంలో సమాచార మార్పిడికి సంబంధించిన జాయింట్ డిక్లరేషన్‌పై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో విదేశాల్లో దాగిఉన్న లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం బయటకి రాబట్టనుంది. నేడు కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో 2019 నుంచి స్విట్జర్లాండ్‌లో ఉన్న భారతీయుల ఫైనాన్సియల్ అకౌంట్ల సమాచారం ఆటోమేటిక్‌గా పొందే సౌకర్యం భారత్‌కు లభించనుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమాచార మార్పిడికి సంబంధించి జూన్ 6 ప్రధాని నరేంద్రమోది, జెనీవాలో స్విస్ అధ్యక్షుడు జోహన్ ష్నీదర్-అమ్మన్‌తో భేటీ అయ్యారు. పన్ను ఎగవేసి, స్విస్‌లో దాచుకున్న నల్లధన వివరాలతో పాటు, నల్లకుబేరుల వివరాలను ఆటోమేటిక్‌గా ఇరు ప్రభుత్వాలు మార్పిడి చేసుకునేలా అవకాశం ఉండాలనే దానిపై ఆ దేశ అధ్యక్షుడితో చర్చించారు. మోదీ భేటీ అనంతరం నుంచి సమాచార మార్పిడి ఒప్పందంపై పలు దఫాల చర్చలు జరుగుతూ వచ్చాయి. నల్లధనంపై సర్జికల్ స్టైక్ చేస్తూ దేశంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. నల్లధనమంతా విదేశాల్లో దాగి ఉందని, స్విస్ బ్యాంకులపై సర్జికల్ స్టైక్ చేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చాయి. వారి విమర్శలకు కళ్లెం వేస్తూ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న సమాచారాన్ని ఆటోమేటిక్‌గా రాబట్టడానికి నేడు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. -
ఇంటర్నెట్ దిగ్గజాల సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజీన్ దిగ్గజాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ విజ్ఞప్తిమేరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ , యాహూ లు ప్వాణిజ్యపరంగా సెక్స్ నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని, ప్రచార ప్రకటనలను నిషేధించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రీ నాటల్ సెక్స్ డిటర్మినేషన్ పరీక్షల నిషేధంలో భాగంగా ఈ మూడు సంస్థలు ఈ కీలక చర్యకు ఆమోదం తెలిపాయని వివరించింది. సెక్స్ నిర్ధారణ ప్రకటనల శోధనలోని కీలక పదాలను బ్లాక్ చేశాయని జస్టిస్ దీపక్ మిశ్రాలతో , జస్టిస్ సి నాగప్పన్ కూడిన ధర్మాసనానికి ప్రభుత్వం నివేదించింది. దీని ప్రకారం ఇకపై సెక్స్ నిర్ధారణకు సంబంధించిన సమాచారం ఈ సెర్చ్ ఇంజిన్లలో లభించదు ఈ సమాచారం పొందేందుకు ఎక్కువగా వినియోగించే దాదాపు 22 కీవర్డ్స్‌ను బ్లాక్ చేసినట్టు వివరించింది. కాగా భారత్‌లో నిషేధించబడిన కొన్ని సెక్స్ నిర్ధారణ ప్రకటనలు దర్శనం కావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డా. సాబూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement