-
International Mens Day: పురుషులూ మనుషులే.. వివక్ష దేనికి?
ఇటీవల పురుషుల హక్కుల గురించి గత పోరాటాలు వెలుగు చూస్తున్నాయి. కొంత కాలంగా కేవలం మహిళల అభివృద్ధి, మహిళల సాధికారత, మహిళల హక్కులు, మహిళల రక్షణ... చుట్టూనే తిరుగుతున్న ప్రభుత్వాలు, తయారు చేస్తున్న చట్టాలను పురుషుల హక్కుల సాధకులు తప్పు పడుతున్నారు. చట్టాలు అందరికీ సమానం అన్నప్పుడు పురుషుల పట్ల మాత్రం వివక్ష దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరి ఆవేదనకు, ఆలోచనలకు, కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. లక్ష్యం అదే... సమాజ అభివృద్ధి, కుటుంబం, వివాహం, పిల్లల సంరక్షణ రంగాలలో. పురుషుల/ అబ్బాయిల/బాలుర జీవితాలు, విజయాలు సమస్యల్ని గుర్తించే కార్యక్రమం ఇది ఎవరూ పట్టించుకోని పురుషులకు ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన పెంచడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రాథమిక లక్ష్యం. పురుషులకు ఎదరయ్యే సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా పురుషుల మానసిక ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి, రోల్ మోడల్స్ లాంటి పురుషులను గుర్తించడానికి..దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ నేపథ్యం... మహిళా దినోత్సవంలా పురుషుల దినోత్సవానికి పెద్దగా ప్రత్యేకత లేదు.వాస్తవానికి, పురుషులకు అంకితమైన రోజు అంటూ ఒకటి చాలా కాలంగా ఉందని కూడా చాలా మందికి తెలియదు.అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నట్టే.., 1969 నుంచే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉంది. ప్రారంభం తర్వాత చాలా కాలం దీనిని జరుపుకోలేదు. తిరిగి 1999లో ట్రినిడాడ్ టొబాగోకు చెందిన వైద్యుడు డాక్టర్ డ్రైరోమ్ టీలక్సింగ్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పునఃప్రారంభించారు. తన తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీని ఆయన దీని కోసం ప్రత్యేకంగా ఎంచుకున్నారు. మన దగ్గర పుట్టి 18ఏళ్లు.. భారతదేశంలోని పురుషుల హక్కుల సాధనా సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిఫ్) నవంబర్ 19, 2007న దేశంలో మొట్టమొదట ఈ వేడుకను నిర్వహించడానికి సారథ్యం వహించింది. అప్పటికే 498 చట్టం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పురుషుల పుణ్యమాని ఈ ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచీ దీన్ని వార్షిక సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. పురుషుల హక్కుల కోసం సిఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 24/7 కాల్ సెంటర్ అందుబాటులో తేవడంతో పాటు అనేక అంశాల్లో పురుషుల హక్కుల గురించి సిఫ్ ఉద్యమిస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులతో సాక్షి ముచ్చటించినప్పుడు వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మైనార్టీలుగా మగవారు... ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం గానీ, ఓటర్ల గణాంకాల ప్రకారం గానీ చూస్తే పురుషులు రానురాను మైనార్టీలుగా మారుతున్నారు.రకరకాల కారణాల వల్ల పురుష జనాభా తగ్గిపోతోంది.ప్రభుత్వాలు చేస్తున్న,చేసిన చట్టాలన్నీ మగవాళ్లకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. పురుషుల రక్షణకు ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లూ లేవు. అంతేకాదు పురుషులకు వ్యతిరేకంగా జరిగే నేరాలపై చర్చలేదు. ఆ చట్టం దుర్వినియోగం..ఏదీ సవరణ? గత కొంత కాలంగా పురుషులను వేధించడానికి 498 లాంటి చట్టాల్ని దుర్వినియోగం చేస్తూన్నారు. ఇటీవలి ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం చూస్తే 98శాతం 498 కేసులు అన్యాయంగా మోపినవే. ఆ చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి అంటే .. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే చట్టాలు ఉండాలి కదా. భారత్ జత చేసి ఐపీసీ పేరు మారుస్తున్నారు. అంతకన్నా ముందు 498లో సవరణలు ముఖ్యం. సరే మా పోరాటా ల ఫలితంగా 498 కేసుల్ని డీల్ చేసే విషయంలో కొంత మార్పు వచ్చింది అనుకునేలోగానే గృహహింస చట్టం తెచ్చారు. ఇప్పుడు దీని దుర్వినియోగం పెరుగుతోంది. అలాగే లైంగిక దాడి, లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టాలు పురుషుల్ని వేధించేందుకు అస్త్రాలుగా మారుతున్నట్టు మా ఆన్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. ఏళ్ల తరబడి సహజీవనంలో ఉండీ, ఇతరత్రా విబేధాలు వస్తే పురుషులపై రేప్ కేసులు పెడుతున్నారు. పురుషులకు రక్షణ ఏదీ? ఎక్కడ చూసినా మహిళాభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. పురుషుల హక్కులు, వారి రక్షణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. చిరు ప్రాయంలో జరిగేౖ లైంగిక దాడులు కూడా బాలుర మీదే ఎక్కువ. కానీ బేటా బచావో అంటూ ఎవరూ మాట్లాడరు. అలాగే స్కూల్ డ్రాప్ అవుట్స్‌లో కూడా అబ్బాయిలే ఎక్కువ. మరి బేటీ పఢావో అన్నట్టు బేటా పడావో లాంటి స్కీమ్ ఎందుకు తీసుకురారు? మగవాళ్లపై కూడా గృహహింస ఉంది అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వరకట్నం తీసుకోవడం మాత్రమే కాదు ఇవ్వడం కూడా నేరమే కానీ ఇచ్చేవారిని శిక్షించిన దాఖలాల్లేవు. పురుషుల ఆరోగ్యం...కాదా మన భాగ్యం? రకరకాల వేధింపులు, ఇతరత్రా ఒత్తిళ్ల వల్ల మానసికంగా పురుషులు అంతకంతకూ బలహీనులుగా మారుతున్నారు. అందుకే ఆత్మహత్యలు సైతం మహిళల కన్నా పురుషుల్లోనే 3 రెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. మానసిక బలహీనతలతో పాటు బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. కానీ ప్రభుత్వాలకు పురుషుల ఆరోగ్యాల మీద శ్రద్ధ లేదు. మహిళల కోసం ఎన్నో కమిషన్స్, శాఖలు... పురుషులకు ఎందుకు లేవు? పశువులు, చెట్లకు, పిల్లలకు ఆడవాళ్లకు ఉన్నాయి. చట్టాల్లో మార్పుల కోసమే మా పోరాటం... సిఫ్ ను హైదరాబాద్‌లో 2008లో ప్రారంభించాం 2014 నుంచి క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో 498 కేసు ఎదుర్కున్న అర్నేష్‌కుమార్ అనే వ్యక్తి విషయంలో అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా సంస్థ సాధించిన విజయమే. అలాగే పార్లమెంట్లో ఓ పురుష వ్యతిరేక చట్టాన్ని అడ్డుకోవడంలో కూడా లక్ష్యాన్ని సాధించాం. అయినా ఇప్పటికీ 52 దాకా చట్టాలు మగవాళ్లను వేధించడానికి వీలుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వర్క్‌ప్లేస్‌లో సెక్సువల్ హెరాస్మెంట్ వచ్చింది. ఒక మహిళ తన సహోద్యోగి మీద ఈ కేసు పెడితే తాను వేధించలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణ ఎదుర్కుంటున్న పురుషుడిదే అంటోందీ చట్టం. పురుషుల హక్కుల పట్ల బలంగా గొంతు ఎత్తితేనే ఇది మారుతుంది. –పార్ధసారథి, సిఫ్ బాధితులకు అండగా ఉంటున్నాం.. నేను కూడా ఒకప్పుడు 498 బాధితుడ్నే. నా లాంటి మరికొందరు కలిసి 2006లో తొలుత బాధితుల కోసం కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాం. అనంతరం సిఫ్లో భాగమయ్యాం. ప్రతీ ఆదివారం ఓపెన్ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. న్యాయ సహాయంతో పాటు ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తూ బాధితులకు ఆసరాగా ఉంటున్నాం. ఈ చట్టం ప్రకారం అరెస్ట్‌లు కాకుండా చాలా వరకూ అడ్డుకోగలిగాం. వేల సంఖ్యలోనే ఇప్పటి దాకా బాధితులకు సహాయ సహకారాలు అందించాం. జాతీయస్థాయిలో 8882498498 హెల్ప్‌లైన్ ఉంది. ఈ హెల్ప్‌లైన్‌కు ఏ సమయంలో కాల్ చేసినా తప్పకుండా స్పందిస్తాం. పురుషుల సమస్యల విషయంలో రాజకీయ నేతలకు తరచుగా రిప్రజెంటేషన్స్ ఇస్తుంటాం. ఎందుకంటే చట్టాలు తయారయేటప్పుడే పురుషుల వినతులు కూడా పట్టించుకోవాలి. లేకపోతే అవి పక్షపాతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ. –శైలేష్, సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిఫ్) – సత్యబాబు -
మెన్స్ డే.. ఇది జోక్ కాదు బ్రదర్!
మహిళల దినోత్సవం నాడు కనిపించే ఆర్భాటాలు, ప్రసంగోపన్యాసాల హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి పురుషుల విషయంలో అలాంటివేం ఎందుకు కనిపించవు. ఎందుకంటే.. వాళ్ల త్యాగాలను, సాధిస్తున్న విజయాలను గప్‌చుప్‌గా స్మరించుకోవడం కోసమే ఒకరోజు ఉంది కాబట్టి. ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే(అంతర్జాతీయ పురుషుల దినోత్సవం..). అలాగని ఆమె కష్టానికి ప్రతీకగా మార్చి 8వ తేదీన జరిపే ఇంటర్నేషనల్ ఉమెన్స్డేకి పోటీగా మెన్స్డేను తెరపైకి తేలేదు. ‘మగవాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే తప్పేంటి?’.. అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఇది. ఇంటర్నేషనల్ మెన్స్‌డే.. ఇవాళ ‘‘మగవాళ్లే గొప్ప.. వాళ్ల వల్లే ఈ సమాజం నడుస్తోంది అనే ప్రచారాలు ఎక్కడా వినపడదు. కేవలం మగవాళ్ల ఆరోగ్యం, ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిళ్లు, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. అన్నింటికీ మించి ‘ఈ సమాజంలో మగాళ్లంతా దుర్మార్గులు..’ అని కొందరిలో పేరుకుపోయిన భావనను తుడిచిపెట్టే ఓ చిరు ప్రయత్నం ఇది. మెన్స్‌డే.. ఇవాళ మగవాళ్ల కోసం కొన్ని లక్ష్యాలంటూ నిర్దేశించుకుంటారు. సామాజిక ఆర్థిక పరిస్థితులను సమీక్షిస్తారు. లక్ష్య సాధన కోసం ఏం చేయాలనే దానిపై చర్చించుకుంటారు. సొసైటీలో ఉన్న పాజిటివ్ రోల్ మోడల్స్‌ని ప్రచారం చేయడం, వాళ్ల సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజుకున్న మరో ప్రత్యేకత కూడా. మరి మెన్స్ డేకి గుర్తింపు ఎలా దక్కింది?.. ‘‘మగాళ్లు కూడా మనుషులే. అలాంటప్పుడు వాళ్లకు ఒక గౌరవప్రదమైన రోజు అవసరం. కానీ, ఈ ఆధునిక యుగంలో అది ఇంకా అట్టడుగునే ఉండిపోవడం బాధాకరం’’:: ప్రొఫెసర్ థామస్ ► ప్రపంచ దేశాల ఐక్య వేదిక ఐక్యరాజ్య సమితి ఆమోద్ర ముద్ర ఉంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి. యునెస్కో సహకారంతో కొన్ని దేశాల్లోని ఎన్జీవోలు, మరికొన్ని దేశాల్లో ఏకంగా ప్రభుత్వాలే అధికారికంగా మెన్స్ డేను నిర్వహిస్తున్నాయి. ► మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఉండటం మూలానా ‘మనుషులంతా సమానమే’ అనే సిద్ధాంతాన్ని దెబ్బ తీసింది. దీంతో మగవాళ్లకూ ఒక రోజు నిర్వహించడం ద్వారా సమతుల్యత తేవాలని భావించారు కొందరు మేధావులు. ► అమెరికా కన్సాస్‌లోని మిస్సోరి యూనివర్శిటీ ప్రొఫెసర్ థామస్, సమాజానికి మగవాళ్లు చేస్తున్న సేవల్ని అభినందించేందుకు ఒక రోజు అవసరం అని భావించారు. చివరికి ఆయన ఆధ్వర్యంలోనే మొట్టమొదటిసారిగా 1992, ఫిబ్రవరి 7న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరిగింది. దక్షిణ యూరప్‌కి చెందిన మాల్టా దీవి మాత్రం ఈ ఉత్సవాల్ని 1994 నుంచి ప్రతీ ఏటా నిర్వహిస్తూ వచ్చింది. తిలక్‌సింగ్ వల్లే.. నవంబర్ 19కి మెన్స్ డే ఎలా మారింది అనే అనుమానం తలెత్తవచ్చు. ఇందుకు కారణం.. కరేబియన్ ద్వీప దేశం ట్రినిడాడ్–టొబాగోకు చెందిన డాక్టర్ జెరోమో తిలక్‌సింగ్. అక్రమంగా జైలు పాలైన మగవాళ్ల కోసం ఆయన అక్కడ ఉద్యమించాడు. ► మగవాళ్ల సమస్యలతోపాటు హక్కుల గురించి కూడా అవగాహన ర్యాలీలు నిర్వహించాడు. తిలక్‌సింగ్ తండ్రి పుట్టినరోజు నవంబర్ 19. అదేరోజు ట్రినిడాడ్ టొబాగో టీమ్ వరల్డ్ కప్ సాకర్ టోర్నీకి ఎంపికైంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని నవంబర్ 19ని మగవాళ్ల రోజుగా నిర్వహించారు. ► 1999లో ఐక్య రాజ్య సమితి అదే రోజున ‘మెన్స్ డే’ నిర్వహించుకునేందుకు ఆమోదం తెలిపింది. దాదాపు 80కి పైగా దేశాలు ఇప్పుడు మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో మన దేశం కూడా ఉంది. కానీ, మన దేశంలో ఈ దినోత్సవానికి ప్రచారం మొదలుపెట్టింది ఒక మహిళ కావడం గమనార్హం. ► ఉద్యమవేత్త, పురుషుల తరపు వాదించే న్యాయవాది ఉమా చల్లా.. మన దేశంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించే యత్నం మొదలుపెట్టారు. 2007 నుంచి ఆమె ఈ ప్రయత్నంలో ఉన్నారు. ► మహిళా పక్షపాత ధోరణి కారణంగా కొన్ని కేసుల్లో మగవాళ్లు ఎదుర్కొంటున్న వేధింపులు, హింసను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఆమె. పురుష వ్యతిరేక న్యాయ వ్యవస్థ అనే చట్రంలో చిక్కుకున్న మగవాళ్లకు.. న్యాయం చేసే అనితర బాధ్యతను మోస్తున్నారు ఆమె. Happy Men's Day to all the men out there!❤️#SunPictures pic.twitter.com/kY0vOqeqAA — Sun Pictures (@sunpictures) November 19, 2022 ఆడామగా.. తల్లీతండ్రి, అన్నాచెల్లి, అక్కాతమ్ముడు, భార్యాభర్త.. ఇలా ఏ పాత్రలో ఉన్నా వారివారి జీవితాల్లో ప్రధాన పాత్రే పోషిస్తుంటారు. ఉమెన్స్డేలో లేనిది.. మెన్స్డేలో ప్రముఖంగా ఉన్నది లింగ బేధాల్లేకుండా సంబంధాలను మెరుగుపర్చుకోవాలనే థీమ్. మెన్స్ డే అంటే.. కొందరి విషయంలో ఎందుకనో ఓ చిన్నవిషయం. కొందరు జెంటిల్మెన్సే దీన్నొక జోక్‌గా ఫీలవుతుంటారు. మహిళలు తమ రోజుని ఎంత ప్రత్యేకంగా నిర్వహించుకుంటారో.. సమస్యల గురించి ఎంత బాగా చర్చించుకుంటారో.. అలాగే మగవాళ్లు కూడా అదే స్థాయిలో చర్చించకపోవడమే.. మెన్స్డేకు ఉన్న ప్రధాన లోపం!! 2001 నుంచి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఒక్కో ఏడాదికి.. ఒక్కో నేపథ్యంతో నిర్వహిస్తున్నారు. హెల్పింగ్ మెన్ అండ్ బాయ్స్.. థీమ్‌ను ఈ ఏడాదికి ప్రకటించారు. సంఘాలకు, కుటుంబాలకు, యావత్ ప్రపంచానికి.. మగవాళ్లు అందిస్తున్న సానుకూల సహకారానికి వేడుక చేయడం, మగవాళ్ల శ్రేయస్సును ప్రోత్సహించడం ఈ ఏడాది థీమ్ లక్ష్యం. ::: ఆరాధ్య -
విమెన్స్ డేలు, ఉత్సవాలు మహిళలకేనా, మరి పురుషులకు?
సాక్షి, హైదరాబాద్: ఎపుడూ విమెన్స్ డేలు, విమెన్స్ ఎంపవర్మెంటేనా. మరి పురుషులకు? వారికి స్పెషల్ డేలు, ఉత్సవాలు గట్రా ఏవీ లేవా. ఈ ప్రశ్నలకు సమాధానంగా వచ్చిందే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికీ, కనిపించీ, కనిపించని వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఓ రోజుంది, అదే నవంబర్ 19. సమాజంలో ఆడా మగా ఇద్దరూ సమానమే. ఈ స్ఫూర్తిని, అవగాహనను కల్పించేందుకే ఈ డే. అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా కాకుండా అందరూ మహానుభావులుగా మారాలనేదే దీని లక్ష్యం. వెల్.... ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా పురుషులందరికీ హ్యాపీ మెన్స్ డే. -
Men's Day 2021: మా కష్టాలు మీకేం తెలుసు?
International Mens Day: గనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు! పేరుకే పురుషుడు! తీరుకేమో నిస్సహాయుడు! ఇలా అంటే చాలామంది అంగీకరించకపోచ్చు. కానీ పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికి, వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ ఓ రోజుంది. అదే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మార్చి 8న మహిళల దినోత్సవంలాగే.. నవంబర్ 19న పురుషుల దినోత్సవంగా జరుపుకొంటారు. భారత్‌లోనూ అనేక నగరాల్లో ఈ రోజును ఘనంగా జరుపుతున్నారు. ఏమని చెప్పాలి.. ‘పురుషాధిక్య సమాజం’పేరిట మగాళ్లలో బాధలు పెట్టేవారిని, బాధపడేవారిని ఒకే గాటన కట్టేస్తున్నారన్నది కొందరి వాదన. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా సమాజం, చట్టాలు మహిళలపైనే సానుభూతి ప్రదర్శిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ‘తప్పు మగాళ్లదే’అనే సాధారణ సూత్రీకరణ జరుగుతోందని పేర్కొంటున్నారు. పురుషులు–బాలల ఆరోగ్యం, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకే ‘పురుషుల దినోత్సవం’పుట్టుకొచ్చింది. అలాగని తాము స్త్రీ ద్వేషులం కాదని, ఫెమినిస్టులు తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. చాలా దేశాల్లో పురుష దినోత్సవాలకు మహిళలూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మగాళ్లు సమస్యలను బయటికి చెప్పుకోలేక, లోపలే కుమిలిపోతూ తమను తాము చంపుకొంటున్నారు. భారత్‌లో మహిళలకంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 3.5 రెట్లు ఎక్కువ. గుండెపోటు పురుషుల్లోనే అధికం. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఆయువు బాగా తక్కువ. యాచకులు, గూడులేక రోడ్లపై బతుకీడుస్తున్న వారిలోనూ పురుషులే ఎక్కువ. త్యాగాలు గుర్తించండి! ‘సంపాదించాలి. కుటుంబ ఉన్నతికి పాటుపడాలి. మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి అన్నగా, మంచి కుమారుడిగా ఉండాలి’.. పురుషులపై సమాజం పెట్టిన బాధ్యత ఇది. ఇందులో ఎక్కడ విఫలమైనా ఛీత్కారం తప్పదు. ఇంత చేసినా కీలక సమయంలో న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదని పురుష బాధితులు వాపోతున్నారు. ‘భార్య విడాకులు కోరినప్పటికీ.. పిల్లలకు తండ్రే దూరం కావాలి. 90 శాతం కేసుల్లో ఇదే జరుగుతోంది. గృహ హింస కేసుల్లో అన్యాయంగా జైళ్లలో పెడుతున్నారు. ఇదంతా పురుషులపై వివక్షే’అని చెబుతున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత పురుషుల్లో అత్యధికులకు సొంత ఆకాంక్షలేవీ ఉండవు. ఉన్నా వదిలేసుకుంటారు. కష్టమైనా, నష్టమైనా, ఏం చేసినా, ఎంత సంపాదించినా కుటుంబం కోసమే! అలాంటప్పుడు పురుషుల త్యాగాలకు కనీస గుర్తింపు ఇవ్వడంలో తప్పేముంది? ‘పురుషుల దినోత్సవమంటే జోక్ కాదు. కుటుంబం, సమాజం కోసం పురుషులు చేస్తున్న త్యాగాలు, సాధించిన విజయాలు గుర్తు చేసుకోవడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉద్దేశం..’ పురుషులకు హెల్ప్‌లైన్.. భారత్‌లో సందర్భం, అవసరాన్ని బట్టి సాయం చేసేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు అనేకం ఉన్నాయి. ఇటీవల మహిళల కోసం, చిన్న పిల్లల కోసం కూడా ఇలాంటి హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. కష్టాల్లో చిక్కుకున్న పురుషుల కోసం కూడా ఓ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో వారే స్వయంగా ఒక హెల్ప్‌లైన్ నంబర్ (8882 498 498) ఏర్పాటు చేసుకున్నారు. మా కష్టాలు మీకేం తెలుసు? మహిళలకు అన్యాయం జరిగిందంటే అందరూ పెద్దమనుషులై తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తారు. అదే పురుషులకు అన్యాయం జరిగితే అండగా నిలిచేవారు అంతంతమాత్రమే. పైగా, అన్యాయం జరిగిందన్న పురుషుడిని వెటకారంగా చూస్తారు. భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు.. భార్యాబాధితుల విషయంలో అంతగా స్పందించరని పురుష సంఘాలు వాపోతున్నాయి. నైతిక మద్దతు కూడా కూడగట్టుకోలేక, చెప్పుకోలేక తామే సంఘంగా ఏర్పడి ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నామంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి సంఘాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇలాంటి బాధితులందరూ కలిసి పెట్టుకున్న ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (ఎస్ఐఎఫ్)’.. మహిళా కమిషన్ లాగానే పురుష కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.. -
సానుభూతికీ నోచుకోడు..
సాక్షి, హైదరాబాద్: గనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు! పేరుకే పురుషుడు! తీరుకేమో నిస్సహాయుడు! ఇలా అంటే చాలామంది అంగీకరించకపోచ్చు. కానీ పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికి, వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ ఓ రోజుంది. అదే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మార్చి 8న మహిళల దినోత్సవంలాగే.. నవంబర్ 19న పురుషుల దినోత్సవంగా జరుపుకొంటారు. భారత్‌లోనూ అనేక నగరాల్లో ఈ రోజును ఘనంగా జరుపుతున్నారు. ఏమని చెప్పాలి.. ‘పురుషాధిక్య సమాజం’పేరిట మగాళ్లలో బాధలు పెట్టేవారిని, బాధపడేవారిని ఒకే గాటన కట్టేస్తున్నారన్నది కొందరి వాదన. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా సమాజం, చట్టాలు మహిళలపైనే సానుభూతి ప్రదర్శిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ‘తప్పు మగాళ్లదే’అనే సాధారణ సూత్రీకరణ జరుగుతోందని పేర్కొంటున్నారు. పురుషులు–బాలల ఆరోగ్యం, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకే ‘పురుషుల దినోత్సవం’పుట్టుకొచ్చింది. అలాగని తాము స్త్రీ ద్వేషులం కాదని, ఫెమినిస్టులు తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. చాలా దేశాల్లో పురుష దినోత్సవాలకు మహిళలూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మగాళ్లు సమస్యలను బయటికి చెప్పుకోలేక, లోపలే కుమిలిపోతూ తమను తాము చంపుకొంటున్నారు. భారత్‌లో మహిళలకంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 3.5 రెట్లు ఎక్కువ. గుండెపోటు పురుషుల్లోనే అధికం. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఆయువు బాగా తక్కువ. యాచకులు, గూడులేక రోడ్లపై బతుకీడుస్తున్న వారిలోనూ పురుషులే ఎక్కువ. మా కష్టాలు మీకేం తెలుసు? మహిళలకు అన్యాయం జరిగిందంటే అందరూ పెద్దమనుషులై తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తారు. అదే పురుషులకు అన్యాయం జరిగితే అండగా నిలిచేవారు అంతంతమాత్రమే. పైగా, అన్యాయం జరిగిందన్న పురుషుడిని వెటకారంగా చూస్తారు. భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు.. భార్యాబాధితుల విషయంలో అంతగా స్పందించరని పురుష సంఘాలు వాపోతున్నాయి. నైతిక మద్దతు కూడా కూడగట్టుకోలేక, చెప్పుకోలేక తామే సంఘంగా ఏర్పడి ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నామంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి సంఘాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇలాంటి బాధితులందరూ కలిసి పెట్టుకున్న ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (ఎస్ఐఎఫ్)’.. మహిళా కమిషన్ లాగానే పురుష కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement