-
సెక్స్ రాకెట్ ముఠాకు విద్యార్థులు చెక్!
కోల్ కతా: టెన్త్, ఇంటర్ చదివే విద్యార్థులు అంతర్జాతీయ సెక్స్ రాకెట్ నడుపుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. పశ్చిమబెంగాల్-నేపాల్ సరిహద్దుల్లో డార్జీలింగ్ కు చెందిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. మెంబర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ యాక్షన్ ఫర్ రూల్ గ్రోత్ (మార్గ్), ఎన్జీవో సంస్థ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. డార్జీలింగ్, ఢిల్లీ, హర్యానా పోలీసులు బృందాలుగా ఏర్పడి సెక్స్ రాకెట్ ముఠాకు అడ్డుకట్ట వేశారు. ప్రధాన నిందితుడు గగన్ వర్మను గుర్గావ్ లోని డీఎల్ఎఫ్ ఫేజ్ 2లోని ఇంట్లో హర్యానా పోలీసుల సహాయంతో డార్జీలింగ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. బాలికలు, యువతులను కిడ్నాప్ చేసి వారిని బార్లలో డ్యాన్స్ చేస్తే డబ్బులు ఇప్పిస్తానని ఆశ కల్పిస్తుంటాడు. ఒప్పుకోని వారిపై ఒత్తిడి తెస్తుంటాడు. ముఖ్యంగా డార్జీలింగ్, నేపాల్, సిక్కిం ప్రాంతాల నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటారు. గుర్గావ్, ఢిల్లీ ఏరియాలకు వీరిని అక్రమ రవాణా చేస్తుంటారు. ఆ తర్వాత వ్యభిచారం చేయించడం, ఇతర ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తుంటారు. మరో నిందితుడు సున్నీ తమాంగ్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లు, ఇద్దరు మహిళా, ఇద్దరు పురుష కానిస్టేబుల్స్ టీమ్ లో ఉన్నారు. సిలిగురిలో అడిషనల్ చీఫ్ జస్టిస్ ఎదుట సున్నీ తమాంగ్ ను హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. టెన్త్, ఇంటర్ చదివే 12 మంది విద్యార్థులు ఎన్జీవోలో పనిచేస్తున్నారు. ఓ బాలిక ఎన్జీవో సంస్థకు చెందిన కొందరు విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ముఠా సభ్యుడికి పరిచయం చేసింది. జాబ్ కావాలని అడిగిన వాళ్లను ఫొటోలు పంపించమని అడిగారు. 20 నిమిషాల్లోపే వారి పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు, వాటితో పాటు జాబ్ అపాయింట్ మెంట్ లెటర్స్ ను మెయిల్ చేశారు. విద్యార్థులు నిందితుల వివరాలను, ఈ ఆధారాలను పోలీసులకు అందజేశారు. జూన్ 8న తొలిసారి పోలీసులకు సమాచారం అందించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయించినట్లు ఛెత్రి తెలిపాడు. రెండోసారి ఇలాగే చేసి జూన్ 9న ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా పశ్చిమబెంగాల్ కు చెందిన ప్రణిత ముఖియా అనే మహిళను అరెస్ట్ చేశారు. తాజాగా శనివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో మొత్తం ఎంత మందిని అదుపులోనికి తీసుకున్న వివరాలపై స్పష్టత లేదు. -
సెక్స్ ముఠాను పట్టించిన విద్యార్థినులు
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ను డార్జింలింగ్ పోలీసులకు పట్టించేందుకు ఓ పాఠాశాల విద్యార్థులు సాయం అందించారు. డిల్లీ కేంద్రంగా చేసిన ఈ ఆపరేషన్ ‘కింగ్ పిన్‘ పేరుతో అమ్మాయిలను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్-పశ్చిమ బెంగాల్ బోర్డర్లో ముగ్గురు ట్రాఫికర్స్ ను అరెస్టు చేయగా.. డార్జిలింగ్ లో నుంచి ఢిల్లీ బయలుదేరిన మరో టీమ్ రాకెట్ లో ఉన్న మిగతా వారిని అరెస్టు చేశారు. డార్జిలింగ్ లో ఓ పదిహేనేళ్ల బాలిక కొద్ది రోజులుగా కనిపించకుండా పోవడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు తీగ లాగడంతో అంతర్జాతీయ రాకెట్ గురించిన వివరాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం డార్జిలింగ్, సిక్కిం, నేపాల్ ల నుంచి ముఠా ఉద్యోగం పేరుతో బీదరికంలో ఉన్న అమ్మాయిలకు అక్రమంగా ఆధార్ కార్డులను సృష్టించి నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని బార్ లలో డాన్సర్లుగా మారుస్తూ వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నిందితులు వర్మ, సున్నీలను అరెస్టు చేయడానికి వెళ్లగా వారు నేపాల్ వైపు రోడ్డు మీదుగా తప్పించుకు పారిపోయినట్లు వివరించారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని పట్టుకున్నట్లు చెప్పారు. డార్జిలింగ్ లో అమ్మాయిల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అక్కడ పనిచేసే 12 మంది అమ్మాయిలతో కూడిన పాఠశాల ఎన్జీవో బృందం నిందితులను పట్టుకోవడంలో సాయపడినట్లు తెలిపారు. గిరిజన అమ్మాయిల్లా వీరు ముఠా వద్ద నటించి వారిని బురిడీకొట్టించారని వివరించారు. వారితో పాటు బార్లలో పనిచేయడానికి ఇల్లు వదిలేసి ఢిల్లీ వచ్చినట్లు వారిని మొదట నమ్మించారని చెప్పారు. ఆ తర్వాత 15,000వేల జీతానికి బార్ లో డాన్స్ చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు లేవని చెప్పడంతో నిందితులు 20 నిమిషాల్లో ఆధార్ కార్డులను సృష్టించి పంపినట్లు తెలిపారు. మొదట ఓ వ్యక్తి, మహిళ ఢిల్లీలోని పనిటంకీ వద్దకు వీరిని తీసుకువెళ్లడానికి వచ్చారని వీరిని పట్టుకుని సమాచారం సేకరించినట్లు చెప్పారు. ఆ సమాచారంతో అసలు ముఠా హెడ్ ను నేపాల్ బోర్డర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు జారీ
గుడుల పేరుతో మేం ఓట్లడగలేదు: కేటీఆర్
తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
సుడిగాలి సుధీర్ బర్త్‌డే.. రష్మిగౌతమ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
అలాగే పెళ్లి కూడా చేసిపెట్టమని అడగండి మేడం!
ఆనంద్ మహీంద్రా సండే ట్వీట్.. 'సిటీ ఆఫ్ సీ' వీడియో
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్‌లో మెరిసిందా?
రెడ్ కార్పెట్‌పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
టీడీపీ అరాచకం.. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
Advertisement