-
ఐరన్ మ్యాన్ కవచాన్ని దొంగలెత్తుకెళ్లారు..
లాస్ ఏంజిల్స్ : సూపర్ హీరో ఐరన్ మ్యాన్ సూట్(ఉక్కు కవచం)ను దొంగలెత్తుకెళ్లారు. బుధవారం లాస్ ఏంజిల్స్‌లోని ఓ ఆధునాతన గదిలో భద్రంగా దాచిన సూట్‌ను దొంగలెత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఎరుపు, బంగారు రంగులో ఉన్న ఈ సూట్ విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల పైమాటేనని పోలీసులు తెలిపారు. 2008లో వచ్చిన ఐరన్‌మ్యాన్ సినిమాలో హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ దీనిని ధరించాడు. ఆ సినిమా అప్పట్లో ఓ చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కాకుండా రాబర్ట్ డౌనీని అభిమానులకు మరింత చేరువ చేసింది. రాబర్ట్ డౌనీ జూనియర్ వచ్చే ఏడాదిలో అవెంజర్స్ సిరీస్‌లోని నాలుగో భాగంలో నటించనున్నారు. -
'ఐరన్ మ్యాన్' వల్లే ఈ ఆలోచన: జూకర్ బర్గ్
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం తన ఇంటి కోసం అవసమైన ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఇందుకోసం హాలీవుడ్ మూవీ 'ఐరన్ మ్యాన్' చూసి తాను ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు జర్వీస్ అని పేరు పెట్టారు. ఆ సాఫ్ట్వేర్ తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారు దానితో ఆటలు మొదలుపెట్టారని వివరించారు. తన కూతురు మ్యాక్స్ కు దీని అవసరం ఎంతైనా ఉందని జూకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు. ఐరన్ మ్యాన్ మూవీ వల్ల తనకు వచ్చిన ఆలోచనను 100 రోజుల్లో అమలు చేయాలని భావించాను, అయితే తక్కువ రోజుల్లోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తంచేశారు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ తోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ పనిచేస్తుందన్నారు. ఇంట్లోని వ్యక్తుల ముఖాలను గుర్తిస్తుందని, వారు చెప్పిన విషయాలను తన లేటెస్ట్ సాఫ్ట్ వేర్ అర్థం చేసుకుని రిప్లై ఇస్తుందని తెలిపారు. మ్యూజిక్ అన్ చేయాలని చెప్పగానే తాను రెగ్యూలర్ గా వినే ప్లే లిస్ట్ నుంచి సాంగ్స్ రన్ చేస్తుందని.. తన కూతురు మ్యాక్స్ కు వినోదాన్ని పంచుతుందన్నారు. ఏదైనా కొత్త విషయాన్ని చెబితే జార్విస్ ఈజీగా నేర్చుకుంటుందని తన లేటెస్ట్ ఫేస్బుక్ పోస్ట్ లో రాసుకొచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement