-
శాంతికి బదులుగా తలతెగిన ఫొటో
శ్రీశ్రీ రవిశంకర్‌కు ఐసిస్ సమాధానం అగర్తాల: శాంతి చర్చల కోసం ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ పంపిన సందేశానికి.. ఐసిస్ ఉగ్రవాద సంస్థ జుగుప్సాకరసమాధానమిచ్చింది. ఐసిస్‌కు శ్రీశ్రీ రవిశంకర్ శాంతిసందేశాన్ని పంపించారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ఈ సందేశంలో పేర్కొన్నారు. దీనికి ఐసిస్ ఘాటైన బదులిచ్చింది. తల నరికిన వ్యక్తి ఫొటోను రిప్లేగా పంపించింది. ఈ విషయాన్ని రవిశంకర్ గురువారం వెల్లడించారు. ‘ప్రపంచంలోని అన్ని సంస్కృతులు, మతాలు, ఆలోచనలను కలుపుకుని శాంతి పూర్వక వాతావరణం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసమే ఐసిస్‌తో మట్లాడాలనుకున్నాను. కానీ వారు (ఐసిస్) శాంతి కోరుకోవటం లేదు. వారికి మిలటరీతోనే సమాధానం చెప్పాలి’ అని అన్నారు. -
బెల్జియం పోలీసుల వేట
బ్రసెల్స్ నిందితుల కోసం విస్తృత గాలింపు ఇద్దరు మంత్రుల రాజీనామా! దాడులపై త్వరలోనే స్పష్టత ఇస్తానన్న ప్రధాని బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో వరు స పేలుళ్లకు పాల్పడిన వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరి కోసం వేటాడుతున్నారు. మెట్రో రైల్వే స్టేషన్లో ఘటనాస్థలంలో ఒకరిని అనుమానాస్పదంగా గుర్తించగా, మరొకరిని అనుమానాస్పద బాంబర్ (నజిమ్ లాచ్రోయి)గా విమానాశ్రయం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. తమను పేల్చేసుకున్న బక్రోయి సోదరుల గురించి పోలీసులకు తెలుసని, వారిలో ఒకడైన ఇబ్రహీం బక్రోయి టర్కీ నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు కనుగొన్నారు. అతడి గురించి తాము ముందుగానే హెచ్చరించినప్పటికీ అతడికున్న ఉగ్రవాద సంబంధాలను కనుగొనడంలో బెల్జియం పోలీసులు విఫలమయ్యారని టర్కీ అధ్యక్షుడు రికెప్ టయీప్ ఎర్డోగన్ చెప్పారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే దాడులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు బెల్జియం మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతర్గత భద్రత మంత్రి జాన్ జంబోన్, న్యాయ శాఖ మంత్రి కోయెన్ రాజీనామా చేసినట్లు మీడియా తెలిపింది. దాడుల గురించి త్వరలోనే స్పష్టత ఇస్తామని బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ చెప్పారు. బ్రసెల్స్ దాడులతో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాల న్యాయ, హోం శాఖ మంత్రులు త్వరలోనే బ్రసెల్స్‌లో భేటీ అయి ఉగ్రవాద పోరుకు కార్యాచరణ రూపొందించనున్నారు. పెద్ద ఎత్తున నివాళి వరుస పేలుళ్లతో 31 మంది మరణించిన ఘటన షాక్ నుంచి బెల్జియం ఇంకా తేరుకోలేదు. బ్రసెల్స్‌లోని ‘ప్లేస్ డి లా బౌర్స్’ అనే సెంటర్ వద్దకు ప్రజలు పెద్దఎత్తున వచ్చి నివాళులర్పించారు. తామంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని, ప్రపంచమంతా తమతో ఉందంటూ సందేశమిస్తున్నారు. ఇస్లామిక్ స్టే ట్ జిహాదీలు యూరప్‌లో మరిన్ని దాడులకు పాల్పడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో 162 మందిని మలేసియాలోని కౌలాలంపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దెస్లామ్‌కు తెలియదు పారిస్ దాడుల నిందితుడైన సలాహ్ అబ్దెస్లామ్‌కు బ్రసెల్స్ పేలుళ్ల గురించి తెలియదని అతడి న్యాయవాది స్వెన్ మేరీ చెప్పారు. అబ్దెస్లామ్ను జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారన్నారు. బెల్జియంలో దాడులకు ముందు అబ్దెస్లామ్ బ్రసెల్స్‌లో పట్టుబడిన సంగతి తెలిసిందే. అబ్దెస్లామ్పై బెల్జియం పోలీసులు అభియోగాలు నమోదుచేయగా, విచారణ నిమిత్తం అతడిని అప్పగించాలని ఫ్రాన్స్ అధికారులు కోరారు. వెంటనే తనను ఫ్రాన్స్‌కు అప్పగించాలని అబ్దెస్లామ్ చెప్పాడని, దీనిని వ్యతిరేకించవద్దని మేజిస్ట్రేట్‌ను కోరతానని మేరీ పేర్కొన్నారు. భారతీయుడి చివరి ఫోన్ కాల్ గుర్తింపు పేలుళ్ల అనంతరం గల్లంతైన భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేంద్రన్ గణేశ్ చివరి ఫోన్‌కాల్‌ను అధికారులు గుర్తించారు. బెంగళూరు ఇన్ఫోసిస్‌కు చెందిన గణేశ్ చివరి కాల్‌ను బ్రసెల్స్‌లో మెట్రో రైల్లో మాట్లాడినట్లు కనుగొన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్లో తెలిపారు. ఆయన ఆచూకీ కోసం ఎంబసీ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement