-
ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా!
టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
గోవాలో ఘనంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి న్యూ ఫోటోలు
-
Rakul-Jackky Wedding : ఫస్ట్ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్ ఫిదా!
లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంతో కపుల్‌గా మారిపోయారు. గోవాలో అత్యంత ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి సందడి కబుర్లే. రకుల్-భగ్నానీ వెడ్డింగ్ వేడుకుల వీడియోలు, ఫోటోలు కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఇప్పటికి ఈ జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మెహిందీ, సంగీత వేడుక వీడియోను బ్రైడ్స్ టుడేఇన్ ఇన్‌స్టా షేర్ చేసింది. ఇందలో తుం బినే సాంగ్‌కు వీరిద్దరూ స్టెప్పులేయడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుటోంది. View this post on Instagram A post shared by Brides Today (@bridestodayin) -
రకుల్-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ వైరల్
PM Modi Wishes to Rakul-Jackky: మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీభగ్నానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఒక నోట్‌ను స్వయంగా రకుల్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్, జాకీ ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. Your blessings touch our hearts deeply, Prime Minister @narendramodi ji. Thank you for your kind wishes as we begin this meaningful new chapter.@Rakulpreet pic.twitter.com/6VOfWhzl68 — Jackky Bhagnani (@jackkybhagnani) February 22, 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు రకుల్-జాకీ జంట. దీంతో కొత్తగా పెళ్లయిన ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ చేరడం విశేషంగా నిలిచింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ రకుల్-జాకీ పెళ్లికి హజరుకాలేక పోయానని తెలిపిన మోదీ నూతన దంపతులకు స్పెషల్ ఆశీర్వాదాలు అందించారు. తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా, పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి తొలి ప్లాన్‌ను గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. -
ప్రియుడిని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికూతురిగా ముస్తాబైంది. మనసిచ్చినవాడితో మనువాడింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగ్గా జరిగింది. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు. మూడు రోజుల నుంచే సంబరాలు ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్‌లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అప్పుడే లీక్ చేసింది కాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్‌లో బయటపెట్టింది. అప్పటినుంచి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పైనా ఫోకస్ చేసింది. ఇన్నాళ్లకు ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 సినిమా చేస్తోంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్ పండగకు థియేటర్లలో రిలీజ్ కానుంది. చదవండి: సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. జెన్నిఫర్ లోపెజ్ సినిమాలో అలా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement