-
Narcotics Control Bureau: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్.. డీఎంకే మాజీ నేత అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారిగా, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్ (36)ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఇటీవల ఎన్సీబీ సుమారు రూ.2 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను బ్యూరో ఛేదించడం తెలిసిందే. సాదిక్ పలు తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తమిళ, హిందీ సినీ రంగ ప్రముఖులతో అతనికి సంబంధాలున్నాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. ‘‘పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాదిక్ నుంచి ముడుపులందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని చెప్పారు. అతనిపై త్వరలో మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మూడు దేశాలకు స్మగ్లింగ్ భారత్ నుంచి కొబ్బరి పొడి, మిక్స్ ఫుడ్ పౌడర్‌లో కలిపిన సూడోఎఫెడ్రిన్ తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2023 డిసెంబర్లో ఎన్సీబీకి ఉప్పందించాయి. ఢిల్లీలో సాదిక్‌కు చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడోఎఫెడ్రిన్ దొరికింది. దీన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియాకు తరలిస్తున్న రాకెట్లో సాదిక్ కీలక సూత్రధారిగా తేలాడు. పైరేటెడ్ సీడీల నుంచి మొదలైన దందా సాదిక్ దందా పైరేటెడ్ సీడీలతో మొదలైంది. కెటమైన్ డ్రగ్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు స్మగ్లింగ్ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్‌కు అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది! -
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ
కమలాపురం: పట్టణంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈఓ శైలజ తనిఖీ చేశారు. ఈనెల 17వ తేదీ నుంచి జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు సోషియల్ పేపర్- 2 పరీక్ష జరుగుతున్న కేంద్రాలను ఆమె పరిశీలించారు. అలాగే స్క్వాడ్ అధికారి జాఫర్ సాదిక్ కూడా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మూడు పరీక్షా కేంద్రాల్లో 655 మంది పరీక్షలు రాశారు. 11 రోజుల పాటు పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement