-
జిహాదీ జాక్ దొరికిపోయాడు
సిరియా: జిహాదీ జాక్ పట్టుబడ్డాడు. కుర్దీష్ ఫైటర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో జాక్ చేరినట్లుగా అతడిపై నేరారోపణలు ఉన్న విషయం తెలిసిందే. బ్రిటన్ సంతతికి చెందిన జాక్ ఆక్స్‌ఫర్డ్‌లో ఉండేవాడు. అక్కడ నుంచే చెర్వెల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. జాన్ లెట్స్(55), శాలీలేన్(54) కుమారుడైన జాక్.. తర్వాత ఇస్లాం మతంలోకి మారిపోయాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే నేరుగా సిరియా వెళ్లి అక్కడ ఐసిస్‌లో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం అతడిని కుర్దీష్ల ఆదీనంలో ఉన్న జైలులో ఉంచినట్లు లండన్‌కు చెందిన అల్ అరబీ అనే ఓ వార్తా చానెల్ తెలిపింది. ‘నేను మా అమ్మను చూడాలని అనుకుంటున్నాను. ఆమెకు కొన్ని విషయాలు వివరించాలి’ అని కుర్దీష్లకు పట్టుబడిన తర్వాత చెప్పాడంట. బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న జిహాదీ జాక్ 2014లో సిరియా వెళ్లడమే కాకుండా ఓ ఇరాకీ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి మహ్మద్ అనే కుమారుడు కూడా ఉన్నట్లు అధికారులు గతంలోనే తెలుసుకున్నారు. ఐసిస్‌లో చేరడానికి ముందు జాక్‌గా ఉన్న తన పేరును అబూ మహ్మద్ అని మార్చుకున్నాడు. సిరియాలో ఉన్న సమయంలో పలు రకాల ఆయుధాలు ధరించి వీడియోల్లో చూపిస్తూ జిహాదీ జాన్ మాదిరిగా తానిప్పుడు పనిచేస్తున్నానంటూ వీడియోలో పోస్ట్ కూడా చేశాడు. ఐసిస్‌లో అత్యంత క్రూరంగా బందీల పీకలు కోసే ఓ ముసుగు వ్యక్తి జిహాదీ జాన్. అతడి స్థానంలోనే తాను పనిచేస్తున్నానంటూ జాక్ పోస్టింగ్‌లు చేసినా ఐసిస్ నుంచి మాత్రం ఎలాంటి నిర్ధారణ రాలేదు. అయితే, ఐసిస్‌లో ఉండే పనిచేస్తున్నాడని మాత్రం ధ్రువీకరించారు. -
కరుణతో వస్తాడో.. కసాయి అవుతాడో..!
లండన్: జిహాదీ జాన్.. ఈ పేరు ఇప్పుడు దాదాపుగా అందరికీ సుపరిచితమే.. కసాయి అనే పదం అతడికి సరిగ్గా సరిపోతుంది. నల్లటి ముసుగు ధరించి కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఉండి చేతులో ఓ పదునైనా కత్తితో కెమెరా ముందు నిల్చుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లిన అమాయకుల గొంతుకలను కోసిపారేసి కరడుగట్టిన ఉన్మాది. మొన్న అమెరికా జరిపిన వైమానికి దాడుల్లో ప్రాణాలుకోల్పోయాడని ఇస్లామిక్ స్టేట్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆ పేరు మాసిపోతుందనగా ఇప్పుడు అదే పేరును తలపించేలా మరోపేరు తెరపైకి వచ్చింది. అదే 'జిహాదీ జాక్'. ఇతడు జిహాదీ జాన్ తమ్ముడా అని అనుకుంటే పొరబడ్డట్టే.. ఎందుకంటే, జిహాదీ జాక్ అనే వ్యక్తి ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన తొలి బ్రిటన్ సిటిజన్ గా కనిపించనున్నాడు. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ లో చెర్వెల్ పాఠశాలలో విద్యనభ్యసించిన జాక్ లెట్స్ అనే ఇతడు మంచి విద్యార్థి, ఫుట్ బాల్ ప్లేయర్, చురుకైనా వాడు, ఎప్పుడూ స్నేహితులతో చలాకీగా ఉండేవాడు. 18 ఏళ్లు వచ్చేసరికి కువైట్‌లో అరబిక్ విద్యను అభ్యసిస్తానని వెళ్లిన అతడు అనూహ్యంగా ఐసిస్ లో చేరాడు. తాను సిరియా వెళ్లి ఉగ్రవాదుల్లో చేరిపోయానని 2014 సెప్టెంబర్ లో చెప్పినట్లు అతడి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. జాక్ తల్లిదండ్రులు ఆక్స్ ఫర్డ్ నగరంలో నివసిస్తున్నారు. ఏ క్షణం తమ కుమారుడికి ఏమవుతుందో అని ఒక తల్లిదండ్రులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు అతడు అలా ఎందుకు మారాడో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు, స్నేహితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గతవారం 100 మంది ఉగ్రవాదులవరకు చనిపోయారు. అయితే, ఈ ఫైటింగ్ లో జిహాదీ జాక్ పాల్గొన్నాడో లేదో తెలియడం లేదు. ఏదేమైనా తనతల్లిదండ్రుల కోరిక నెరవేరి తిరిగి జాక్ ఇంటికి వస్తాడో.. లేక ఇటీవల ప్రాణాలు కోల్పోయిన జిహాదీ జాన్ గా మారి అమాయకుల ప్రాణాలు హరిస్తాడో చూడాలి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్‌కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్‌కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement