-
మామ రాజకీయ ఎంట్రీపై ధనుష్...!
ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిదే. రజనీ ఇటీవల అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, ఇస్తున్న సంకేతాలు, ఆయన సన్నిహితులు చెప్తున్న మాటలు.. కచ్చితంగా రజనీ రాజకీయాల్లోకి వస్తారనే చాటుతోంది. తన తాజా చిత్రం ‘రోబో-2’ విడుదలైన అనంతరం ‘బిగ్ అనౌన్స్మెంట్’ చేస్తానని రజనీ సైతం ప్రకటించారు. ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశముందని వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆయన అల్లుడు, హీరో ధనుష్‌ను అడిగితే.. ఆయన ఒకింత దాటవేత ధోరణి అవలంబించారు. ధనుష్ తాజాచిత్రం ‘వీఐపీ-2’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రజనీ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందా? అంటూ ధనుష్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘మీరు ఆహ్వాన పత్రిక చూశారు కదా.. అందులో రాజకీయాల గురించి ప్రశ్నించకూడదని ఉంది’ అంటూ సమాధానం దాటవేయబోయారు. అయినా విలేకరులు పట్టుబట్టడంతో ధనుష్ స్పందించారు. నటులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందా? అన్న ప్రశ్నకు ‘వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదనే అభిప్రాయం మీకేమైనా ఉందా? మీ అభిప్రాయం మీ దగ్గర పెట్టుకుండి. నా అభిప్రాయం నాకుంది. అది నాదగ్గరే పెట్టుకుంటాను’ అని ముగించారు. -
నేనా..రాజకీయాల్లోకా
నేనా? రాజకీయాల్లోకా? ఇప్పుడే కాదు భవిష్యత్‌లో కూడా వచ్చే ఆలోచన లేదు అంటున్నారు నటి త్రిష. ఇంతకు ముందే త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అవుతోందని ప్రచార మాధ్యమాలు సంచలనం సృష్టించాయి. రానున్న శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు ప్రచారం హోరెత్తింది. దీంతో రాజకీయాల్లోనూ కలకలం చెలరేగింది. అయితే దీనికి నటి త్రిష కూడా కారణం కాకపోలేదు. ఆమె ముఖ్యమంత్రి జయలలితతో తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఆమెకు రాజకీయ రంగ ప్రవేశ ఆలోచన ఉన్నట్టు మీడియా ప్రచారం దుమ్మురేపింది.దీంతో ఉలిక్కిపడ్డారో, లేక మనసు మార్చుకున్నారో లేక హితులెవరైనా ఇప్పుడే తొందర పడవద్దని హితవు పలికారోగాని త్రిష తనకు రాజకీయ రంగ ప్రవేశ ఆలోచన లేదని వివరణ ఇచ్చారు. దీని గురించి త్రిష తన ట్విట్టర్లో పేర్కొంటూ నాకు రాజకీయ రంగ ప్రవేశ ఆలోచన లేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి రాను అని అన్నారు. అయినా ఇలాంటి సంచలనాలకు కారణం అవడం త్రిషకు మామూలే. ప్రస్తుతం ఈమె నటిగా యమబిజీగా ఉన్నారు. తమిళంలో నాలుగు, తెలుగులో మూడు చిత్రాలు చేస్తున్నారు. తమిళంలో జయంరవితో నటించిన సకలకళావల్లవన్ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. కమలహాసన్ సరసన తూంగావనంతో పాటు అరణ్మణై2 చిత్రంలో నటిస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రజనీకాంత్ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్‌తో.. (ఫోటోలు)
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
గ్రాండ్‌గా జరిగిన 'డర్టీ ఫెలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ
సెల్‌ఫోన్స్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
తప్పక చదవండి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
Advertisement