-
18 మంది జూదరుల అరెస్ట్
రూ.85 వేలు నగదు, 11 ద్విచక్రవాహనాలు సెల్ఫోన్లు స్వాధీనం కళ్యాణదుర్గం: మండల పరిధిలోని కుర్లపల్లి సమీపంలోని పేకాట స్థావరంపై ఆదివారం దాడులు చేసి 18 మంది జూదరులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, ద్విచక్రవాహనాలు, సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై మూకుమ్మడిగా దాడి చేసి జూదరులతోపాటు వారి నుంచి రూ.85 వేల నగదు, 11 ద్విచక్రవాహనాలు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. -
కొంప కొలాప్స్
ఇళ్లు.. లాడ్జీలు.. పొలాలు.. ఖాళీ స్థలాలు.. కావేవీ పేకాటకనర్హం అన్నట్లుంది. ఒకప్పుడు ఎక్కడో మారుమూల గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించే పేకాట కేంద్రాలు ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. వీటికి రాజకీయ నేతల అండదండలు మెండుగా ఉండడం విశేషం. నగరంలో జోరుగా పేకాట - నిర్వాహకులకు రాజకీయ అండ - మిన్నకుండిపోతున్న పోలీసులు - ఇల్లు గుల్ల చేసుకుంటున్న జూదరులు - గగ్గోలు పెడుతున్న గృహిణులు విజయవాడ సిటీ : గతంలో పేకాట కోసం పొరుగు జిల్లాలు, చెన్నై వంటి నగరాలకు జూదరులు వెళ్లేవారు. ఇప్పుడు అందుబాటులోనే ‘కోత ముక్క’లాట నడుస్తుండటంతో లక్షలు పట్టుకుని ఇక్కడికి చేరుకుంటున్నారు. పేకాట వ్యసనంతో అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతుంటే.. ఆర్గనైజర్లు మాత్రం ‘బంకినీ’ (నిర్వాహకుల కమీషన్) రూపంలో లక్షలు ఆర్జిస్తున్నారు. కొందరు పెద్దల కోరిక మేరకు దాడులు వద్దంటూ పోలీసు బాస్‌లు మౌఖికంగా ఆదేశించడంతో కిందిస్థాయి అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు లక్షలాది రూపాయలను నెలవారీ మామూళ్ల రూపంలో గుంజుతున్నారని సమాచారం. నగరంలో నిర్వహిస్తున్న పేకాటపై గృహిణులు మండిపడుతున్నా పోలీసుల్లో మాత్రం చలనం లేదు. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అనధికారిక పేకాట క్లబ్‌లలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఊరికి సమీపంలోని పొలాల్లో షామియానాలు, పాకలు వేసి పేకాటలు నిర్వహిస్తున్నారు. ఏలూరు, గుంటూరు నగరాల నుంచి ఖరీదైన కార్లలో పేకాటరాయుళ్లు వచ్చి జూదంలో బలవుతున్నారు. రామవరప్పాడు వంతెన సమీపంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి డ్రైవర్ ఏర్పాటు చేసిన పేకాట శిబిరానికి రోజూ 100 నుంచి 150 మంది జూదరులు వస్తుంటారు. ఒక్కొక్కరు లక్ష రూపాయలకు తక్కువ తీసుకురారంటే అక్కడ జరిగే పేకాట ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పటమట, పెనమలూరు, పోరంకి, తాడిగడప వంటి ప్రాంతాల్లో రోజువారీ పద్ధతిలో అతిథి గృహాలను అద్దెకు తీసుకుని మరీ పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నారు. ఇక హోటల్స్, లాడ్జీల్లో పేకాట సర్వసాధారణంగా మారింది. సకల సౌకర్యాలు పేకాటరాయుళ్లకు నిర్వాహకులు అన్ని వసతులు సమకూరుస్తున్నారు. మద్యం, ఖరీదైన భోజనంతోపాటు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏసీ గదులు కూడా ఏర్పాటుచేస్తారు. ఆడేవారితో పాటు చూసేందుకు వచ్చే వారికి కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆటలో తెచ్చిన నగదు పోగొట్టుకుంటే ఫైనాన్స్ సౌకర్యం కూడా ఏర్పాటుచేస్తారు. ఉదయం రూ.10 వేలు తీసుకుంటే సాయంత్రానికి రూ.12 వేలు జమచేయాలి. లేదంటే ఇంటి కాగితాలు, విలువైన భూములు తనఖా పెట్టాల్సి ఉంటుంది. పోలీసులకు తెలిసే.. నగరంలో విస్తరించిన పేకాట మాఫియా పోలీసులకు తెలియనిదేమీ కాదు. పై అధికారులు ఆదేశాలున్నాయంటూ దాడులకు దూరంగా ఉంటున్నారు. కొందరు పోలీసులు మాత్రం నిర్వాహకులను బెదిరించి డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులకు కూడా భారీగానే మామూళ్లు ముడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల రామవరప్పాడు సమీపంలో పోలీసులు దాడి చేసి పేకాటరాయుళ్ల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి రాక ముందే తెలియడంతో నిర్వాహకుల సూచన మేరకు పేకాటరాయుళ్లు పరారయ్యారు. ఈ దాడికి పోలీసుల్లో నెలకొన్న అభిప్రాయభేదాలే కారణమని కమిషనరేట్ వర్గాల సమాచారం.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్‌లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement