-
జోరందుకున్న వైఎస్ఆర్ సీపీ నామినేషన్ల పర్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పలువురు బధవారం పలు నియోజకవర్గాలలో తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమాలలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులు: కాకినాడ లోక్‌సభ స్థానం: చెలమశెట్టి సునీల్ రాజమండ్రి లోక్‌సభ స్థానం: బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి నర్సాపురం లోక్ సభ స్థానం: వంకా రవీందర్ నామినేషన్ తిరుపతి లోక్‌సభ స్థానం :డా. వరప్రసాదరావు అనంతపురం లోక్‌సభ స్థానం: అనంత వెంకట్రామిరెడ్డి నర్సారావుపేట లోక్‌సభ స్థానం : ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అనకాపల్లి లోక్‌సభ స్థానం : గుడివాడ అమర్న్నాథ్ శాసనసభ స్థానాలకు నామినేషన్లు వేసినవారు: జగ్గయ్యపేట: సామినేని ఉదయభాను రాజమండ్రి సీటి : బొమ్మన రాజకుమార్ కాకినాడ సీటి :ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడ రూరల్: శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జగ్గంపేట : జ్యోతుల నెహ్రూ రాజోలు : బొంతు రాజేశ్వరరావు ముమ్మిడివరం : గుత్తుల సాయి ధర్మవరం: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాప్తాడు: తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పెనుకొండ : శంకర్‌నారాయణ ఆళ్లగడ్డ: భూమా శోభానాగిరెడ్డి మంత్రాలయం : బాలనాగిరెడ్డి బాపట్ల కూన రఘుపతి రాజోలు : గొంతు రాజేశ్వరరావు ఎచ్చర్ల గొర్లు కిరణ్‌కుమార్ ఆముదాలవలస: తమ్మినేని సీతారాం తాడిపత్రి : వీఆర్ రామిరెడ్డి కావలి: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. సర్వేపల్లి :కాకాని గోవర్దన్‌రెడ్డి వెంకటగిరి: కొమ్మి లక్ష్మయ్యనాయుడు సూళ్లూరుపేట : కె.సంజీ వయ్య విశాఖపట్నం నార్త్: చొక్కాకుల వెంకట్రావు కొవ్వూరు: తానేటి వనిత మైదుకూరు: ఎస్.రఘురామిరెడ్డి రాయచోటి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రొద్దుటూరు : రాచమల్లు ప్రసాదరెడ్డి అనకాపల్లి : కొణతాల రఘునాథ్ చోడవరం: కరణం ధర్మశ్రీ పొన్నూరు: రావి వెంకట రమణ తెనాలి : అన్నాబత్తుని శివకుమార్ రాజంపేట: ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సత్యవేడు : ఆదిమూలం పాతపట్నం: కలమట వెంకట రమణ సింగనమల : జొన్నలగడ్డ పద్మావతి రాయదుర్గం : కాపు రామచంద్రారెడ్డి చిలకలూరిపేట : మర్రి రాజశేఖర్ మంగళగిరి : ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రత్తిపాడు : ఎం.సుచరిత పెదకూరపాడు : బొల్లా బ్రహ్మనాయుడు నర్సారావుపేట : డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైల్వేకోడూరు : కొరుముట్ల శ్రీనివాసులు తణుకు : చీర్ల రాదయ్య భీమిలి : కర్రి సీతారాం విశాఖ సౌత్: కోలా గురువులు కొండెపి: జూపూడి ప్రభాకరరావు కందుకూరు : పోతుల రామారావు అద్దంకి : గొట్టిపాటి రవికుమార్ చీరాల : ఎడం బాలాజీ దర్శి : బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బొబ్బిలి : సుజయకృష్ణరంగారావు పార్వతీపురం : జె.ప్రసన్న కుమార్ నెల్లిమర్ల : పెన్మత్స సురేష్ అమలాపురం : గొల్ల బాబూరావు పూతలపట్టు డాక్టర్ సునీల్‌కుమార్ -
తెరపైకి మూడో కృష్ణుడు
సాక్షి, కాకినాడ :ఒకటో కృష్ణుడైపోయాడు..రెండో కృష్ణుడైపోయాడు..ఇప్పుడు మూడో కృష్ణుడు తెరపైకి వచ్చాడు. కాకినాడ పార్లమెంట్ స్థానం కోసం తెలుగుదేశంలో సీట్ల సిగపట్లు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కాకినాడ ఎంపీ సీటుపై కన్నేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని కలిసిన చిక్కాల తన మనసులోని మాట బయట పెట్టారు. పార్టీకి వీరవిధేయుడిగా పనిచేస్తున్న తనకు కాకినాడ ఎంపీ సీటు లేదా కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరగా, పరిశీలిస్తామంటూ ‘బాబు’ బదులివ్వడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాకినాడ ఎంపీ సీటు ఇస్తామంటూ పోతుల వెంకట విశ్వాన్ని పార్టీలోకి ఆహ్వానించారు. విశ్వం ఎంపీగా సరిపోడంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును తెరపైకి తీసుకొచ్చేందుకు పార్టీలోని ఒక వర్గం చాపకింద నీరులా ప్రయత్నాలు సాగించింది. ఇంతలో మామ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు నెరిపిన రాజకీయ మంత్రాంగంతో టీడీపీ గూటికి చేరిన మాజీ మంత్రి తోట నరసింహం ఇదే సీటుపై కన్నేశారు. అంతటితో ఆగకుండా బాబు జాబితా విడుదల కాకుండానే కాకినాడ ఎంపీ సీటు నాదేనంటూ ప్రకటించి పార్టీలో కలకలం సృష్టించారు. ఇప్పుడు తాజాగా పార్టీకి చెందిన మరో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు చిక్కాల రామచంద్రరావు కాకినాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా పని చేసిన చిక్కాలను సామాజిక సమీకరణలను సాకుగా చూపి 2009లో పక్కన పెట్టేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వద్దుమొర్రో అంటున్నప్పటికీ చిక్కాలను బలవంతంగా రామచంద్రపురం నుంచి బరిలోకి దింపి బలిపశువును చేశారు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన తోట త్రిమూర్తులుకు టీడీపీ ఓటుబ్యాంక్‌ను మళ్లించ డంతో చిక్కాలకు కనీసం డిపాజిట్‌కు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. రాష్ర్ట స్థాయిలో సాగిన కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు చిక్కాల బలైపోయారు. ఆర్థికంగా చితికిపోయారు. సుదీర్ఘ రాజకీయానుభవం కల్గిన చిక్కాలకు పిలిచి టికెట్ ఇస్తారని అతని అనుచరులు ఇన్నాళ్లు ఆశించారు. కానీ వలస పక్షులకే పెద్ద పీట వేస్తున్న బాబు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే చిక్కాల వంటి నాయకులకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పార్టీ శ్రేణులు మథనపడుతున్నారు. అనుచరుల ఒత్తిడి మేరకు బాబును కలిసిన చిక్కాల తన మనసులోని మాట బయటపెట్టారు. తమ నాయకునికి కాకినాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని, లేకుంటే కనీసం కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని చిక్కాల వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. 2009లో కాకినాడ ఎంపీ సీటు బీసీలకు ఇస్తాం ఈసారి తప్పుకోండ ని చెప్పడంతో బాబు ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. 2012 ఉపఎన్నికల్లో కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి గెలుపోటములతో సంబంధం లేకుండా రామచంద్రపురం నుంచి పోటీ చేశారని చెబుతున్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నిక సమయంలో కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ బాబు మొండిచేయే చూపారని, సీనియర్ అయిన చిక్కాలను కాదని ఎలాంటి అనుభవం లేని టీడీపీ పశ్చిమ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మికి ఇచ్చారని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితిపై పార్టీలో సైతం చర్చకు దారి తీస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement